నా వల్ల కాదే.. అంటున్న ఆకాశ్‌ పూరి

ఆకాశ్‌ పూరి, కేతిక శర్మ జంటగా నటించిన చిత్రం ‘రొమాంటిక్‌’. అనిల్‌ పాడూరి దర్శకుడు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమాలోని ‘నా వల్ల కాదే..’ అంటూ సాగే గీతాన్ని శుక్రవారం చిత్ర బృందం విడుదల చేసింది. సునీల్‌ కశ్యప్‌ స్వరాలకు...

Updated : 16 Sep 2022 14:22 IST

హైదరాబాద్‌: ఆకాశ్‌ పూరి, కేతిక శర్మ జంటగా నటించిన చిత్రం ‘రొమాంటిక్‌’. అనిల్‌ పాడూరి దర్శకుడు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమాలోని ‘నా వల్ల కాదే..’ అంటూ సాగే గీతాన్ని శుక్రవారం చిత్ర బృందం విడుదల చేసింది. సునీల్‌ కశ్యప్‌ స్వరాలకు భాస్కరభట్ల సాహిత్యం అందించారు. సునీల్‌ కశ్యప్‌ ఆలపించారు. పూరి కనెక్ట్స్‌, పూరి జగన్నాథ్‌ టూరింగ్‌ టాకీస్‌ పతాకంపై పూరి జగన్నాథ్‌, ఛార్మి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని