‘అల వైకుంఠపురములో’ ఆ సినిమా రీమేక్ కాదు
తన స్టైల్‌తో అభిమానుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు అల్లు అర్జున్. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఆయన కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘అల వైకుంఠపురములో..’ పూజా హెగ్డే కథానాయిక. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి...
తన స్టైల్‌తో అభిమానుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు అల్లు అర్జున్. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఆయన కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘అల వైకుంఠపురములో..’ పూజా హెగ్డే కథానాయిక. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా గురించి అల్లు అర్జున్ అనేక విషయాలను పంచుకున్నారు.
గత చిత్రాల్లో మాదిరిగానే ఈ సినిమాలోనూ స్టైల్‌గా గ్లామర్‌గా కనిపిస్తున్నట్లున్నారు?
అల్లు అర్జున్: అందుకు కారణం నా హెయిర్ స్టైల్. ఇంత పొడవాటి జుట్టు ఇదివరకు పెంచలేదు. ఈ సినిమా చేసిన 8 నెలలు నేను హ్యాపీగా ఉన్నాను. బయటకు కూడా అదే కనిపిస్తుందనుకుంటాను.
‘అల వైకుంఠపురములో’ ఓ బాలీవుడ్ సినిమాను రీమేక్ అని టాక్ వినిపిస్తోంది?
అల్లు అర్జున్: ‘సోను కే టిటు కి స్వీటీ’ అనేది గీతా ఆర్ట్స్‌లో రీమేక్ చేద్దామని అడిగారు. చాలామంది అది నాకోసమని అనుకున్నారు. అయితే అది నా కోసం కాదు. దాన్ని రీమేక్ చేస్తే బాగుంటుందా? అని నేను వ్యక్తిగతంగా కూడా ఆలోచించా. ఆ సమయంలో త్రివిక్రమ్ గారు, నేనూ కలిసి ఒక స్టోరీ అనుకున్నాం. రెండు స్టోరీల్లో మేమనుకున్నదే బెటర్ అనిపించింది. అందుకే ఆ సినిమా జోలికి వెళ్లకుండా ఈ స్టోరీతోనే ముందుకెళ్లాం.
సరదాగా సాగిపోయే సినిమా చేయాలని ఎందుకు అనుకున్నారు?
అల్లు అర్జున్: మా కాంబినేషన్‌లో వచ్చిన, ‘జులాయి’లో ఎంటర్‌టైన్‌మెంట్ ఎక్కువగా ఉంటే, ‘సన్నాఫ్ సత్యమూర్తి’లో ఎమోషనల్ సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయి. మళ్లీ సినిమా చేస్తే, ఎంటర్‌టైన్‌మెంట్‌తో కూడిన సినిమా చెయ్యాలని అప్పుడే ఇద్దరం అనుకున్నాం. అనుకోకుండా నా చివరి మూడు ‘సరైనోడు’, ‘డీజే’, ‘నా పేరు సూర్య’ కొంచెం సీరియస్ సినిమాలు అయ్యాయి. నాక్కూడా ‘రేసుగుర్రం’ చిత్రం చేయాలని ఎప్పటి నుంచో ఉంది. త్రివిక్రమ్ గారు ‘అరవింద సమేత’ లాంటి సీరియస్ సినిమా తర్వాత ఓ ఎంటర్‌టైన్‌మెంట్ చిత్రంచేయాలనుకున్నారు. అలా ‘అల వైకుంఠపురములో’ స్టోరీ ఉంది. ఆ కథను ఆయన నాకెప్పుడో చెప్పారు. అది బాగుంటుందని అనుకున్నాక, దాన్ని డెవలప్ చేశారు. ఇప్పటి వరకూ నేను పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఎప్పుడూ చేయలేదు. ఇందులోనే హీరోయిజం, యాక్షన్ కూడా బాగా కుదిరాయి. అలాగే పాటలు కూడా.
త్రివిక్రమ్‌తో మూడు సినిమాలు చేశారు. ఆయనతో పనిచేయడం ఎలా ఉంది?
అల్లు అర్జున్: నా చివరి 10 సినిమాల్లో 3 త్రివిక్రమ్ గారితోనే చేశాను. ఆయనేమో నేను 10 సినిమాలు చేస్తే, వాటిలో 3 మీతోనే చేశాను అని ఆయనంటున్నారు. కొన్నిసార్లు ఒక హీరోకి, ఒక డైరెక్టర్‌కి ఆలోచనలు కలుస్తాయి. గతంలో చిరంజీవి గారికి, కోదండరామిరెడ్డి గారికీ బాగా కుదిరింది. వాళ్లిద్దరూ కలిసి చాలా సినిమాలు చేశారు. అలా కలిసి చాలా సినిమాలు చెయ్యగల కెమిస్ట్రీ త్రివిక్రమ్ గారికీ, నాకూ మధ్య ఉంది. మేం ఒకళ్లనొకళ్లం బాగా అర్థం చేసుకుంటాం. ఆయనతో సౌకర్యంగా ఉంటుంది.
ఈ సినిమాకు ముందు తీసుకున్న గ్యాప్‌లో ఏం నేర్చుకున్నారు?
అల్లు అర్జున్: ఒక మనిషి వృతి జీవితంలో గ్యాప్ తీసుకున్నప్పుడు చాలా విషయాలు తెలుసుకుంటాడు. అవి చిన్న చిన్న సింపుల్ విషయాలే కావచ్చు. కానీ, గొప్ప విషయాలు తెలుసుకుంటాడు. ఇక లైఫ్‌లో గ్యాప్ తీసుకోకూడదనే గొప్ప విషయం తెలుసుకున్నాను. ఒకటిన్నర సంవత్సరం సినిమా లేకపోయినా నా విషయంలో ఫ్యాన్స్ చూపించిన అభిమానం, ప్రేమ ఎప్పటికీ మర్చిపోలేను.
ఇందులో మీ క్యారెక్టర్ ఏమిటి?
అల్లు అర్జున్: వైకుంఠపురం అనే ఇల్లుంది. ఆ ఇంట్లో చాలామంది ఉన్నారు. వాళ్ల మధ్య జరిగిన సంఘటనలే ఈ సినిమా. ఈ సినిమాలో నేను ఒక మిడిల్ క్లాస్ అబ్బాయిగా చేశాను. పూజా హెగ్డే బాస్‌గా ఉన్న ఆఫీసులో పనిచేస్తుంటాను. నాకూ, మా నాన్నకూ పడదు. నా తండ్రి పాత్రలో మురళీశర్మ చేశారు. వైకుంఠపురం అనే ఒక పెద్ద ఇంటికీ, మాకూ ఉన్న కనెక్షన్ ఏమిటనేది సినిమాలో చూడాలి.
సంక్రాంతి పోటీపై మీ అభిప్రాయమేమిటి?
అల్లు అర్జున్: సంక్రాంతి పోటీ అనేది ఎప్పటి నుంచో ఉంది. ఎన్నో కోట్లు పెట్టి సినిమా తీసే ఏ ప్రొడ్యూసర్ అయినా సోలో రిలీజే కోరుకుంటాడు. అలా వస్తే చాలా డబ్బులొస్తాయ్. సంక్రాంతికి రెండు మూడు సినిమాలైనా ఎందుకొస్తాయంటే, మిగతా రోజుల్లో సోలో రిలీజ్‌కు వచ్చిన దానికంటే 20 నుంచి 30 శాతం ఎక్కువ డబ్బులు వస్తాయి. పండగకు విడుదలైన అన్నీ సినిమాలు ఆడాలని కోరుకుంటున్నా.
యువతను విశేషంగా ఆకట్టుకుంటున్న ‘సామజవరగమన’ పాటను మూడు నెలల ముందే విడుదల చేయాలన్న ఆలోచన ఎవరిది?
అల్లు అర్జున్: అది నా ఆలోచన. అంత ముందుగా సాంగ్ రిలీజ్ చేద్దామని నేననగానే అందరూ భయపడ్డారు. హిందీ సినిమాల్లో అందరూ దాదాపు 4 నెలల ముందే సాంగ్స్ రిలీజ్ చేస్తుంటారు. మనకి కూడా ఆ కల్చర్ వస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఒక పాట జనాల్లోకి బాగా వెళ్లడానికి కనీసం రెండు మూడు నెలలు పడుతుంది. అందుకే అంత ముందుగా ఆ సాంగ్స్ విడుదల చేశాం. అందుకే అవి అంత బాగా హిట్టయ్యాయి. ‘సామజవరగమన’కు సాంగ్ ఆఫ్ ది ఇయర్ అనే పేరు కూడా వచ్చింది.
మలయాళంలోనూ క్రేజ్ తెచ్చుకోవడాన్ని ఎలా ఫీలవుతున్నారు?
అల్లు అర్జున్: అద్భుతంగా ఫీలవుతున్నా. అక్కడ నాకు మామూలు గౌరవం లభించలేదు. ఇప్పటివరకూ ఏ తెలుగు హీరోకూ దక్కని గౌరవం నాకు దక్కింది.
మీ పిల్లల్ని షూటింగ్‌కు తీసుకెళ్తుంటారా?
అల్లు అర్జున్: అప్పుడప్పుడు తీసుకెళ్తుంటాను. దానికో కారణం ఉంది. ఇదివరకు జనరేషన్ వాళ్లు పిల్లల్ని షూటింగ్‌కు తీసుకెళ్తే పాడైపోతారనే ఆలోచనతో ఉండేవాళ్లు. పిల్లలకు సినిమాలు కూడా చూపించేవాళ్లు కాదు. వాస్తవానికి దూరంగా పెట్టేవాళ్లు. నాన్న ఏం చేస్తుంటాడనే విషయం నా పిల్లలకు తెలియాలి. నా లైఫ్ ఎలా ఉంటుందో తెలియాలి. అందుకే వాళ్లను తీసుకెళ్తుంటాను.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Prithvi Shaw: భారత ఓపెనర్‌గా పృథ్వీ షాకు అవకాశాలు ఇవ్వాలి: ఇర్ఫాన్ పఠాన్
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (04/02/2023)
-
India News
Layoffs: దిగ్గజ కంపెనీలు తొలగిస్తుంటే.. కార్లను బహుమతిగా ఇచ్చిన ఐటీ కంపెనీ..!
-
Sports News
Virat: విరాట్ కొట్టిన ఆ ‘స్ట్రెయిట్ సిక్స్’.. షహీన్ బౌలింగ్‌లో అనుకున్నా: పాక్ మాజీ పేసర్
-
Crime News
Crime news: అనుమానంతో భార్యను చంపి.. సమాధిపై మొక్కల పెంపకం!
-
Politics News
Rahul letter to modi : మోదీజీ.. కశ్మీరీ పండిట్లపై కనికరం చూపండి: రాహుల్