భయపెట్టడానికి భాషతో పనిలేదు..!

భయపెట్టడానికి భాషతో పనిలేదని నిరూపించింది ‘సైకో’ చిత్ర బృందం. ఉదయనిధి స్టాలిన్‌, అదితిరావు హైదరి, నిత్యా మేనన్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ఇది. మిస్కిన్‌ దర్శకుడు. ఇళయరాజా బాణీలు అందించారు. ఈ సినిమా ట్రైలర్‌ను బుధవారం విడుదల చేశారు. క్రైమ్‌ థ్రిల్లర్‌గా....

Published : 08 Jan 2020 21:46 IST

ఉత్కంఠగా ‘సైకో’ ట్రైలర్‌

హైదరాబాద్‌: భయపెట్టడానికి భాషతో పనిలేదని నిరూపించింది ‘సైకో’ చిత్ర బృందం. ఉదయనిధి స్టాలిన్‌, అదితిరావు హైదరి, నిత్యా మేనన్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ఇది. మిస్కిన్‌ దర్శకుడు. ఇళయరాజా బాణీలు అందించారు. ఈ సినిమా ట్రైలర్‌ను బుధవారం విడుదల చేశారు. క్రైమ్‌ థ్రిల్లర్‌గా చిత్రాన్ని రూపొందించినట్లు వీడియోను బట్టి తెలుస్తోంది. ఈ ప్రచార చిత్రంలో ఒక్క డైలాగ్‌ కూడా లేదు.. కేవలం మ్యూజిక్‌తోనే సాగడం విశేషం. అతిదిరావు ఓపక్క బ్యూటిఫుల్‌గా కనిపిస్తూనే.. మరోపక్క సస్పెన్స్‌ పాత్రలో అలరించారు. దాదాపు అన్ని సన్నివేశాల్ని చీకటిలోనే చిత్రీకరించారు. ఉదయనిధి స్టాలిన్‌ అంధుడి పాత్రలో నటించినట్లు తెలుస్తోంది. హత్యలు, పోలీసులు నేపథ్యంలో ఉన్న ఈ ట్రైలర్‌ సినిమాపై ఆసక్తిని పెంచింది. త్వరలో ఈ సినిమా విడుదల కాబోతోంది.

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని