విజయశాంతి స్ఫూర్తితో ఈ పాత్ర చేశా: పాయల్‌

ప్రతి నటికి పోలీస్‌ అధికారిగా నటించాలన్న కోరిక ఉంటుందని, తాను విజయశాంతి స్ఫూర్తితోనే పోలీస్‌ ఆఫీసర్‌గా నటిస్తున్నానని అన్నారు అందాల తార పాయల్‌ రాజ్‌పుత్‌. ఆమె కీలక పాత్రలో ప్రణదీప్‌ ఠాకూర్‌ దర్శకత్వం వహించిన...

Published : 05 Mar 2020 21:43 IST

హైదరాబాద్: ప్రతి నటికి పోలీస్‌ అధికారిగా నటించాలన్న కోరిక ఉంటుందని, తాను విజయశాంతి స్ఫూర్తితోనే పోలీస్‌ ఆఫీసర్‌గా నటిస్తున్నానని అన్నారు అందాల తార పాయల్‌ రాజ్‌పుత్‌. ఆమె కీలక పాత్రలో ప్రణదీప్‌ ఠాకూర్‌ దర్శకత్వం వహించిన చిత్రం ‘5Ws’. కైవల్య క్రియేషన్స్ పతాకంపై శ్రీమతి యశోద ఠాకోర్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. 

ఈ సందర్భంగా పాయల్‌ రాజ్‌పుత్‌ మాట్లాడుతూ.. ‘‘5Ws’ చిత్రం నా కెరీర్‌కు ఒక కొత్త చిత్రం. పోలీస్‌ అధికారిగా నటించే గోల్డెన్‌ ఛాన్స్‌ ఈ చిత్రంతో వచ్చింది. నా నటనపై నమ్మకం ఉంచి ఈ అవకాశం ఇచ్చిన ప్రణదీప్‌కు ధన్యవాదాలు. ఆయన కథ చెప్పిన వెంటనే ఒప్పుకొన్నా. ఈ పాత్ర చేయడానికి నాకు విజయశాంతి గారు స్ఫూర్తి. ఆమె పోలీస్‌ ఆఫీసర్‌గా నటించిన చాలా సినిమాలు చూశాను. ఈ ‘5Ws’లో కొత్తగా చేసే అవకాశం నాకు లభించింది. ఇందులో ఫైట్స్‌ కూడా చేశా’’ అని చెప్పుకొచ్చింది. 

దర్శకుడు ప్రణదీప్ మాట్లాడుతూ ఇదొక క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ డ్రామా అని, ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుందని అన్నారు. కార్యక్రమంలో మాటల రచయిత శివకుమార్, సినిమాటోగ్రాఫర్ అనిల్ బండారి తదితరులు పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని