ఖుషిఖుషీగా సమంత

అగ్ర కథానాయిక సమంత మళ్లీ చిత్రీకరణలతో బిజీ అవుతోంది. ఆమె ఇప్పటికే రాజ్‌-డీకే తెరకెక్కిస్తున్న ‘సిటాడెల్‌’ వెబ్‌సిరీస్‌ కోసం రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే.

Updated : 20 Feb 2023 14:10 IST

అగ్ర కథానాయిక సమంత మళ్లీ చిత్రీకరణలతో బిజీ అవుతోంది. ఆమె ఇప్పటికే రాజ్‌-డీకే తెరకెక్కిస్తున్న ‘సిటాడెల్‌’ వెబ్‌సిరీస్‌ కోసం రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ‘ఖుషి’ చిత్ర సెట్లోకి అడుగు పెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. ఆమె, విజయ్‌ దేవరకొండ జంటగా నటిస్తున్న చిత్రమిది. శివ నిర్వాణ తెరకెక్కిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఇప్పటికే కొంత భాగం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. ప్రస్తుతం మరో కొత్త షెడ్యూల్‌ ప్రారంభించుకునేందుకు సిద్ధమైంది. దీనికోసం ఈనెల 27న విజయ్‌ సెట్లోకి అడుగు పెట్టనున్నారని.. మార్చి 8 నుంచి సమంత రంగంలోకి దిగుతుందని సమాచారం. దాదాపు నెలరోజుల పాటు హైదరాబాద్‌లోనే ఈ చిత్రీకరణ కొనసాగనుందని.. ఏప్రిల్‌లో అలెప్పీలో మరో షెడ్యూల్‌కు శ్రీకారం చుట్టనున్నారని తెలిసింది. కశ్మీర్‌ నేపథ్యంలో సాగే ఈ ప్రేమకథా చిత్రంలో విజయ్‌ ఆర్మీ అధికారిగా కనిపించనున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు