సాధారణ వ్యక్తి సరిపోడు.. ఒక హీరో కావాలి!

‘ఎంతో మంది నాతో సూపర్‌ హీరో అంటూ ఎవరూ లేరని చెప్పారు.. కానీ ఇప్పుడు చెబుతున్నా, స్వయంగా ఆలోచించగలిగే ప్రతి ఒక్కడు సూపర్‌ హీరోనే..’ అంటున్నారు తమిళ స్టార్‌ శివకార్తికేయన్‌. ఆయన నటిస్తున్న సినిమా ‘శక్తి’. కల్యాణి ప్రియదర్శన్‌, అర్జున్‌ కీలక పాత్రలు పోషించారు.....

Published : 09 Mar 2020 18:18 IST

 ఆసక్తికరంగా ‘శక్తి’ ట్రైలర్‌

హైదరాబాద్‌: ‘ఎంతో మంది నాతో సూపర్‌ హీరో అంటూ ఎవరూ లేరని చెప్పారు.. కానీ ఇప్పుడు చెబుతున్నా, స్వయంగా ఆలోచించగలిగే ప్రతి ఒక్కడు సూపర్‌ హీరోనే..’ అంటున్నారు తమిళ స్టార్‌ శివకార్తికేయన్‌. ఆయన నటిస్తున్న సినిమా ‘శక్తి’. కల్యాణి ప్రియదర్శన్‌, అర్జున్‌ కీలక పాత్రలు పోషించారు. పీఎస్‌ మిత్రన్‌ దర్శకుడు. యువన్‌ శంకర్‌ రాజా బాణీలు అందిస్తున్నారు. మార్చి 20 చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ను సోమవారం విడుదల చేశారు. సూపర్‌ హీరో కావాలని కార్తికేయ చిన్నతనం నుంచి కల కంటుంటాడు. అర్జున్‌ ప్రస్తుత విద్యా విధానాన్ని ప్రస్తావిస్తూ కనిపించారు. ‘ఈ వ్యవస్థను మార్చడానికి సాధారణ వ్యక్తిలా ఉంటే సరిపోదు.. ఒక హీరో కావాలి..’ అని ఆయన భవిష్యత్తు గురించి మాట్లాడటం ఆసక్తికరంగా అనిపించింది. ఈ ట్రైలర్‌ ప్రస్తుతం యూట్యూబ్‌లో వీక్షకుల్ని మెప్పిస్తోంది. అంతేకాదు ట్విటర్‌ ట్రెండింగ్‌లో ఉంది. 

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని