బుట్టబొమ్మ.. వీడియో అదుర్స్‌ అమ్మ..!

‘బుట్టబొమ్మా బొట్టబొమ్మా..’ అంటూ శ్రోతల్ని ఊపేస్తున్న ‘అల వైకుంఠపురములో..’ని పాట వీడియో టీజర్‌ వచ్చేసింది. స్టైలిష్‌స్టార్‌ అల్లు అర్జున్‌ స్టెప్పులు, ముద్దుగుమ్మ పూజా హెగ్డే అందం, కలర్‌ఫుల్‌ విజువల్స్‌ పాటలకు మరింత వన్నె తెచ్చిపెట్టాయి. ‘మీకు బుట్టబొమ్మ పాట......

Published : 08 Jan 2020 14:51 IST

మరిన్ని సర్‌ప్రైజ్‌లు ఉన్నాయి: బన్నీ

హైదరాబాద్‌: ‘బుట్టబొమ్మా బొట్టబొమ్మా..’ అంటూ శ్రోతల్ని ఊపేస్తున్న ‘అల వైకుంఠపురములో..’ని పాట వీడియో టీజర్‌ వచ్చేసింది. స్టైలిష్‌స్టార్‌ అల్లు అర్జున్‌ స్టెప్పులు, ముద్దుగుమ్మ పూజా హెగ్డే అందం, కలర్‌ఫుల్‌ విజువల్స్‌ పాటలకు మరింత వన్నె తెచ్చిపెట్టాయి. ‘మీకు బుట్టబొమ్మ పాట, విజువల్స్‌, నా స్టెప్పులు నచ్చుతాయని ఆశిస్తున్నా. పూర్తి పాటలో ఇంకా చాలా సర్‌ప్రైజ్‌లు ఉన్నాయి. జనవరి 12న థియేటర్‌లో కలుద్దాం..’ అంటూ ఈ వీడియోను బన్నీ ట్విటర్‌లో షేర్‌ చేశారు. ఈ పాట విడుదలైన కొన్ని నిమిషాల్లోనే 4.6 లక్షలకుపైగా వ్యూస్‌ను దక్కించుకోవడం విశేషం. 64 వేల మంది లైక్‌ చేశారు. తమన్‌ బాణీలు అందించిన ఈ పాటను అర్మాన్‌ మాలిక్‌ ఆలపించారు.

‘అల వైకుంఠపురములో..’ సినిమాకు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వం వహించారు. అల్లు అరవింద్‌, ఎస్‌. రాధాకృష్ణ నిర్మాతలు. టబు, నివేదా పేతురాజ్‌, రాజేంద్ర ప్రసాద్‌, జయరాం, సుశాంత్‌, వెన్నెల కిశోర్‌, సునీల్‌, నవదీప్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. త్రివిక్రమ్‌-బన్నీ కాంబినేషన్‌లో వస్తోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని