Tollywood: ఈవారం థియేటర్‌/ఓటీటీలో వచ్చే చిత్రాలివే!

దసరా కానుకగా గతవారం థియేటర్లలో విడుదలైన ‘గాడ్‌ ఫాదర్‌’, ‘ది ఘోస్ట్‌’, ‘స్వాతిముత్యం’ చిత్రాలు ప్రేక్షకులను మెప్పించాయి. ఈవారం సందడి చేసేందుకు మరికొన్ని సినిమాలు సిద్ధమయ్యాయి.

Updated : 11 Oct 2022 11:35 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దసరా కానుకగా గతవారం థియేటర్లలో విడుదలైన ‘గాడ్‌ ఫాదర్‌’, ‘ది ఘోస్ట్‌’, ‘స్వాతిముత్యం’ చిత్రాలు ప్రేక్షకులను మెప్పించాయి. ఈ వారం సందడి చేసేందుకు మరికొన్ని సినిమాలు సిద్ధమయ్యాయి. థియేటర్‌, ఓటీటీ వేదికగా అతి త్వరలోనే విడుదల కాబోతున్న సినిమాల జాబితా ఇదీ..

క్రేజీగా ఆది 

ఈ ఏడాది ఇప్పటికే మూడు సినిమాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఆది సాయికుమార్‌ ((Aadi Saikumar) ఇప్పుడు ‘క్రేజీ ఫెలో’ (Crazy Fellow)గా రాబోతున్నారు. దర్శకుడు ఫణికృష్ణ సిరికి తెరకెక్కించిన ఈ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ ఈ నెల 14న విడుదలకానుంది. దిగంగన సూర్యవంశీ, మిర్నా మేనన్‌ కథానాయికలు. ఈ సినిమాలో లవ్‌, కామెడీ, ఎమోషన్‌.. ఇలా అన్ని అంశాలూ ఉన్నాయని ఆది ఇటీవల తెలిపారు.


బాయ్‌ఫ్రెండ్‌ను కొనుక్కోవచ్చు..

విశ్వంత్‌ (Viswanth), మాళవిక సతీషన్‌ జంటగా తెరకెక్కిన చిత్రం ‘బాయ్‌ఫ్రెండ్‌ ఫర్‌ హైర్‌’ (Boy Friend For Hire). సరికొత్త కథాంశంతో దర్శకుడు కంభంపాటి ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ ఈ నెల 14న విడుదల కానుంది.


సంతు.. రారాజుగా వస్తున్నాడు

‘కేజీయఫ్‌’ (KGF) సిరీస్‌ చిత్రాలతో విశేష ప్రేక్షకాదరణ పొందిన నటుడు యశ్‌ (Yash). ఆ క్రేజ్‌ను దృష్టిని పెట్టుకొని పలువురు నిర్మాతలు యశ్‌ గతంలో నటించిన సినిమాలను తెలుగులో డబ్‌ చేస్తున్నారు. అలా.. ‘సంతు.. స్ట్రయిట్‌ ఫార్వార్డ్‌’ (Santhu Straight Forward) అనే సినిమా ‘రారాజు’ (Raraju)గా తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది. యశ్‌ సతీమణి రాధిక పండిట్‌ కథానాయికగా నటించిన ఈ సినిమా ఈ నెల 14న సందడి చేయనుంది. మహేశ్‌ రావు దర్శకత్వం వహించిన ఈ సినిమా కన్నడ (2016)లో మంచి విజయం అందుకుంది.


రికార్డు సృష్టించిన ‘కాంతారా’

రిషబ్‌ శెట్టి (Rishab Shetty) స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన కన్నడ చిత్రం ‘కాంతారా’ (Kantara). సెప్టెంబరు 30న కన్నడనాట  విడుదలైన ఈ సినిమా రికార్డు సృష్టించింది. దాంతో చిత్ర బృందం ఈ సినిమాని ఇతర భాషల్లోనూ విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రం ఈ నెల 15న తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది.

థియేటర్లలో అలరించేందుకు సిద్ధమైన మరిన్ని చిత్రాలు..

 


ఓటీటీలో వినోదం పంచేందుకు..

నెట్‌ఫ్లిక్స్‌

ది ప్లే లిస్ట్ (అక్టోబరు 13)

Miss matched (14)

దోబారా (15)


సోనీ లివ్

ఈషో (Eesho)(తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం)

గుడ్‌ బ్యాడ్‌ గర్ల్‌ Good bad girl (14)


అమెజాన్‌ ప్రైమ్‌

ది రింగ్స్ ఆఫ్ పవర్: ఫైనల్  (14)

నేను మీకు బాగా కావాల్సిన వాడిని (14)


ఆహా..

నేను మీకు బాగా కావాల్సిన వాడిని (14)

Unstoppable season 2 ..show (14)


డిస్నీ+హాట్‌స్టార్‌

ఆషికానా సీజన్‌ 2 (Aashikana season 2) 

హౌజ్‌ ఆఫ్‌ ది డ్రాగన్‌ 8th ఎపిసోడ్‌( House of the dragon 8th episode)

షి హల్క్‌ (She hulk)

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని