‘విరాట పర్వం’లో బహు భాషా నటి

రానా, సాయిపల్లవి కీలక పాత్రల్లో వేణు ఊడుగుల తెరకెక్కిస్తున్న పీరియాడికల్‌ చిత్రం ‘విరాట్‌ పర్వం’. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమాలో ఇప్పటికే అలనాటి తార టబు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ ఇప్పుడు మరొక బహు భాషా నటి ఈ చిత్రంలోకి వచ్చి...

Updated : 18 Feb 2020 18:01 IST

హైదరాబాద్‌: రానా, సాయిపల్లవి కీలక పాత్రల్లో వేణు ఊడుగుల తెరకెక్కిస్తున్న పీరియాడికల్‌ చిత్రం ‘విరాట పర్వం’. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమాలో ఇప్పటికే అలనాటి తార టబు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ ఇప్పుడు మరొక బహు భాషా నటి ఈ చిత్రంలోకి వచ్చి చేరారు. విలక్షణ పాత్రలతో  తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న నటి నందితాదాస్‌. ‘విరాట పర్వం’లో నందితా దాస్‌ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆమె సెట్‌లో సందడి చేస్తున్న ఫొటోలను దర్శకుడు వేణు ఊడుగుల అభిమానులతో పంచుకున్నారు. 

‘‘ప్రస్తుతం నేను దర్శకుడు వేణు ఊడుగుల, సినిమాటోగ్రాఫర్‌ డానీతో కలిసి  ‘విరాట పర్వం’ సెట్స్‌లో ఉన్నా. తెలుగులో మాట్లాడాలన్న ఒత్తిడి కన్నా సెట్స్‌లో ఉండటం నాకెప్పుడూ సంతోషమే’’ అని నందితాదాస్‌ ట్వీట్‌ చేయగా, అందుకు వేణు ఊడుగుల సమాధానం ఇస్తూ,  ‘మీతో పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్యూ నందితాదాస్‌ మేడమ్‌’ అని పేర్కొన్నారు. 

‘విరాట పర్వం’ పొలిటికల్‌ పీరియాడిక్ థ్రిల్లర్ జానర్‌లో తెరకెక్కతున్నట్లు సమాచారం. పొలిటికల్‌ థ్రిల్లర్ అయినా.. మాస్ ఎలిమెంట్స్ కూడా ఆసక్తికరంగా ఉంటాయని తెలుస్తోంది. రానా, సాయిపల్లవి పాత్రలు సరికొత్తగా ఉంటాయని చిత్ర బృందం చెబుతోంది. నక్సలైట్ ఉద్యమం నేపథ్యంలో సాగే ఈ కథలో రానా నక్సలైట్ గా నటిస్తుండగా, సాయి పల్లవి జానపద గాయని పాత్రలో నటిస్తోందట. ఈ సినిమాలో ఆమె పాత్ర వీక్షకుల్నీ కట్టిపడేస్తుందని టాక్.  1980-1990లో తెలంగాణ ప్రాంతంలోని అప్పటి సామాజిక పరిస్థితుల ఆధారం తీస్తున్నారట. హిందీ, తమిళ భాష‌ల్లోనూ ఈ సినిమాను విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తోంది. 
 

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని