బెటర్‌ లైఫ్‌ ఉందని పక్కదేశానికి వెళ్తావా?

యువ కథానాయకుడు విశ్వక్‌సేన్‌ ‘విశ్వక్‌’ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. అజయ్‌ కతుర్వార్‌, డింపుల్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ఇది. వేణు ముల్కల దర్శకత్వం వహిస్తున్నారు. గోల్డెన్‌ డక్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై తాటికొండ ఆనందం బాలకృష్ణన్‌ నిర్మిస్తున్నారు. విభిన్న.....

Published : 03 Apr 2020 21:17 IST

‘విశ్వక్‌’ టీజర్‌ విడుదల చేసిన విశ్వక్‌సేన్‌

హైదరాబాద్‌: యువ కథానాయకుడు విశ్వక్‌సేన్‌ ‘విశ్వక్‌’ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. అజయ్‌ కతుర్వార్‌, డింపుల్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ఇది. వేణు ముల్కల దర్శకత్వం వహిస్తున్నారు. గోల్డెన్‌ డక్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై తాటికొండ ఆనందం బాలకృష్ణన్‌ నిర్మిస్తున్నారు. విభిన్న కథాంశంతో ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు ప్రచార చిత్రాన్ని బట్టి తెలుస్తోంది.

‘ఎన్నారైలకేమో బాధ్యత తెలియదు. ఇక్కడున్న వారికేమో నిర్లక్ష్యం.. మరి నువ్వేం..’ అని హీరో ఓ వ్యక్తి చెంప పగలగొట్టి మరీ ప్రశ్నిస్తూ కనిపించారు. ఓ యువకుడు రైతులపై ఆసక్తికర కథనం రాస్తున్నామని చెబితే.. అలా కాకుండా యువత ఒత్తిడిపై కథనం రాయమని ఓ యువతి ప్రోత్సహించడం ఆసక్తికంగా అనిపించింది. ‘ఫుడ్‌, బెడ్‌ బాగుందని పక్కింటికి వెళ్లి బతుకుతావా?, బెటర్‌ లైఫ్‌ ఉందని పక్కదేశానికి వెళ్తావా?..’ అంటూ కథానాయకుడు పలికిన సంభాషణలు ఆకట్టుకుంటున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని