RRR: ‘నాటు నాటు’ డ్యాన్స్‌ స్టెప్స్‌కు తారక్‌- చెర్రీ ఎన్ని టేక్స్‌ తీసుకున్నారో తెలుసా? 

నా పాట చూడు.. నా పాట చూడు.. నాటు నాటు వీర నాటు’ అంటూ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR)లో రామ్‌ చరణ్‌ (Ram Charan), జూనియర్‌ ఎన్టీఆర్‌ (Jr NTR) వేసిన స్టెప్పులు చూపుతిప్పుకోనివ్వకుండా ఉంది కదూ! అదే రీతిలో పాట కూడా ట్రెండింగ్‌లో దూసుకుపోతుంది.

Published : 24 Nov 2021 01:15 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘నా పాట చూడు.. నా పాట చూడు.. నాటు నాటు వీర నాటు’ అంటూ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR)లో రామ్‌ చరణ్‌ (Ram Charan), జూనియర్‌ ఎన్టీఆర్‌ (Jr NTR) వేసిన స్టెప్పులు చూపుతిప్పుకోనివ్వకుండా ఉన్నాయి కదూ! అదే రీతిలో పాట కూడా ట్రెండింగ్‌లో దూసుకుపోతుంది. ఇంత క్రేజ్‌ సంపాదించుకున్న ఈ ‘నాటు నాటు’ పాట స్టెప్స్‌ కోసం పడ్డ కష్టం అంతా ఇంతా కాదని చెప్పారు తారక్‌. ఇటీవల ఓ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మేకింగ్ విషయాలను ఇలా పంచుకున్నారు.

15-18 టేక్స్‌ తీసుకున్నాం!

‘‘నాటు నాటు’ పాటలోని హుక్‌ స్టెప్‌.. కాళ్లు ఎడమ, కుడి, ముందు, వెనుక తిప్పి స్టెప్‌ పర్ఫెక్ట్‌గా సింక్‌ అయ్యేందుకు నేను చెర్రీ, 15-18 టేక్స్‌ తీసుకున్నాం. ఈ విషయంలో రాజమౌళి ఇద్దరికీ నరకం చూపించారు (నవ్వుతూ). ముఖ్యంగా ఇద్దరిదీ ఒకే తీరులో వస్తుందా అని తెలుసుకునేందుకు మధ్యమధ్యలో డ్యాన్స్‌ స్టెప్స్‌ ఆపేసేవారు. అలా..  నాదీ, చెర్రీది చేతుల, కాళ్ల కదలికలు సింక్‌ అవుతున్నాయా లేదా అని చూసుకునేవారు. ఈ ఏడాది ప్రారంభంలో ఉక్రెయిన్‌లో ఈ పాటను చిత్రీకరించాం. ఇక ఈ లిరికల్‌ వీడియోలోని డ్యాన్స్‌ స్టెప్స్‌కు వచ్చిన విశేష స్పందన చూశాక.. రాజమౌళి విజన్‌ మాకు అర్థమైంది. అందరూ ఆ హుక్‌ డ్యాన్స్‌ స్టెప్స్‌ సింక్‌ బాగుందంటూ కామెంట్‌ చేస్తున్నారు. అప్పుడే జక్కన్నను పిలిచి అడిగా ఇది మీకు ఎలా సాధ్యమైందని.. జక్కన ఓ టాస్క్‌ మాస్టర్‌. అందుకే భారతదేశం గర్వించదగ్గ ప్రముఖ దర్శకుడు అయ్యారు’’ అని అన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని