సాయితేజ్‌ గోల్‌, అజెండా ఇవేనట

సోలో, ఫ్రీడమ్ అనేవి తమ గోల్‌, అజెండా అని అంటున్నారు నటుడు సాయి తేజ్‌. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘సోలో బ్రతుకే సో బెటర్‌’. సుబ్బు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సాయితేజ్‌కు జంటగా నభా నటేశ్‌ కనిపించనున్నారు. వేసవి కానుకగా మే 1న ఈ సినిమా ప్రేక్షకుల...

Published : 13 Feb 2020 19:24 IST

ప్రేమ మారదని గ్యారెంటీ ఏమిటి అంటున్న హీరో 

హైదరాబాద్‌: నో లవ్‌, ఫ్రీడమ్ అనేవి తమ గోల్‌, అజెండా అని అంటున్నారు నటుడు సాయి తేజ్‌. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘సోలో బ్రతుకే సో బెటర్‌’. సుబ్బు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సాయితేజ్‌కు జంటగా నభా నటేశ్‌ కనిపించనున్నారు. వేసవి కానుకగా మే 1న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. సాయితేజ్‌ సింగిల్స్‌ ఆర్మీని లీడ్‌ చేస్తున్నట్లు ఉన్న పోస్టర్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్న చిత్రబృందం తాజాగా వాలెంటైన్స్‌ డే సందర్భంగా ‘సోలో బ్రతుకే సో బెటర్‌’ థీమ్‌ వీడియోను సోషల్‌మీడియా వేదికగా చిత్రబృందం విడుదల చేసింది. 

దీనిలో సాయితేజ్‌.. సింగిల్‌ ఆర్మీని లీడ్‌ చేస్తూ కనిపించారు. ‘కోపం, ఇష్టం, విచారం, సంతోషం, ఆనందం, బాధ.. ఇవన్నీ కాలంతోపాటు, కారణాలతోపాటు మారిపోయే ఫీలింగ్స్‌. ప్రేమ కూడా ఒక ఫీలింగేగా.. మారదని గ్యారంటీ ఏంటి? మన గోల్‌ నో లవ్‌.. మన అజెండా.. ఫ్రీడమ్‌, చివరిగా మన స్లోగన్‌.. సోలో బ్రతుకే సో బెటర్‌’ అని సాయితేజ్‌తోపాటు సింగిల్‌ ఆర్మీ చెప్పే డైలాగ్స్‌ ఆకట్టుకునేలా ఉంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని