సిత్తరాల సిరపడు పాట వెనుక కథ ఇది..!
‘సిత్తరాల సిరపడు..’.. ‘అల వైకుంఠపురములో..’ మారుమోగుతున్న జానపద గేయం ఇది. పతాక సన్నివేశాలకు ప్రాణం పోసి సినిమాకు ఆర్థిక బలాన్ని చేకూర్చింది ఈ పాట. అయితే ఈ పాట ఎవరు రాశారు?, ఎక్కడి నుంచి పుట్టింది?.. అనే ప్రశ్నలు సినిమా విడుదలైనప్పటి నుంచి సగటు....
ఆరోజు నన్ను స్టేజ్ మీదకు ఎందుకు పిలవలేదో అప్పుడు తెలిసింది: సిత్తరాల పాట రచయిత
హైదరాబాద్: ‘సిత్తరాల సిరపడు..’.. ‘అల వైకుంఠపురములో..’ మారుమోగుతున్న జానపద గేయం ఇది. పతాక సన్నివేశాలకు ప్రాణం పోసి సినిమాకు అదనపు బలాన్ని చేకూర్చిందీ పాట. అయితే ఈ పాట ఎవరు రాశారు?, ఎక్కడి నుంచి పుట్టింది?.. అనే ప్రశ్నలు సినిమా విడుదలైనప్పటి నుంచి సగటు ప్రేక్షకుడిలో రేకెత్తాయి. దర్శకుడు త్రివిక్రమ్ ఈ పాటను ఎందుకు దాచిపెట్టారని కూడా అందరూ అనుకున్నారు. ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను ఈనాడుతో పంచుకున్నారు ‘సిత్తరాల..’ పాట రాసిన ఎల్ఐసీ సీనియర్ ఉద్యోగి బల్లా విజయకుమార్. ఆయన చెప్పిన ముచ్చట్లు చూద్దాం..
విజయకుమార్ మీ నేపథ్యం ఏంటి?
మాది ఒడిశాలోని జయపూర్. ఉద్యోగ రీత్యా నాగావళి నుంచి వంశధార వరకు తిరిగా. ప్రస్తుతం మచిలీపట్నం ఎల్ఐసీ డివిజన్ కార్యాలయంలో మేనేజర్‌గా పనిచేస్తున్నాను. నాకు గజల్స్, జానపద గేయాలంటే చాలా ఇష్టం. ఎల్ఐసీ నన్ను ఊరూరా తిప్పి అక్కడి జనపదాలను పరిచయం చేసింది. శ్రీకాకుళం, రాజాం, విజయనగరం, విజయవాడ, గాజువాక, వరంగల్‌లో పనిచేశాను.
ఈ పాట రాసే అవకాశం ఎలా వచ్చింది?
నాకు జానపద గేయాలంటే చాలా ఇష్టం. చిన్న చిన్న గజల్స్ రాయడం అంటే ఇష్టం. ఎవరికైనా ఏదైనా అవసరం వస్తే రాసిస్తుంటాను. ఈ క్రమంలో సిరివెన్నెల సీతారామశాస్త్రిగారి సోదరుడు సీవీఆర్ శాస్త్రిగారితో మంచి అనుబంధం ఏర్పడింది. హుద్ హుద్ తుపాను సమయంలో నేను రాసిన సంకల్ప్ గీతం ఆయనకు బాగా నచ్చింది. ‘అల వైకుంఠపురములో..’ కోసం శ్రీకాకుళం యాసలో జానపద గేయం కావాలని దర్శకుడు త్రివిక్రమ్ అడిగారు. సీవీఆర్ శాస్త్రిగారు నా గురించి త్రివిక్రమ్ గారికి చెప్పారు. శ్రీకాకుళంలో బాగా ప్రజాదరణ పొందిన జానపద గేయాలు అన్వేషించమని కోరారు. రేలరేల జానకిరావుతోపాటు చాలా మందికి ఈ విషయాన్ని చెప్పా. వారు సరైన గీతం ఇవ్వలేకపోయారు. ‘దువ్వందొర’ అనే పాట ఒకటి దొరికింది, అది సరిపోతుందని చెప్పా. కానీ సందర్భోచితంగా లేదన్నారు. ఆపై నేనే ఒక పల్లవి, ఎనిమిది చరణాలు రాసిచ్చా.
మీ పాట ఎలా ఫైనల్ అయ్యింది?
నేను రాసిన పాట త్రివిక్రమ్ గారికి బాగా నచ్చిందట. ఆ తర్వాత వారం రోజులకే త్రివిక్రమ్ గారిని కలిశాను. ఓ రోజు ఉన్నట్లుండి ఫోన్ చేసి మీ పాట రికార్డు, షూటింగ్ అయిపోయిందన్నారు. ఏదో సరదాగా రాశాం కదా.. నచ్చుతుందో లేదో అనుకున్నా. ఆ తర్వాత త్రివిక్రమ్ గారు నాతో మాట్లాడుతూ.. వాళ్ల ఇంటికి ఆహ్వానించారు. ఇంటికి వెళ్లిన తర్వాత ఆ పాట నాకు వినిపించారు, ఆశ్చర్యపోయాను. పదాలన్నీ పాటల రూపంలో వస్తుంటే సంతోషమనిపించింది. 35 ఏళ్ల కిందట సినిమాకు పాట రాయాలని కలలు కన్నా. ఇన్నాళ్లకు ఆ కలను త్రివిక్రమ్ గారు నిజం చేశారు.
ఈ పాటను ఎలా రాశారు?
నాకు ముందు ఒక సన్నివేశం చెప్పారు. దాని గురించి రాశాను. మళ్లీ వాళ్లు మార్చుకున్నారు. నేను కూడా మొత్తం మార్చి రాశా. పల్లవి బాగుంది, కానీ హీరో సెంట్రిగ్గా రాయండని అడిగారు. హీరో సెంట్రిగ్గా ఎలా ఉండాలని అడిగాను. కాలిపోతున్న ఇళ్ల దగ్గర పిల్లలను రక్షించడం, పడవ మునిగిపోతుంటే రక్షించడం ఇలా సాహసకృత్యాలకు సంబంధించి చూడండి అన్నారు. ముందు హేళనగా రాసిన పదాలను తర్వాత హీరో సెంట్రిగ్గా మార్చి రాశా. ‘సోగ్గాడే చిన్నినాయనా’ తరహాలో రాశాను. ఆ తర్వాత పల్లవి అలాగే ఉంచి, మిగిలినది మళ్లీ మార్చాం. ‘బొగతోడు ఆంబోతు రంకేసి కుమ్మబోతే... కొమ్ములూడదీసి మరీ పీపలూదినాడురా..’ అని రాశా. తొలుత శ్రీకాకుళం పదాలు ఉండాలనే ఉద్దేశంతో... పీపలు, బొగతోడు లాంటి పదాలు వాడా.
సిత్తరాల సిరపడు అంటే..?
సిరపడు అనే పదాన్ని శ్రీకాకుళం ప్రాంతంలో పెంకితనం, అల్లరి పిల్లలను ఉద్దేశించి ఎక్కువగా వాడుతుంటారు. కరణాల భాష వేరుగా ఉంటుంది. ఒడిశాతో సంబంధం ఉండేవిధంగా వాళ్లకు కోడ్స్ ఉంటాయి. అలాగే విశ్వబ్రహ్మణులను కూడా కోడ్స్ ఉంటాయి. సిరపడు అనే పదాన్ని వాళ్లు కూడా వాడుతుంటారు. కస్టమర్లను గుర్తుపెట్టుకోడానికి వాళ్లు ఆ పదాన్ని విరివిగా వాడుతుంటారు. అది వాళ్ల వ్యాపార సూత్రం. సిరపడు అంటే.. ‘పెద్దగా బలం లేదు.. అయినా చురుకైన వ్యక్తిగా ఉండేందుకు ప్రయత్నిస్తుంటాడు. మంతనాలు, పెత్తనాలు చేస్తుంటాడు..’ అని అర్థం.
మీరు సినిమాకు రాయడం ఇదే తొలిసారి కదా..?
అవును.. ఈ పాటను కూడా సీరియస్‌గా రాయలేదు. వాళ్లు ఏదో సందర్భం చెప్పారు. ఆ సందర్భానికి అనుగుణంగా పాట రాసిచ్చా. అయితే ఎక్కడా ఇంగ్లిషు పదాల ప్రభావం లేకుండా జాగ్రత్తపడుతూ వచ్చా. శ్రీకాకుళం జిల్లాలో వాడుతున్న కొన్ని పదాలు మరెక్కడా వాడుకలో ఉండవు. ప్రతి మాండలికంలో అంతే అనుకోండి. నేను రాసిన ప్రతి పదానికి మరో ఆప్షన్ ఇచ్చా. ఉదాహారణకు.. ‘ఉద్దండుడు’ అనే పదం ఉంది. దాన్ని ‘ఉడుంపట్టు’ అని కూడా వాడుకోవచ్చు. అయితే విడుదల చేసిన పాటలో ‘ఉడుంపట్టు’ అని ఉంది. ఇలా ఆప్షన్ ఇవ్వడం వల్ల నన్ను వాళ్లు తిరిగి అడగలేదు. ప్రత్యామ్నాయ పదాలు చూసుకొని వాడుకున్నారు.
మీ పాటను తెరపై చూసినప్పుడు ఎలాంటి అనుభూతి కలిగింది?
నా పాట తెరపై చూసినప్పుడు పెద్దబాల శిక్ష నాటిక, ఓ వీధి నాటకం చూసినట్టు అనిపించింది. 40 ఏళ్ల కిందటి నాటిక అది. ఒక వీధి నాటకం చూసిన అనుభూతి కలిగించింది. వీధి నాటకం చూసినప్పుడు డైలాగ్స్ కన్నా.. భంగిమలకు ప్రేక్షకులు ఎక్కువగా కనెక్ట్ అవుతాయి. ఎంత దూరంలో ఉన్నా కూడా ఆ నాటకాన్ని అర్థం చేసుకుంటారు. ఫైట్ మాస్టర్లు రామలక్ష్మణ్ బాగా కంపోజ్ చేశారు. ఈ రోజు నా పాట తెరపై నాటకం ఆడింది. భలే సరదా అనిపించింది.
సినిమా విడుదలయ్యే వరకూ పాటను బయటపెట్టలేదు.. మీరు ఆ సమయంలో ఎలా ఫీల్ అయ్యారు?
సినిమా పూర్తైంది, విడుదలకు సిద్ధమవుతోంది. కానీ నా పాట ఎక్కడా వినిపించడం లేదు. సీవీఆర్ శాస్త్రిగారు నా పాట ఉందని గట్టిగా చెబుతున్నారు. అయినా పెద్దగా ఫీలవ్వలేదు. ఇది నా వృత్తి కాదు కదా. ఏదో సరదాగా రాసిందేగా అనుకున్నా. ఏదో ఒక జ్ఞాపకంగా ఉంటుందని రాశా. సినిమా వాళ్లను అస్సలు నమ్మలేం అంటుంటారు కదా.. అనే ఆలోచన కూడా వచ్చింది. కానీ చివరికి చాలా పాజిటివ్‌గా తీసుకున్నా. మ్యూజికల్ నైట్ కోసం హైదరాబాద్ వచ్చా. అక్కడ నన్ను స్టేజ్ మీదకు పిలవలేదు. అయినా కూడా ఏం ఫీలవలేదు. వాళ్ల ఇబ్బందులు వాళ్లకుంటాయనుకున్నా. రూ.కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీశారు. మనమేదో చిన్న ఏమోషన్ గురించి వాళ్లను ఇబ్బంది పెట్టకూడదని ఊరుకున్నా. త్రివిక్రమ్ గారు చాలా గొప్ప వ్యక్తి. పాట తీసేంత పని చేయరని నా నమ్మకం.
ఆ తర్వాత ఆయన ఫోన్ చేసి కాఫీకి రమ్మని పిలవగానే నమ్మలేకపోయా. రాత్రి 8 గంటల నుంచి 10.30 గంటల వరకు నాతో మాట్లాడారు. నేను రాసిన పాటలు, గజల్స్ విన్నారు. వాటిలో రెండు ఆయనకు బాగా నచ్చాయి. అసలు విషయాన్ని చెప్పడంతో అసలు సంగతి ఇదా అని ఊరుకున్నా. అయితే సినిమా అయినంత వరకు నిశ్శబ్దంగా ఉండే త్రివిక్రమ్ గారు... ఒక్కసారి ఈ పాట గురించే చెప్పడం మొదలుపెట్టారు. ‘సిత్తరాల’ పాట దాచిపెట్టడం గురించి వివరించారు. అస్సలు భేషాజాలు లేకుండా నాకు థ్యాంక్స్ చెప్పడం మరిచిపోలేని విషయం. వాస్తవానికి నన్ను పరిచయం చేసినందుకు నేను థ్యాంక్స్ చెప్పాలి.
జానపద సాహిత్యం గురించి ఏదైనా చెప్పాలి అనుకుంటున్నారా?
శ్రోతల ఆదరణకు నోచుకోకపోవడం వల్ల జానపద వాంగ్మయం చాలా వరకు దెబ్బతింటోంది. జానపద సాహిత్యాన్ని ఆదరించాల్సిన అవసరం లేదనే అభిప్రాయంలో జనాలు ఉన్నారు. త్రివిక్రమ్ లాంటి దర్శకులు ఇలాంటి పాటల్ని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లడం చాలా అవసరం. సామెతలు, నానుడి తెలుసుకోవడంతోపాటు జానపద సాహిత్యం తయారవ్వాలి. వంగపండు ప్రసాదరావు ఉత్తరాంధ్రకు తన పాటలతో ఎంతో మేలు చేశారు. ఒక నిబద్ధత కలిగిన వ్యక్తి. ఆయన పాటలంటే నాకు చాలా ఇష్టం. సినిమాల్లో సందర్భోచితంగా వాటికి ప్రాధాన్యత ఇస్తే జనాదరణ పొందుతాయి. జానపద పదాల అర్థాలు వ్యాప్తి చెందాలి. అలా అయితేనే వాటి గురించి నలుగురికి చెప్పగలుగుతారు.
మీ తోటి వారు ప్రోత్సహించారా?
నా స్నేహితులు, తోటి ఉద్యోగులు, సీవీఆర్ శాస్త్రిలాంటి వాళ్లు నన్ను చాలాసార్లు సినిమా పాటలు ఎందుకు రాయవని అడిగారు. కానీ నా పాటలు సినిమాలకు పనికొస్తాయో? లేదో? అనే సందేహంతో ఉండేవాడిని. ఉద్యోగం చేసుకుంటూ నా పాటలు నేను పాడుకునేవాడిని. కానీ ఇప్పుడు నాకున్న పరిమిత జ్ఞానం, పదాలతో నేను ఇలాంటి మరిన్ని పాటలు రాయడానికి సిద్ధంగా ఉన్నా.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చిరంజీవితో ఆ పాటకు డ్యాన్స్ వేయడం కష్టంగా అనిపించింది: రాధ
నటి రాధ ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆమె కెరీర్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. -
Prithviraj Sukumaran: అందుకు మలయాళ ఇండస్ట్రీ నాపై అసూయ పడిందేమో: పృథ్వీరాజ్ సుకుమారన్
తన కొత్త సినిమా ‘ఆడుజీవితం’ ప్రచారంలో భాగంగా హైదరాబాద్‌కు వచ్చారు మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమార్. ఆ చిత్రం గురించి పలు విశేషాలు పంచుకున్నారు. -
alitho saradaga: డబ్బులు అడుగుతానేమోనని కొందరు తప్పించుకు తిరిగేవాళ్లు: పుల్లెల గోపీచంద్
ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఆలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చారు. చాముండేశ్వర నాథ్‌తో కలిసి ఆయన చెప్పిన సంగతులేంటంటే.. -
Anupama Parameswaran: అందుకు బోర్ ఫీలయ్యా.. గ్లామర్ డోస్‌పై స్పందించిన అనుపమ
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ జంటగా నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. ఈ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్లో హైదరాబాద్‌లో జరిగింది. -
Priyadarshi: స్వచ్ఛమైన హాస్యంతో సినిమా ఓ పెద్ద సవాల్
‘‘కథానాయకుడు అనగానే ఒక ప్రత్యేకమైన ఇమేజ్‌కి పరిమితం చేసినట్టు ఉంటుంది. స్వేచ్ఛగా ఉండలేను. నన్ను నేను ఓ నటుడిగా చూసుకోవడానికే ఇష్టపడతా’’ అన్నారు ప్రియదర్శి. -
Sivaji: ఆలీ అన్నా.. దయచేసి ఎన్నికల్లో పోటీ చేయొద్దు: శివాజీ
ఇప్పటి రోజుల్లో రాజకీయాలు వ్యాపారంగా మారాయన్నారు నటుడు శివాజీ. డబ్బులు ఖర్చుపెట్టడంతోపాటు వివిధ మార్గాల్లో ఆ మొత్తాన్ని తిరిగి లాక్కొనేవారికే పాలిటిక్స్ సెట్ అవుతాయన్నారు. -
Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్.. ఆ ఉద్దేశంతో పెట్టలేదు : అల్లరి నరేశ్
నరేశ్ హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో నరేశ్ పాల్గొని సందడి చేశారు. -
Raghu Karumanchi: స్టాక్‌మార్కెట్.. రూ.కోట్లలో నష్టపోయా: రఘు
ఈటీవీలో ప్రసారమవుతోన్న సెలబ్రిటీ టాక్ షో ‘చెప్పాలని ఉంది’ (Cheppalani Vundi). బాలాదిత్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఈ కార్యక్రమంలో తాజాగా టాలీవుడ్ హాస్యనటుడు రఘు కారుమంచి (Raghu Karumanchi) పాల్గొన్నారు. తన కెరీర్ విశేషాలు పంచుకున్నారు. -
Akash Puri: అప్పటి వరకు నాన్న దర్శకత్వంలో నటించను: ఆకాశ్ పూరి
తన తండ్రి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రస్తుతానికి నటించాలనుకోవడంలేదని నటుడు ఆకాశ్ తెలిపారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. -
Suhaas: రూ.3 కోట్ల రెమ్యూనరేషన్.. సుహాస్ ఏమన్నారంటే!
తాజాగా ‘ప్రసన్నవదనం’ టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఇందులో సుహాస్ తన రెమ్యూనరేషన్పై స్పందించారు. -
Gopichand: ఆ పిల్లల చదువుకు సాయం చేస్తున్నా.. చెప్పకపోవడానికి కారణమదే: గోపీచంద్
ప్రముఖ హాస్యనటుడు ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీ వేదికపై విశేష ఆదరణ సొంతం చేసుకున్న సెలబ్రిటీ టాక్ షో ‘ఆలీతో సరదాగా’ (Alitho Saradaga). ఈ షో సెకండ్ సీజన్ తాజాగా మొదలైంది. తొలి ఎపిసోడ్‌కు గోపీచంద్ (Gopichand) అతిథిగా విచ్చేశారు. -
Gopichand: భీమా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయే పాత్ర: గోపీచంద్
భీమా ప్రమోషన్స్‌లో భాగంగా హీరో గోపీచంద్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. -
మూఢ నమ్మకాలు లేని దెయ్యం సినిమా ‘వళరి’
‘హారర్ సినిమాల సంఖ్య తగ్గుతున్న సమయంలో.. ఆ లోటును ‘వళరి’ చిత్రం తీర్చేయడానికి త్వరలో రాబోతుంది’ అంటున్నారు దర్శకురాలు మ్రితికా సంతోషిణి. దర్శకురాలిగా ఆమె రూపొందించిన తొలి చిత్రమిది. రితికా సింగ్, శ్రీరామ్ ప్రధాన పాత్రల్లో నటించారు. -
Varun Tej: కల్యాణ్ బాబాయ్ ఇలా చెప్పడం అరుదు: వరుణ్ తేజ్
తన కొత్త సినిమా ‘ఆపరేషన్ వాలెంటైన్’ మార్చి 1న విడుదల కానున్న సందర్భంగా విలేకరులతో ముచ్చటించారు హీరో వరుణ్ తేజ్. -
Sundeep Kishan: అలా చేసుంటే మీ సినిమా బ్లాక్‌బస్టర్ అయ్యేది: సందీప్ కిషన్‌తో అభిమాని
తన అభిమానులతో సోషల్ మీడియా వేదికగా ముచ్చటించారు హీరో సందీప్ కిషన్. -
Janhvi Kapoor: నాన్న ఆ విషయం నాకూ చెప్పలేదు: జాన్వీ కపూర్
బాలీవుడ్ నటి జాన్వీకపూర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ‘దేవర’ సినిమా విశేషాలతో పాటు మరికొన్ని సంగతులు పంచుకున్నారు. -
Varun Tej: ఆ సీక్వెల్లో నేనెందుకు నటిస్తా?.. చరణ్ చేస్తాడు: వరుణ్ తేజ్
వరుణ్ తేజ్ తాజా చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ఆయన పాల్గొని సందడి చేశారు. -
Miss World 2024 Pageant: నాపై ఒత్తిడేమీ లేదు.. మిస్ వరల్డ్ -2024 పోటీదారు సినిశెట్టి.. ఆసక్తికర కబుర్లు
Miss World 2024: ఫిబ్రవరి 18 నుంచి భారత్ వేదికగా మిస్ వరల్డ్ 2024 పోటీలు జరగనున్న నేపథ్యంలో భారత్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సినిశెట్టి పంచుకున్న విషయాలు.. -
Prudhvi Raj: ఆ కష్ట సమయంలో నన్ను ఆదుకుంది ఇండస్ట్రీనే: పృథ్వీరాజ్
హాస్యనటుడు బలిరెడ్డి పృథ్వీరాజ్ ‘చెప్పాలని ఉంది’ కార్యక్రమానికి హాజరయ్యారు. తన సినీ, రాజకీయ అనుభవాలను పంచుకున్నారు. -
Ravi Teja: ఆ విషయం ముందే చెప్పడం నాకు ఇష్టంలేదు: వరుణ్‌తేజ్‌తో రవితేజ
రవితేజ, వరుణ్ తేజ్.. తమ కొత్త చిత్రాల విశేషాలను ఒకరికొకరు పంచుకున్నారు. అవేంటో చూసేయండి.. -
Venu: అలా అనుకొనే వారికి సమాధానమే ‘బలగం’..: వేణు యెల్దండి
హాస్యనటుడు, దర్శకుడు వేణు యెల్దండి ‘చెప్పాలని ఉంది’ కార్యక్రమానికి హాజరయ్యారు. తన సినీ జీవితం, అనుభవాలను పంచుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల ముంగిట.. అవినీతి కేసులో ప్రఫుల్ పటేల్‌కు క్లీన్ చిట్
-
భవిష్యత్ తరాల కోసం తెదేపాకు ఓటు వేయాలి: భువనేశ్వరి
-
పూజాహెగ్డే ‘స్పై’ ఫొటో.. ప్రగ్యా ‘పోజు’ రిపీట్.. మెహందీతో కావ్య!
-
ఇతరులను బెదిరించడం కాంగ్రెస్ సంస్కృతి.. ‘లాయర్ల లేఖ’పై ప్రధాని మోదీ
-
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
-
భుజంగరావు, తిరుపతన్నకు 5 రోజుల పోలీసు కస్టడీ