యాక్షన్‌తో అదరగొట్టిన నాగశౌర్య

ఇప్పటివరకూ లవర్‌బాయ్‌, పక్కింటి కుర్రాడిగా ప్రేక్షకులను అలరించిన నాగశౌర్య ఇప్పుడు యాక్షన్‌ సన్నివేశాలతో అదరగొడుతున్నాడు. ఆయన కథానాయకుడిగా రమణ తేజ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అశ్వథ్థామ’. మెహరీన్‌...

Published : 28 Jan 2020 09:20 IST

హైదరాబాద్‌: ఇప్పటివరకూ లవర్‌బాయ్‌, పక్కింటి కుర్రాడిగా ప్రేక్షకులను అలరించిన నాగశౌర్య ఇప్పుడు యాక్షన్‌ సన్నివేశాలతో అదరగొడుతున్నాడు. ఆయన కథానాయకుడిగా రమణ తేజ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అశ్వథ్థామ’. మెహరీన్‌ కథానాయిక. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం జనవరి 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి యాక్షన్‌ మేకింగ్‌ వీడియోను చిత్ర బృందం అభిమానులతో పంచుకుంది. ఇంతకుముందెన్నడూ చూడని రీతిలో నాగశౌర్య యాక్షన్‌ సన్నివేశాల్లో అదరగొట్టాడు. 

తాజాగా ఈ చిత్రం సెన్సార్‌ను కూడా పూర్తి చేసుకుంది. యూ/ఏ సర్టిఫికెట్‌ వచ్చింది. యాక్షన్‌ సన్నివేశాలు మరోస్థాయిలో ఉన్నాయని సెన్సార్‌ బోర్డు సభ్యులు ప్రశంసించినట్లు చిత్ర బృందం తెలిపింది. శ్రీచరణ్‌ పాకాల సంగీతం అందించిన ఈ సినిమాను ఐరా క్రియేషన్స్‌పతాకంపై ఉష మూల్పూరి నిర్మిస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని