‘బుట్టబొమ్మ..’ ఫుల్‌ వీడియో సాంగ్‌ చూశారా?

‘బుట్టబొమ్మ.. బుట్టబొమ్మ.. నన్ను సుట్టూకుంటువే..’అంటూ థియేటర్‌లో ప్రేక్షకులను ఓ ఊపు ఊపేశారు అల్లు అర్జున్‌-పూజాహెగ్డే. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో బన్ని కథానాయకుడిగా నటించిన చిత్రం ‘అల వైకుంఠపురములో’. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. అల్లు అర్జున్‌...

Updated : 07 Dec 2022 15:14 IST

హైదరాబాద్‌: ‘బుట్టబొమ్మ.. బుట్టబొమ్మ.. నన్ను సుట్టూకుంటువే..’అంటూ థియేటర్‌లో ప్రేక్షకులను ఓ ఊపు ఊపేశారు అల్లు అర్జున్‌-పూజాహెగ్డే. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో బన్ని కథానాయకుడిగా నటించిన చిత్రం ‘అల వైకుంఠపురములో’. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. అల్లు అర్జున్‌ నటన, త్రివిక్రమ్‌ టేకింగ్‌, పూజా హెగ్డే అందాలు సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. ముఖ్యంగా తమన్‌ అందించిన పాటలు నెటిజన్లను ఓ ఊపు ఊపేశాయి. 

‘సామజవరగమన’, ‘బుట్టబొమ్మ’, ‘ఓ మై గాడ్‌ డాడీ’ పాటలు యువతను విశేషంగా అలరించాయి. ఇటీవల ‘సామజవరగమన’, ‘ఓ మై గాడ్‌ డాడీ’ ఫుల్‌ సాంగ్‌లను విడుదల చేసిన చిత్ర బృందం. తాజాగా ‘బుట్టబొమ్మ’ పాటను అభిమానులతో పంచుకుంది. తమన్‌ అందించిన స్వరాలకు రామజోగయ్యశాస్త్రి సాహిత్యం అందించగా, అర్మాన్‌ మాలిక్‌ ఆలపించారు. ఇక ఈ పాటకు బన్ని-పూజాలు వేసిన స్టెప్‌లు యువతను విశేషంగా ఆకట్టుకున్నాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని