జ్వాలారెడ్డిగా తమన్నాని చూశారా..!

మిల్కీబ్యూటీ తమన్నా జ్వాలారెడ్డిగా అలరించనున్నారు. టాలీవుడ్‌ నటుడు గోపీచంద్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘సీటీమార్‌’. కబడ్డీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి సంపత్‌ నంది దర్శకత్వం వహిస్తున్నారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇటీవల ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను...

Updated : 08 Feb 2020 11:19 IST

హైదరాబాద్‌: మిల్కీబ్యూటీ తమన్నా జ్వాలారెడ్డిగా అలరించనున్నారు. టాలీవుడ్‌ నటుడు గోపీచంద్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘సీటీమార్‌’. కబడ్డీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి సంపత్‌ నంది దర్శకత్వం వహిస్తున్నారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇటీవల ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను అభిమానులతో పంచుకున్న చిత్రబృందం శనివారం తాజాగా తమన్నా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది. ఈ సినిమాలో తమన్నా పాత్రను పరిచయం చేస్తూ నెటిజన్లతో ఫస్ట్‌లుక్‌ను పంచుకుంది. ఇందులో తమన్నా జ్వాలారెడ్డి అనే కబడ్డీ కోచ్‌గా కనిపించనున్నారు. ఈ ఫస్ట్‌లుక్‌ను షేర్‌ చేసిన చిత్రబృందం.. ‘ఒక ఫైర్‌.. కబడ్డీ కోచ్‌ అయితే ఇలా ఉంటుంది’ అని పేర్కొంది.

గతేడాది విడుదలైన ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాలో లక్ష్మిగా అలరించి.. ప్రేక్షకులను మెప్పించారు నటి తమన్నా. ఈ సినిమాలో తమన్నా నటనను సినీ ప్రముఖులు, సినీ ప్రియులు ప్రశంసించారు. అంతేకాకుండా ఈ ఏడాది మహేశ్‌ కథానాయకుడిగా నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో ఆమె పార్టీ సాంగ్‌తో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని