ఆల్‌ టైమ్‌ రికార్డ్‌గా బన్నీ సినిమా

స్టైలిష్‌స్టార్‌ అల్లుఅర్జున్‌ ‘అల..వైకుంఠపురములో’ సినిమా ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లతో బాక్సాఫీస్‌ వద్ద దూసుకువెళ్తోంది. విడుదలైన పదిరోజుల్లోనే రూ.200 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టిందని సినీ విశ్లేషకులు అంచనా వేశారు. ప్రపంచవ్యాప్తంగా రూ.220 కోట్లు (గ్రాస్‌) రాబట్టిందని...

Updated : 22 Jan 2020 12:20 IST

రూ.220 కోట్ల వసూళ్లతో దూసుకుపోతున్న ‘అల..వైకుంఠపురములో’

హైదరాబాద్‌: స్టైలిష్‌స్టార్‌ అల్లుఅర్జున్‌ ‘అల..వైకుంఠపురములో’ సినిమా ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లతో బాక్సాఫీస్‌ వద్ద దూసుకువెళ్తోంది. విడుదలైన పదిరోజుల్లోనే రూ.200 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టిందని సినీ విశ్లేషకులు అంచనా వేశారు. ప్రపంచవ్యాప్తంగా రూ.220 కోట్లు (గ్రాస్‌) రాబట్టిందని, ఇది ఆల్‌ టైమ్‌ రికార్డని తెలిపారు. కేవలం పదిరోజుల్లోనే ఈ సినిమా రూ.143 కోట్లు (షేర్స్‌) రాబట్టినట్లు చెప్పారు. ఇది నాన్‌ బాహుబలి-2 రికార్డ్‌ అని వారు పేర్కొన్నారు. నిజాంలో రూ.35.69 కోట్లు, సీడెడ్‌లో రూ.18.07 కోట్లు, వైజాగ్‌లో రూ.18.80 కోట్లు, గుంటూరులో రూ.9.93 కోట్లు, తూర్పుగోదావరిలో రూ.9.89 కోట్లు, పశ్చిమ గోదావరిలో రూ.7.65 కోట్లు, కృష్ణాలో రూ.8.80 కోట్లు, నెల్లూరులో రూ.4.07 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో రూ.112.90 కోట్లు, కర్ణాటకలో రూ.10.70 కోట్లు వసూలు చేసినట్లు సినీ విశ్లేషకులు అంచనా వేశారు.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌, అల్లుఅర్జున్‌ క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘అల..వైకుంఠపురములో’ సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో బన్నీకి జంటగా పూజా హెగ్డే నటించారు. టబు, రాజేంద్రప్రసాద్‌, మురళీశర్మ, సుశాంత్‌, నివేదా పేతురాజు కీలకపాత్రలు పోషించారు. తమన్‌ స్వరాలు అందించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని