Chiranjeevi: హర హర.. భోళా శంకరా

చిరంజీవి - మెహర్‌ రమేష్‌ కలయికలో రూపొందుతోన్న మాస్‌ యాక్షన్‌ చిత్రం ‘భోళా శంకర్‌’. రామబ్రహ్మం సుంకర నిర్మాత.

Updated : 19 Feb 2023 14:42 IST

చిరంజీవి - మెహర్‌ రమేష్‌ కలయికలో రూపొందుతోన్న మాస్‌ యాక్షన్‌ చిత్రం ‘భోళా శంకర్‌’. రామబ్రహ్మం సుంకర నిర్మాత. తమన్నా కథానాయిక. కీర్తి సురేష్‌ కీలక పాత్ర పోషిస్తోంది. ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. శనివారం మహా శివరాత్రి సందర్భంగా ఈ చిత్ర మోషన్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. అందులో చిరు చేతిలో ఢమరుకం పట్టుకొని శివతాండవం చేస్తున్నట్లుగా కనిపించారు. తమిళంలో విజయవంతమైన ‘వేదాళం’కు రీమేక్‌గా రూపొందుతోన్న చిత్రమిది. అన్నాచెల్లెళ్ల అనుబంధాల నేపథ్యంలో సాగనుంది. ఇందులో చిరంజీవి చెల్లిగా కీర్తి కనిపించనుంది. రావు రమేష్‌, మురళి శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి మహతి స్వర సాగర్‌ సంగీతమందిస్తున్నారు. డడ్లీ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు.Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు