అవన్నీ అబద్ధాలే.. ముందు థియేటర్‌లోనే..!

ఒకప్పటి నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా తీసిన ‘తలైవి’ సినిమా ఓటీటీలో విడుదల కాబోతోందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కరోనా వైరస్‌ వల్ల థియేటర్లు ఎప్పుడు ప్రారంభం అవుతాయో తెలియకపోవడంతో ఓటీటీలో విడుదల చేయాలని.....

Updated : 08 Jun 2020 19:32 IST

చెన్నై: ఒకప్పటి నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా తీసిన ‘తలైవి’ సినిమా ఓటీటీలో విడుదల కాబోతోందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కరోనా వైరస్‌ వల్ల థియేటర్లు ఎప్పుడు ప్రారంభం అవుతాయో తెలియకపోవడంతో ఓటీటీలో విడుదల చేయాలని నిర్మాతలు నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ‘ఈ సినిమా హిందీ, తమిళ హక్కుల్ని రూ.55 కోట్లకు అమెజాన్‌, నెట్‌ప్లిక్స్‌కు ఇచ్చేశారు’ అని కంగన కూడా మీడియాతో అన్నారు. అయితే ముందు థియేటర్లలో విడుదల చేసిన తర్వాత ఓటీటీలోకి చిత్రం వస్తుందని తాజాగా యూనిట్‌ పేర్కొంది. సినీ విశ్లేషకుడు తరణ్‌ ఆదర్శ్‌ ఈ విషయాన్ని ట్విటర్‌ వేదికగా స్పష్టం చేశారు. ‘జయలలిత బయోపిక్‌ ‘తలైవి’ ఓటీటీలో ప్రదర్శించబోతున్నారు అనే వార్తలు అవాస్తవం. ముందు థియేటర్‌లోనే విడుదలౌతుంది. దాని తర్వాత డిజిటల్‌లోకి వస్తుంది’ అన్నారు.

ఎ.ఎల్. విజయ్‌ ‘తలైవి’కి దర్శకత్వం వహిస్తున్నారు. జయలలితగా కంగన.. ఎంజీఆర్‌గా అరవింద్ స్వామి కనిపించనున్నారు. కరుణానిధి పాత్రలో ప్రకాశ్‌రాజ్‌, శశికళ పాత్రలో పూర్ణ నటిస్తున్నట్లు తెలిసింది. దాదాపు 12 ఏళ్ల తర్వాత కంగన కోలీవుడ్‌లో నటించిన సినిమా ఇది. ఫిబ్రవరిలో జయలలిత జయంతి సందర్భంగా దర్శక, నిర్మాతలు కంగన లుక్‌ను విడుదల చేశారు. సినిమాను జూన్‌ 26న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు తెలిపారు. కానీ కరోనా కారణంగా సినిమాను పూర్తి చేయలేకపోయారు.

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని