రానా సినిమాకీ కరోనా ఎఫెక్ట్‌..!

చాపకింద నీరులా మారి ప్రపంచదేశాలను వణికిస్తోన్న కరోనా వైరస్‌ (కొవిడ్-19) ప్రభావం ఇప్పటికే సినీ పరిశ్రమపై పడిన విషయం తెలిసిందే. కరోనా వైరస్‌ కారణంగా పలు సినిమాల షూటింగ్స్‌ నిలిపివేయగా.. మరికొన్ని చిత్రాల విడుదలలు వాయిదాపడ్డాయి. తాజాగా టాలీవుడ్‌ నటుడు రానా ప్రధాన పాత్రలో నటించిన ‘అరణ్య’....

Published : 16 Mar 2020 22:33 IST

వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన చిత్రబృందం

హైదరాబాద్‌: చాపకింద నీరులా మారి ప్రపంచదేశాలను వణికిస్తోన్న కరోనా వైరస్‌ (కొవిడ్-19) ప్రభావం ఇప్పటికే సినీ పరిశ్రమపై పడిన విషయం తెలిసిందే. కరోనా వైరస్‌ కారణంగా పలు సినిమాల షూటింగ్స్‌ నిలిపివేయగా.. మరికొన్ని చిత్రాల విడుదలలు వాయిదాపడ్డాయి. తాజాగా టాలీవుడ్‌ నటుడు రానా ప్రధాన పాత్రలో నటించిన ‘అరణ్య’ సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్లు చిత్రబృందం సోషల్‌మీడియాలో ప్రకటించింది. ‘ఎరోస్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ ప్రేక్షకుల ఆసక్తికి ఎంతో విలువనిస్తుంటుంది. మునుపెన్నడూ చెప్పని విభిన్నమైన కథలను తెరకెక్కించే విషయంలో ఆరోగ్యకరమైన, ఆనందమైన ప్రేక్షకులు మాలో స్ఫూర్తి నింపుతున్నారు. కరోనా వైరస్‌ (కొవిడ్‌ 19) నేపథ్యంలో తాజా పరిణామాలను దృష్టిలో ఉంచుకుని ఏప్రిల్‌ 2న రిలీజ్‌ కావాల్సిన అరణ్య చిత్రాన్ని ప్రస్తుతానికి వాయిదా వేస్తున్నాం. ప్రతిఒక్కరూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని మేము ప్రార్థిస్తున్నాం. పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలించి త్వరలోనే కొత్త విడుదల తేదీతో మీ ముందుకు రావాలని మేమే భావిస్తున్నాం’ అని చిత్రబృందం ట్వీట్‌ చేసింది.

అడవిని నమ్ముకొని ఉన్న ఓ ఆదివాసి.. ఆ అడవికి ఆపద వస్తే ఏం చేశాడన్న కథతో తెరకెక్కిన ‘అరణ్య’ చిత్రంలో రానా విభిన్నమైన లుక్‌లో కనిపించనున్నారు. తెలుగుతోపాటు మరో రెండు భాషల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రభు సోలోమన్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో జోయా హుస్సేన్‌, విష్ణు విశాల్‌, పుల్‌కిత్‌ సామ్రాట్‌ కీలకపాత్రల్లో నటించారు. అయితే ఈ సినిమాని ఏప్రిల్‌ 2న విడుదల చేయాలని భావించినప్పటికీ కరోనా కారణంగా వాయిదా వేశారు.

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని