అందుకే చిరు సర్ అలా అనుంటారు: రష్మిక
వరుస సినిమాలతో దూసుకుపోతున్న ముద్దుగుమ్మ రష్మిక. ‘ఛలో’, ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ వంటి సూపర్‌హిట్ చిత్రాలతో యువతను ఆకట్టుకున్న ఆమె నటించిన సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. మహేశ్‌బాబు కథానాయకుడిగా నటించారు.....
హైదరాబాద్: వరుస సినిమాలతో దూసుకుపోతున్న ముద్దుగుమ్మ రష్మిక. ‘ఛలో’, ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ వంటి సూపర్‌హిట్ చిత్రాలతో యువతను ఆకట్టుకున్న ఆమె నటించిన తాజా సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. మహేశ్‌బాబు కథానాయకుడిగా నటించారు. సంక్రాంతి కానుకగా జనవరి 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా రష్మిక మీడియాతో మాట్లాడారు. సినిమాలో తన పాత్ర గురించి పంచుకున్నారు. ఆ విశేషాలివి..
ఈ సినిమాలో మీ పాత్ర ఎలా ఉంటుంది?
మీరు ట్రైలర్ చూసుంటే ఇప్పటికే అర్థమై ఉంటుంది. హీరో వెంటపడి బాగా అల్లరి చేసే పాత్ర, చాలా సరదాగా ఉంటుంది. ఈ సినిమా ద్వారా నాకు పూర్తి స్థాయిలో కామెడీ చేసే అవకాశం దక్కింది.
సెట్‌లో కూడా బాగా అల్లరి చేసేవారా?
సాధారణంగా సెట్‌లో సీరియస్‌గా ఉండటం నాకు నచ్చదు. అల్లరి చేయడం అంటేనే ఇష్టం. అందుకని సెట్‌లో అందరితో సరదాగా ఉండేదాన్ని.
మహేశ్‌లో నచ్చిన గుణం ఏంటి?
సెట్‌లో మహేశ్ చాలా మౌనంగా ఉండేవారు. నేనెళ్లి ఆయన్ని డిస్ట్రబ్ చేసేదాన్ని.
ట్రైలర్ చూస్తుంటే మీ పాత్ర విభిన్నంగా ఉన్నట్లుంది?
అవునండీ. ‘మీకు అర్థమవుతుందా, ఐయాం ఇంప్రెస్డ్’ లాంటి మేనరిజమ్స్ సినిమా అంతా ఉంటాయి. దాంతోపాటు సంగీతతో కలిసి చేసే ‘నెవ్వర్ బిఫోర్, ఎవ్వర్ ఆఫ్టర్’లాంటి మేనరిజమ్స్ ఆడియన్స్‌కి బాగా రీచ్ అవుతాయి.
దర్శకుడు అనిల్ రావిపూడి ప్రతి సీన్‌లో నటించి, చూపించేవారా?
ఆయనకి నేను ఒక్కటే చెప్పా. ‘సార్ మీరు చేయండి. నేను కాపీ చేస్తా. ఐయాం వెరీ గుడ్ కాపీ క్యాట్’ అన్నా. ఆయన చేసేదాన్ని స్కాన్ చేసి, నా స్టైల్‌లో ఫాలో అయ్యా.
ప్రీ రిలీజ్‌లో విజయశాంతితో బాగా కలిసిపోయినట్లు కనిపించారు. ఇంత తక్కువ టైమ్‌లో ఆమెతో అంత బంధం ఎలా ఏర్పడింది?
కేరళ షెడ్యూల్‌లో నేను మొదటిసారి ఆమెను కలిశా. నాకు ఇంతకుముందే మేడమ్ గురించి తెలుసు. లేడీ అమితాబ్‌లాంటి ఆమెతో కలిసి మాట్లాడాలంటే కొంచెం భయం వేసింది. తర్వాత సెట్‌లో ఆమె ఎనర్జీ చూసి ఫిదా అయ్యా. వరుసగా రెండు రోజులు ఆమెతోనే ఉన్నా. డ్యాన్స్, నటనకి సంబంధించిన కొన్ని సలహాలు అడిగి తెలుసుకున్నా.
షూటింగ్‌లో మహేశ్ మీ సినిమాల గురించి మాట్లాడేవారా?
మహేశ్ దాదాపు అన్ని సినిమాలు చూస్తారు. నేను నటించిన ‘ఛలో’, ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ సినిమాలు చూశానని చెప్పారు.
సాధారణంగా స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్స్‌కి అంతగా ప్రాధాన్యత ఉండదు? కానీ ఇందులో మీ పాత్ర బలంగా ఉంది కదా..
ఈ విషయంలో నేను చాలా సంతోషంగా ఉన్నా. సినిమాలో నా పాత్ర అలా ఎందుకు ప్రవర్తిస్తుందనే దానికి బలమైన కారణం ఉంటుంది.
మీరు ఈ సినిమాకు సంతకం చేయడానికి కారణం?
అనిల్ సర్ ఈ స్క్రిప్టు నెరేట్ చేసేటప్పుడే నా పాత్ర, సంగీత పాత్ర ఎలా ఉంటుందో చూపించారు. అప్పుడే నాకు బాగా నచ్చింది. అందులోనూ ఈ సినిమాలో మంచి ఫీల్ ఉంది. అలాగే మహేశ్, విజయశాంతితో కలిసి నటించడం బోనస్.
రైలు ఎపిసోడ్ గురించి చెప్పండి?
నేను డబ్బింగ్ చెబుతున్నప్పుడు ఆ సన్నివేశాలు చూసి నవ్వు ఆపుకోలేకపోయా. షూటింగ్ చేస్తున్నప్పుడు కూడా మొత్తం చిత్ర బృందం బాగా నవ్వుకున్నాం. రేపు ప్రేక్షకులు కూడా ఆ కామెడీ ట్రాక్‌ని పూర్తిగా ఎంజాయ్ చేస్తారు.
మైండ్ బ్లాక్ సాంగ్?
ఆ పాట చిత్రీకరణ రోజు నాకు డ్యాన్స్ వచ్చో, రాదో అనే సందేహం అందరికీ ఉంది. కానీ ఒక చిన్న డ్యాన్స్ బిట్ చేసి చూపించా. అందరూ ఎగ్జైట్ అయ్యారు. అలా మహేశ్‌తో డ్యాన్స్ చేయడం చాలా ఎంజాయ్ చేశా. ఎలా ఉందో రేపు థియేటర్లో సినిమా చూసి మీరే చెప్పాలి.
మహేశ్‌తో ఎవరు హీరోయిన్‌గా చేసినా సితార వారికి ఫ్రెండ్ అవుతుంది?
సితార, నేను, ఆద్య ఒక గ్యాంగ్. మా ముగ్గురిలో ఎవరితో మాట్లాడాలన్నా.. మిగతా ఇద్దరికి తెలియాల్సిందే.
చిరంజీవి స్టేజ్ మీద ‘నన్ను కాంట్రాక్ట్ తీసుకున్నావా రష్మిక’ అనడం గురించి?
‘ఛలో’, ‘గీత గోవిందం’ సినిమాల ఈవెంట్స్‌కి చిరంజీవి అతిథిగా వచ్చారు. అప్పుడు ‘ఎందుకో మీరు నా లక్కీ ఛార్మ్ అనిపిస్తుంది సర్’ అని చిరుతో చెప్పా. అందుకే ఆయన అలా అనుంటారు. ఆయనది స్వీట్ హార్ట్. నా ఫంక్షన్స్ అన్నింటికీ రావాలని కోరుకుంటున్నాను.
ఈ సినిమా షూటింగ్ చాలా తొందరగా పూర్తయింది కదా?
సాధారణంగా అనిల్ సర్‌కి స్క్రిప్ట్ మీద పూర్తి అవగాహన ఉంటుంది. అలాగే రత్నవేలు వేగంగా పనిచేస్తారు. ఒక సీన్ అయిపోగానే, మరో సీన్‌కి వెంటనే షిఫ్ట్ అవుతారు. అలా క్లారిటీ ఉన్న దర్శకుడు, ఫాస్ట్‌గా పనిచేసే టీమ్ ఉండటం వల్ల షూటింగ్ తొందరగా పూర్తి చేయగలిగాం.
మీ తర్వాతి సినిమా?
ప్రస్తుతం నితిన్‌తో ‘భీష్మ’ చిత్రం చేస్తున్న విషయం మీకు తెలిసిందే. ఫిబ్రవరిలో ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. అలాగే అల్లు అర్జున్, సుకుమార్‌ల కాంబినేషన్‌లో ఓ సినిమా చేస్తున్నా. ఇంకో రెండు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Chamkeela Angeelesi: యూట్యూబ్‌ను షేక్ చేస్తోన్న ‘చమ్కీల అంగిలేసి’.. ఈ వీడియోలు చూశారా..!
-
World News
Biden Vs Netanyahu: మా నిర్ణయాలు మేం తీసుకుంటాం.. అమెరికాకు స్పష్టం చేసిన ఇజ్రాయెల్
-
General News
Viveka Murder case: వివేకా హత్య కేసు విచారణకు కొత్త సిట్..
-
Sports News
Mumbai Indians: ముంబయికి మాత్రమే ఈ రికార్డులు సాధ్యం.. ఓ లుక్కేస్తారా?
-
General News
Telangana News: కలుషిత నీరు తాగిన కూలీలు.. 24 మందికి అస్వస్థత
-
Crime News
Crime News: పెద్దలు అడ్డుచెప్పారని.. రైలు కింద పడి ప్రేమ జంట ఆత్మహత్య!