‘చై’ను ముద్దు పెట్టుకున్న సాయిపల్లవి

చైతన్య మీద ఉన్న ప్రేమను తెలియచేస్తూ ఆయన్ని ముద్దు పెట్టుకున్నారు సాయిపల్లవి. దీంతో చైతన్య భావోద్వేగానికి గురయ్యారు. ఇందంతా జరిగింది నిజంగా కాదండీ.. సినిమాలో.. సాయిపల్లవి, నాగచైతన్య జంటగా నటిస్తున్న చిత్రం ‘లవ్‌స్టోరీ’. ప్రేమకథలను సహజంగా తెరకెక్కించడంలో దిట్టగా...

Updated : 07 Dec 2022 15:07 IST

భావోద్వేగానికి గురైన చైతన్య

హైదరాబాద్‌: చైతన్య మీద ఉన్న ప్రేమను తెలియజేస్తూ ఆయన్ని ముద్దు పెట్టుకున్నారు సాయిపల్లవి. దీంతో చైతన్య భావోద్వేగానికి గురయ్యారు. ఇందంతా జరిగింది నిజంగా కాదండీ.. సినిమాలో.. సాయిపల్లవి, నాగచైతన్య జంటగా నటిస్తున్న చిత్రం ‘లవ్‌స్టోరీ’. ప్రేమకథలను సహజంగా తెరకెక్కించడంలో దిట్ట అయిన శేఖర్‌ కమ్ముల ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. సంగీత ప్రధానంగా సాగే ప్రేమకథగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు నారాయణ్‌ దాస్‌ కె.నారంగ్‌, పి.రామ్మోహన్‌రావు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. 

ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ సినిమా నుంచి ‘ఏయ్‌ పిల్లా’ అనే పాటకు సంబంధించిన ప్రివ్యూ వీడియోను చిత్రబృందం శుక్రవారం విడుదల చేసింది. ఈ వీడియోలో నాగచైతన్య, సాయిపల్లవి ఆకట్టుకునేలా కనిపించారు. సినిమాలోని పలు సన్నివేశాలతో ఈ వీడియోను చిత్రీకరించారు. అయితే వీడియో చివర్లో చై, సాయి పల్లవి మెట్రోలో ప్రయాణిస్తూ కనిపించారు. అదే సమయంలో చై మీద ఉన్న ప్రేమను తెలియజేస్తూ సాయిపల్లవి ఆయన్ని ముద్దు పెట్టుకుంది.  దీంతో ఆశ్చర్యానికి గురైన చై.. భావోద్వేగానికి లోనవుతారు. వెంటనే సాయిపల్లవి.. ‘ఏంది, ముద్దు పెడితే ఏడుస్తారా అబ్బా’ అని నవ్వుతూ అడుగుతుంది.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని