1978 పలాసలో ఏం జరిగింది?

‘బురదలోకి దిగిపోయినాం. కాళ్లు కడుక్కోవడానికి నీళ్లు సరిపోవు, ఎవుడు ఎప్పుడు ఎల్లిపోయి వచ్చి మా పీక తీసుకెళ్లిపోతాడా? అని భయంగా ఉంటాదే’ అంటున్నారు యువ కథానాయకుడు రక్షిత్‌. కరుణ కుమార్‌ దర్శకత్వంలో ఆయన కీలక పాత్రలో నటించిన చిత్రం...

Updated : 01 Mar 2020 21:34 IST

హైదరాబాద్‌: ‘బురదలోకి దిగిపోయినాం. కాళ్లు కడుక్కోవడానికి నీళ్లు సరిపోవు, ఎవుడు ఎప్పుడు ఎల్లిపోయి వచ్చి మా పీక తీసుకెళ్లిపోతాడా? అని భయంగా ఉంటాదే’ అంటున్నారు యువ కథానాయకుడు రక్షిత్‌. కరుణ కుమార్‌ దర్శకత్వంలో ఆయన కీలక పాత్రలో నటించిన చిత్రం ‘పలాస 1978’. నక్షత్ర, రఘుకుంచె తదితరులు ముఖ్యభూమిక పోషిస్తున్నారు. కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ నేపథ్యంలో ఆదివారం నటుడు రానా ట్రైలర్‌ను రానా విడుదల చేసి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.

సుధాస్‌ మీడియా పతాకంపై దయన్‌ అట్లూరి నిర్మిస్తున్న ఈ సినిమాకు రఘు కుంచె సంగీతం అందించారు. తమ్మారెడ్డి భరద్వాజ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ‘పలాస 1978’ చిత్రం మార్చి 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. 


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని