మల్లారెడ్డి కాలేజ్‌లో హీరో విశ్వక్‌సేన్‌ సందడి!

‘ఫలక్‌నుమా దాస్‌’ చిత్రంతో అందరి దృష్టిని ఆకర్షించిన యువ కథానాయకుడు విశ్వక్‌సేన్‌. శైలేశ్‌ కొలను దర్శకత్వంలో ఆయన కీలక పాత్రలో నటిస్తున్న క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘హిట్‌’.  రుహాని శర్మ కథానాయిక. వాల్‌పోస్టర్‌ సినిమా పతాకంపై నాని ఈ సినిమాను నిర్మిస్తుండటం...

Published : 22 Feb 2020 21:40 IST

హైదరాబాద్‌: ‘ఫలక్‌నుమా దాస్‌’ చిత్రంతో అందరి దృష్టిని ఆకర్షించిన యువ కథానాయకుడు విశ్వక్‌సేన్‌. శైలేశ్‌ కొలను దర్శకత్వంలో ఆయన కీలక పాత్రలో నటిస్తున్న క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘హిట్‌’.  రుహాని శర్మ కథానాయిక. వాల్‌పోస్టర్‌ సినిమా పతాకంపై నాని ఈ సినిమాను నిర్మిస్తుండటం విశేషం. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమాను ఫిబ్రవరి 28న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. కాగా, ఇటీవల విడుదల చేసిన ట్రైలర్‌కు విశేష స్పందన వస్తోంది.

ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా నటుడు విశ్వక్‌సేన్‌ శనివారం మల్లారెడ్డి కాలేజ్‌లో సందడి చేశారు. విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. అనంతరం వారితో ఫొటోలు దిగారు. ‘ఫలక్‌నుమా దాస్‌’ను ఆదరించినట్లే ఈ సినిమాను విజయవంతం చేయాలని కోరారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని