అడవి మనిషిలా రానా ఎలా మారాడంటే..?

రానా కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం ‘అరణ్య’. ప్రభు సోలోమన్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాని హిందీలో ‘హాథీ మేరే సాథీ’, కన్నడలో ‘కాదన్‌’ పేరుతో విడుదల చేయనున్నారు. ఇప్పటికే విడుదల చేసిన టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. ఈ సినిమాలో రానా విభిన్నమైన గెటప్‌లో...

Published : 17 Feb 2020 21:22 IST

హైదరాబాద్‌: రానా కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం ‘అరణ్య’. ప్రభు సోలోమన్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాని హిందీలో ‘హాథీ మేరే సాథీ’, కన్నడలో ‘కాదన్‌’ పేరుతో విడుదల చేయనున్నారు. ఇప్పటికే విడుదల చేసిన టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. ఈ సినిమాలో రానా విభిన్నమైన గెటప్‌లో కనిపించారు. అడవిని నమ్ముకొని ఉన్న ఓ ఆదివాసి.. ఆ అడవికి ఆపద వస్తే ఏం చేశాడన్న కథతో ఈ సినిమా తెరకెక్కించారు.

తాజాగా ఈ సినిమాకు సంబంధించి  ‘ఫ్రమ్‌ ఎ సూపర్‌స్టార్‌ టు ఎ ఫారెస్ట్‌ మ్యాన్‌’ పేరుతో మేకింగ్‌ వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది. అడవిలో బతికే వ్యక్తిగా రానా మారిన తీరు, ఏనుగులను మచ్చిక చేసుకునే విధానం, అడవి మనిషిలా అరుపులు ఆసక్తికరంగా ఉన్నాయి. ఇందులో జోయా హుస్సేన్‌, విష్ణు విశాల్‌, సామ్రాట్‌ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఏప్రిల్‌ 2న ఈ సినిమా విడుదల కానుంది.

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని