అనుమతులిస్తే.. అనుకున్న రోజే ‘కేజీఎఫ్ ‌2’!

ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్‌ వద్ద అత్యధిక వసూళ్లను రాబట్టిన కన్నడ చిత్రం ‘కేజీఎఫ్‌’. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో యశ్‌ కథానాయకుడిగా తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రస్తుతం స్వీకెల్‌గా ‘కేజీఎఫ్‌ ఛాప్టర్‌2’ రానున్న విషయం...

Published : 14 May 2020 21:28 IST

సినిమా విడుదలపై స్పందించిన నిర్మాత

బెంగళూరు: ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లను రాబట్టిన కన్నడ చిత్రం ‘కేజీఎఫ్‌’. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో యశ్‌ కథానాయకుడిగా తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రస్తుతం స్వీకెల్‌గా ‘కేజీఎఫ్‌ ఛాప్టర్‌2’ రానున్న విషయం తెలిసిందే. కరోనా వైరస్‌ విజృంభిస్తోన్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించడంతో పలు చిత్రాల షూటింగ్స్‌ నిలిచిపోయాయి. దీంతో ఆయా సినిమా విడుదల తేదీల్లో మార్పులు జరగవచ్చు అనే ప్రచారం కూడా సాగుతోంది. ఇదిలా ఉండగా.. ‘కేజీఎఫ్‌-2’ చిత్రాన్ని అక్టోబర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం మొదట్లో  ప్రకటించింది. అయితే ప్రస్తుతానికి ఆ సినిమా షూటింగ్‌ నిలిచిపోవడంతో.. రిలీజ్‌లో కూడా మార్పులు ఉండవచ్చు అని సోషల్‌మీడియాలో పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈనేపథ్యంలో సినిమా విడుదల విషయంలో వస్తున్న వార్తలపై చిత్ర నిర్మాత కార్తీక్‌ గౌడ స్పందించారు. జులైలో షూటింగ్స్‌కు అనుమతి ఇస్తే ముందు ప్రకటించిన రోజునే ‘కేజీఎఫ్‌-2’ చిత్రాన్ని విడుదల చేస్తామని ఆయన తెలిపారు. అంతేకాకుండా రెండు ఫైట్‌ సీన్లు మినహాయించి చాలా వరకూ సినిమా షూటింగ్‌ కూడా పూర్తి అయ్యిందని ఆయన వెల్లడించారు.

‘లాక్‌డౌన్‌ లేకుంటే ఇప్పటికే ‘కేజీఎఫ్‌ 2’ సినిమా షూటింగ్‌ పూర్తయ్యేది. కేవలం 20 రోజుల షూటింగ్‌ మాత్రమే మిగిలి ఉంది. ప్రభుత్వం నుంచి అనుమతులు పొందిన తర్వాత మేము పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల్లో నిమగ్నమయ్యాం. ఒకవేళ జులైలో కనుక షూటింగ్స్‌కు అనుమతి ఇస్తే.. అనుకున్న రోజుకే కేజీఎఫ్‌ 2 చిత్రాన్ని విడుదల చేస్తాం.’ అని ఆయన వివరించారు.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని