‘వ్యాక్సిన్‌ వస్తుంది’

కరోనా వైరస్‌ కేవలం ప్రారంభం మాత్రమేనని అంటున్నారు దర్శకుడు ప్రశాంత్‌ వర్మ. ‘అ!’, ‘కల్కి’ లాంటి రెండు విభిన్నకథా చిత్రాలతో మెప్పించిన ఆయన తాజాగా తన మూడో ప్రాజెక్ట్‌  ప్రకటించారు. ఈ సినిమాకి ‘వ్యాక్సిన్‌ వస్తుంది’..

Published : 29 May 2020 11:57 IST

కరోనా కేవలం ప్రారంభం మాత్రమే.. : ప్రశాంత్‌ వర్మ

హైదరాబాద్‌: కరోనా వైరస్‌ కేవలం ప్రారంభం మాత్రమేనని అంటున్నారు దర్శకుడు ప్రశాంత్‌ వర్మ. ‘అ!’, ‘కల్కి’ లాంటి రెండు విభిన్నకథా చిత్రాలతో మెప్పించిన ఆయన తాజాగా తన మూడో ప్రాజెక్ట్‌  ప్రకటించారు. ఈ సినిమాకి ‘వ్యాక్సిన్‌ వస్తుంది’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. శుక్రవారం ఆయన పుట్టినరోజు సందర్భంగా ‘వ్యాక్సిన్‌ వస్తుంది’ ప్రీలుక్‌ను సోషల్‌మీడియా వేదికగా చిత్రబృందం నెటిజన్లతో పంచుకుంది. చారిత్రక కర్నూలు కొండారెడ్డి బురుజు సెంటర్‌లో ఓ రక్కసి ప్రజలను హతమార్చినట్లు ఈ పోస్ట్‌ర్‌లో చూపించారు. నిజ జీవిత సంఘటనలను ఆధారంగా చేసుకుని తెలుగు సినీ తెరపై ఇప్పటివరకూ చూడని వినూత్నమైన కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోందని చిత్రబృందం ప్రకటించింది. ఈ సినిమాలో నటించబోయే నటీనటుల గురించి తెలియాల్సి ఉంది.

‘అ!’, ‘కల్కి’ చిత్రాల తర్వాత ప్రశాంత్‌ వర్మ ‘అ2’ చిత్రాన్ని తెరకెక్కిస్తారని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. ప్రశాంత్‌ వర్మ సైతం ‘అ2’ చిత్రాన్ని త్వరలోనే తెరకెక్కిస్తానని ఇటీవల ప్రకటించారు. ఈ క్రమంలో తాజాగా ఆయన ఓ ట్వీట్ పెట్టారు. ప్రస్తుతం తాను వేరే కథలతో బిజీగా ఉన్నానని, అవి పూర్తైన తర్వాత ‘అ2’ చిత్రాన్ని రూపొందిస్తానని తెలిపారు. దీంతో ఇప్పుడు ఆయన తెరకెక్కించబోయే చిత్రం ‘అ!’ సినిమా సీక్వెల్‌ కాదని స్పష్టత వచ్చింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు