Published : 19 Feb 2020 17:12 IST

ఎన్టీఆర్‌ అభిమానులకు సర్‌ప్రైజ్‌

హైదరాబాద్‌: ‘కంటపడ్డావా.. కనికరిస్తా.. వెంట పడ్డానో నరికేస్తా ఓబా’ అంటూ రాయలసీమ యాసలో ఎన్టీఆర్‌ సందడి చేసిన చిత్రం ‘అరవింద సమేత వీరరాఘవ’. ఎన్టీఆర్‌-త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్‌లో మరో సినిమా ఖరారైంది. ఈ సినిమాను హారిక-హాసిని క్రియేషన్స్‌, నందమూరి తారక రామారావు ఆర్ట్స్‌ పతాకంపై  ఎస్‌.రాధాకృష్ణ, కల్యాణ్‌రామ్‌ నిర్మిస్తున్నారు. 

ప్రస్తుతం తారక్‌.. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో బిజీగా ఉన్నారు. ఇందులో ఆయన కొమరం భీంగా కనిపించనున్నారు. ఆయనకు జోడీగా ఓలివియా మోరిస్‌ నటించనున్నారు. ఈ సినిమా పూర్తయిన తర్వాత త్రివిక్రమ్‌ దర్శకత్వంలో నటిస్తారు. ఇది వచ్చే ఏడాది వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రకటన రాకముందే టైటిల్‌ కూడా సోషల్‌మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. ఈ సినిమాకు ‘అయినను పోయిరావలె హస్తినకు’ అనే టైటిల్‌ పెట్టబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. మరిన్ని వివరాలు తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే!

Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts