మా నాన్న సినిమాలన్నీనా ఫేవరెట్టే: సితార
టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు గారాలపట్టీ సితార, దర్శకుడు వంశీ పైడిపల్లి కుమార్తె ఆద్యా.. వీరిద్దరు కలిసి ‘A&S’ పేరుతో ఓ యూట్యూబ్ ఛానెల్‌ను నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా వీరిద్దరు ‘సరిలేరు నీకెవ్వరు’ హీరోయిన్ రష్మికను సరదాగా ఆటపట్టించారు....
ఆద్యా, సితారతో రష్మిక సందడి
హైదరాబాద్: టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు గారాలపట్టి సితార, దర్శకుడు వంశీ పైడిపల్లి కుమార్తె ఆద్యా.. వీరిద్దరు కలిసి ‘A&S’ పేరుతో ఓ యూట్యూబ్ ఛానెల్‌ను నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా వీరిద్దరు ‘సరిలేరు నీకెవ్వరు’ హీరోయిన్ రష్మికను సరదాగా ఆటపట్టించారు. అంతేకాకుండా ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రానికి సంబంధించిన విషయాలను రష్మిక, సితార అభిమానులతో పంచుకున్నారు. అయితే తన తండ్రి మహేశ్ నటించిన చిత్రాలన్నీ తన అభిమాన సినిమాలేనని అంటున్నారు సితార. ఆ విశేషాలివే..
సితార: మా నాన్నతో కలిసి పనిచేయడం ఎలా ఉంది?
రష్మిక: మహేశ్‌బాబుతో వర్క్ అని చెప్పగానే మొదట భయపడ్డాను. ఎందుకంటే ఆయన సూపర్‌స్టార్ కాబట్టి. సెట్లో ఆయన్ని కలిశాకా సినిమా షూటింగ్ మొత్తం చాలా సరదాగా గడిచింది. సెట్లో ఎప్పుడూ నేను చాలా అల్లరి చేసేదాన్ని. (సితార మధ్యలో అందుకుని.. మీరు టామ్‌బాయ్ లాంటివారు కదా).
ఆద్యా: ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో పనిచేయడం ఎలా ఉంది?
రష్మిక: ఇది నా మొదటి పెద్ద సినిమా అని అందరూ అన్నారు. దీంతో నేను కూడా టాలెంట్‌ను చూపించాలనుకున్నా. సెట్లోకి వెళ్లాక అందరూ పెద్ద పెద్ద నటీనటులు. చాలా భయం వేసింది. పైకి చాలా ధైర్యంగా కనిపించే దాన్ని.. కానీ లోపల మాత్రం భయపడేదాన్ని.
సితార: ‘సరిలేరు నీకెవ్వరు’లో మీకు బాగా నచ్చిన సన్నివేశం ఏది?
రష్మిక: క్లైమాక్స్.. (మధ్యలో సితార అందుకుని క్లైమాక్స్ ఏంటో చెప్పండి అని అడగగా.. నో నేను చెప్పలేను. య్యూటూబ్‌లో మీకు చాలామంది అభిమానులు ఉన్నారు. నేను కనుక చెబితే ఈ వీడియో చూసిన అందరికీ క్లైమాక్స్ తెలిసిపోతోంది.)
ఆద్యా: డ్యాన్స్‌ని బాగా ఎంజాయ్ చేశారా?
రష్మిక: డ్యాన్స్ కోసం చాలా కష్టపడ్డాను. మొదటిసారి ఈ సినిమాలోనే నేను డ్యాన్స్ చేశాను. సూపర్‌స్టార్‌తో కలిసి డ్యాన్స్ చేయడం కష్టంగా అనిపించింది.
సితార : ఈ సినిమాలో ‘మైండ్ బ్లాక్’ సాంగ్‌లో డ్యాన్స్ చేసిన తర్వాత.. ‘నాకు ఊపిరిరాడడం లేదు బాబోయ్’ అని కూర్చుని పోయారు కదా..!
రష్మిక: మీకు ఎవరు చెప్పారు. (నవ్వులు)
సితార: ఈ సినిమాలో మీకు నచ్చిన పాట?
రష్మిక: సరిలేరు నీకెవ్వరు యాంథమ్.(మధ్యలో సితార అందుకుని మా నాన్నతోపాటు మీరు కూడా ఉన్న పాట చెప్పండి..? అలా అయితే నాకు ‘He is soo Cute’ అని రష్మిక తెలిపింది.)
రష్మిక: ఇంతకీ నీకు ఏ పాట ఇష్టం సితార..?
సితార: మైండ్ బ్లాక్ సాంగ్
ఆద్యా: He is soo Cute
రష్మిక: మీకు య్యూటూబ్ ఛానెల్ పెట్టాలనే ఐడియా ఎలా వచ్చింది?
ఆద్యా: మా ఇద్దరికీ యూట్యూబ్ ఛానెల్ పెట్టాలనే ఆలోచన ఉండేది. మేమిద్దరం కలిసి ఎదో ఒక వీడియో చేస్తుండేవాళ్లం. మేము ఒక వీడియో చేస్తే అది రామ్ అంకుల్ చూశారు. ఆయనే చెప్పారు యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేయమని. అలా మేం స్టార్ట్ చేశాం.
సితార: అప్పుడు నేను ‘A&S’ అనే పేరు పెట్టాను.
రష్మిక: మీ ఫేవరెట్ సినిమా ఏది..?
సితార: మా నాన్న సినిమాలన్నీ నా అభిమాన చిత్రాలే. ఆయన నటించిన ఏ సినిమా విడుదలైతే అదే నా ఫేవరెట్ మూవీ.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చిరంజీవితో ఆ పాటకు డ్యాన్స్ వేయడం కష్టంగా అనిపించింది: రాధ
నటి రాధ ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆమె కెరీర్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. -
Prithviraj Sukumaran: అందుకు మలయాళ ఇండస్ట్రీ నాపై అసూయ పడిందేమో: పృథ్వీరాజ్ సుకుమారన్
తన కొత్త సినిమా ‘ఆడుజీవితం’ ప్రచారంలో భాగంగా హైదరాబాద్‌కు వచ్చారు మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమార్. ఆ చిత్రం గురించి పలు విశేషాలు పంచుకున్నారు. -
alitho saradaga: డబ్బులు అడుగుతానేమోనని కొందరు తప్పించుకు తిరిగేవాళ్లు: పుల్లెల గోపీచంద్
ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఆలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చారు. చాముండేశ్వర నాథ్‌తో కలిసి ఆయన చెప్పిన సంగతులేంటంటే.. -
Anupama Parameswaran: అందుకు బోర్ ఫీలయ్యా.. గ్లామర్ డోస్‌పై స్పందించిన అనుపమ
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ జంటగా నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. ఈ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్లో హైదరాబాద్‌లో జరిగింది. -
Priyadarshi: స్వచ్ఛమైన హాస్యంతో సినిమా ఓ పెద్ద సవాల్
‘‘కథానాయకుడు అనగానే ఒక ప్రత్యేకమైన ఇమేజ్‌కి పరిమితం చేసినట్టు ఉంటుంది. స్వేచ్ఛగా ఉండలేను. నన్ను నేను ఓ నటుడిగా చూసుకోవడానికే ఇష్టపడతా’’ అన్నారు ప్రియదర్శి. -
Sivaji: ఆలీ అన్నా.. దయచేసి ఎన్నికల్లో పోటీ చేయొద్దు: శివాజీ
ఇప్పటి రోజుల్లో రాజకీయాలు వ్యాపారంగా మారాయన్నారు నటుడు శివాజీ. డబ్బులు ఖర్చుపెట్టడంతోపాటు వివిధ మార్గాల్లో ఆ మొత్తాన్ని తిరిగి లాక్కొనేవారికే పాలిటిక్స్ సెట్ అవుతాయన్నారు. -
Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్.. ఆ ఉద్దేశంతో పెట్టలేదు : అల్లరి నరేశ్
నరేశ్ హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో నరేశ్ పాల్గొని సందడి చేశారు. -
Raghu Karumanchi: స్టాక్‌మార్కెట్.. రూ.కోట్లలో నష్టపోయా: రఘు
ఈటీవీలో ప్రసారమవుతోన్న సెలబ్రిటీ టాక్ షో ‘చెప్పాలని ఉంది’ (Cheppalani Vundi). బాలాదిత్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఈ కార్యక్రమంలో తాజాగా టాలీవుడ్ హాస్యనటుడు రఘు కారుమంచి (Raghu Karumanchi) పాల్గొన్నారు. తన కెరీర్ విశేషాలు పంచుకున్నారు. -
Akash Puri: అప్పటి వరకు నాన్న దర్శకత్వంలో నటించను: ఆకాశ్ పూరి
తన తండ్రి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రస్తుతానికి నటించాలనుకోవడంలేదని నటుడు ఆకాశ్ తెలిపారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. -
Suhaas: రూ.3 కోట్ల రెమ్యూనరేషన్.. సుహాస్ ఏమన్నారంటే!
తాజాగా ‘ప్రసన్నవదనం’ టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఇందులో సుహాస్ తన రెమ్యూనరేషన్పై స్పందించారు. -
Gopichand: ఆ పిల్లల చదువుకు సాయం చేస్తున్నా.. చెప్పకపోవడానికి కారణమదే: గోపీచంద్
ప్రముఖ హాస్యనటుడు ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీ వేదికపై విశేష ఆదరణ సొంతం చేసుకున్న సెలబ్రిటీ టాక్ షో ‘ఆలీతో సరదాగా’ (Alitho Saradaga). ఈ షో సెకండ్ సీజన్ తాజాగా మొదలైంది. తొలి ఎపిసోడ్‌కు గోపీచంద్ (Gopichand) అతిథిగా విచ్చేశారు. -
Gopichand: భీమా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయే పాత్ర: గోపీచంద్
భీమా ప్రమోషన్స్‌లో భాగంగా హీరో గోపీచంద్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. -
మూఢ నమ్మకాలు లేని దెయ్యం సినిమా ‘వళరి’
‘హారర్ సినిమాల సంఖ్య తగ్గుతున్న సమయంలో.. ఆ లోటును ‘వళరి’ చిత్రం తీర్చేయడానికి త్వరలో రాబోతుంది’ అంటున్నారు దర్శకురాలు మ్రితికా సంతోషిణి. దర్శకురాలిగా ఆమె రూపొందించిన తొలి చిత్రమిది. రితికా సింగ్, శ్రీరామ్ ప్రధాన పాత్రల్లో నటించారు. -
Varun Tej: కల్యాణ్ బాబాయ్ ఇలా చెప్పడం అరుదు: వరుణ్ తేజ్
తన కొత్త సినిమా ‘ఆపరేషన్ వాలెంటైన్’ మార్చి 1న విడుదల కానున్న సందర్భంగా విలేకరులతో ముచ్చటించారు హీరో వరుణ్ తేజ్. -
Sundeep Kishan: అలా చేసుంటే మీ సినిమా బ్లాక్‌బస్టర్ అయ్యేది: సందీప్ కిషన్‌తో అభిమాని
తన అభిమానులతో సోషల్ మీడియా వేదికగా ముచ్చటించారు హీరో సందీప్ కిషన్. -
Janhvi Kapoor: నాన్న ఆ విషయం నాకూ చెప్పలేదు: జాన్వీ కపూర్
బాలీవుడ్ నటి జాన్వీకపూర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ‘దేవర’ సినిమా విశేషాలతో పాటు మరికొన్ని సంగతులు పంచుకున్నారు. -
Varun Tej: ఆ సీక్వెల్లో నేనెందుకు నటిస్తా?.. చరణ్ చేస్తాడు: వరుణ్ తేజ్
వరుణ్ తేజ్ తాజా చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ఆయన పాల్గొని సందడి చేశారు. -
Miss World 2024 Pageant: నాపై ఒత్తిడేమీ లేదు.. మిస్ వరల్డ్ -2024 పోటీదారు సినిశెట్టి.. ఆసక్తికర కబుర్లు
Miss World 2024: ఫిబ్రవరి 18 నుంచి భారత్ వేదికగా మిస్ వరల్డ్ 2024 పోటీలు జరగనున్న నేపథ్యంలో భారత్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సినిశెట్టి పంచుకున్న విషయాలు.. -
Prudhvi Raj: ఆ కష్ట సమయంలో నన్ను ఆదుకుంది ఇండస్ట్రీనే: పృథ్వీరాజ్
హాస్యనటుడు బలిరెడ్డి పృథ్వీరాజ్ ‘చెప్పాలని ఉంది’ కార్యక్రమానికి హాజరయ్యారు. తన సినీ, రాజకీయ అనుభవాలను పంచుకున్నారు. -
Ravi Teja: ఆ విషయం ముందే చెప్పడం నాకు ఇష్టంలేదు: వరుణ్‌తేజ్‌తో రవితేజ
రవితేజ, వరుణ్ తేజ్.. తమ కొత్త చిత్రాల విశేషాలను ఒకరికొకరు పంచుకున్నారు. అవేంటో చూసేయండి.. -
Venu: అలా అనుకొనే వారికి సమాధానమే ‘బలగం’..: వేణు యెల్దండి
హాస్యనటుడు, దర్శకుడు వేణు యెల్దండి ‘చెప్పాలని ఉంది’ కార్యక్రమానికి హాజరయ్యారు. తన సినీ జీవితం, అనుభవాలను పంచుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఫోన్‌ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్‌రావుకు 14 రోజుల రిమాండ్
-
అనన్య-ఆదిత్య ఫొటోషూట్.. అల్లు అర్జున్-స్నేహారెడ్డి స్పెషల్ మూమెంట్
-
తెలంగాణలో పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు.. ఏప్రిల్ ఒకటి నుంచి వడగాల్పులు
-
కొరియాపై ఐరాస ఆంక్షల వల్ల ప్రయోజనం లేదు: రష్యా
-
టిల్లు స్క్వేర్.. రూ.100 కోట్ల గ్రాస్ వస్తుందనుకుంటున్నా: నాగవంశీ
-
‘వారిపై సినిమాలు రావాలి’.. మస్క్ ఆలోచనకు మహీంద్రా సపోర్ట్