Updated : 08 Jan 2020 13:10 IST

అదరగొడుతోన్న యశ్‌ న్యూ లుక్‌

‘కేజీఎఫ్‌-2’ కొత్త పోస్టర్‌ ఆగయా

హైదరాబాద్‌: పాన్‌ ఇండియా చిత్రంగా భారీ విజయాన్ని అందుకున్న కన్నడ చిత్రం ‘కేజీఎఫ్‌’. ఈ చిత్రంతో కన్నడ రాక్‌స్టార్‌ యశ్‌ అందరికీ సుపరిచితుడయ్యారు. ప్రస్తుతం ‘కేజీఎఫ్‌ చాప్టర్‌2’ పేరుతో ఈ సినిమాకు రెండో భాగం తెరకెక్కుతోంది. క్రిస్మస్‌ కానుకగా విడుదల చేసిన ‘కేజీఎఫ్‌ చాప్టర్‌2’ ఫస్ట్‌లుక్‌ ప్రేక్షకులను ఎంతగానో అలరించిన విషయం తెలిసిందే. బుధవారం యశ్‌ పుట్టినరోజు పురస్కరించుకుని ‘కేజీఎఫ్‌2’ న్యూలుక్‌ను చిత్రబృందం విడుదల చేసింది. అయితే ఈరోజు టీజర్‌ను విడుదల చేయాలని భావించినప్పటికీ కొన్ని కారణాల వల్ల విడుదల చేయలేకపోతోన్నట్లు దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ తెలియజేశారు.

‘హాయ్‌.. 6వ తేదీ వరకూ షూటింగ్‌ జరగడంతో 7వ తేదీన ఇక్కడికి చేరుకున్నాం. దీంతో జనవరి 8న యశ్‌ పుట్టినరోజు సందర్భంగా ‘కేజీఎఫ్‌ చాప్టర్‌ 2’ టీజర్‌ను విడుదల చేయలేకపోతున్నాం. ‘కేజీఎఫ్‌2’ మీద మీరు చూపిస్తున్న ప్రేమాభిమానాలు చాలా గొప్పవి. ‘కేజీఎఫ్‌‌2’ ఉత్తమంగా మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నాం. అందుకు తగ్గట్టు మేము కూడా ఎక్కడ రాజీ పడడం లేదు. మీకు ది బెస్ట్‌ అందించడానికి ఆలస్యమవుతున్నందుకు క్షమించండి. యశ్‌ పుట్టినరోజును పురస్కరించుకుని జనవరి 8న  ఉదయం 10.08 గంటలకు ‘కేజీఎఫ్‌ 2’ సెకండ్‌ లుక్‌ను విడుదల చేస్తాం. అది మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని భావిస్తున్నాను’ అని ప్రశాంత్‌ నీల్‌ తెలిపారు.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని