Chiranjeevi: కాలేజీలో చిరు-కీర్తి

ఈ సంక్రాంతికి ‘వాల్తేరు వీరయ్య’గా వినోదాలు పంచారు చిరంజీవి. ఇప్పుడు ‘భోళా శంకర్‌’గా అలరించేందుకు సెట్స్‌పై ముస్తాబవుతున్నారు.

Updated : 14 Mar 2023 06:31 IST

సంక్రాంతికి ‘వాల్తేరు వీరయ్య’గా వినోదాలు పంచారు చిరంజీవి. ఇప్పుడు ‘భోళా శంకర్‌’గా అలరించేందుకు సెట్స్‌పై ముస్తాబవుతున్నారు. మెహర్‌ రమేష్‌ తెరకెక్కిస్తున్న చిత్రమిది. రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో చిరుకు చెల్లిగా కీర్తి సురేష్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ ఇద్దరిపై హైదరాబాద్‌లోని కోఠి ఉమెన్స్‌ కాలేజీలో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. చిరు-కీర్తిలపై షూట్‌ చేస్తున్న సుదీర్ఘ షెడ్యూల్‌ ఇదని.. ఈ ఎపిసోడ్స్‌ సినిమాకెంతో కీలకంగా నిలుస్తాయని చిత్రవర్గాలు చెబుతున్నాయి. అన్నాచెల్లి అనుబంధాల నేపథ్యంలో సాగే కథతో మాస్‌ యాక్షన్‌ చిత్రంగా దీన్ని రూపొందిస్తున్నారు. ఇందులో చిరుకు జోడీగా తమన్నా నటిస్తోంది. మహతి స్వరసాగర్‌ సంగీతమందిస్తున్నారు. డడ్లీ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని