‘సూప‌..ర్‌ బ్లాక్‌బస్టర్‌’

సంక్రాంతి కానుకగా విడుదలైన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా బాక్సాఫీస్‌ భారీ వసూళ్లతో దూసుకెళ్తుంది. సూపర్‌స్టార్‌ మహేశ్‌ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. విడుదలైన నాటి నుంచి ఈ సినిమాపై పలువురు సినీ ప్రముఖులు, సినీ ప్రియులు ప్రశంసల...

Updated : 24 Jan 2020 21:06 IST

అనిల్‌ రావిపూడితో దర్శకేంద్రుడి సరదా ముచ్చట్లు

హైదరాబాద్‌: సంక్రాంతి కానుకగా విడుదలైన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా బాక్సాఫీస్‌ భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది. సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. విడుదలైన నాటి నుంచి ఈ సినిమాపై పలువురు సినీ ప్రముఖులు, సినీ ప్రియులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు, అనిల్‌ రావిపూడి ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాకు సంబంధించిన ఎన్నో విశేషాలను గురించి సరదాగా ముచ్చటించుకున్నారు. ఆ విశేషాలు మీకోసం..

మీరు కథానాయకుడిగా వెండితెరకు పరిచయం చేసిన మహేశ్‌బాబు నేడు సూపర్‌స్టార్‌గా ఎదిగారు ఆయన్ని చూసి మీరు ఎలా ఫీల్‌ అవుతున్నారు? 

రాఘవేంద్రరావు: కంగ్రాట్స్‌ అనిల్‌. మహేశ్‌ను చూసి కృష్ణ ఎంత సంతోషంగా ఫీల్‌ అవుతున్నారో అంతకంటే ఎక్కువగా నేను ఫీల్‌ అవుతున్నా. చిన్నప్పటి నుంచి మా పిల్లల బర్త్‌డేలకు మహేశ్‌  మా ఇంటికి వస్తుండేవాడు. నన్ను మామయ్య అని ఆప్యాయంగా పిలిచేవాడు. మా కుటుంబాల మధ్య అంతటి గొప్ప అనుబంధం ఉంది. ఇప్పుడు మహేశ్‌ సక్సెస్‌ చూస్తుంటే గర్వంగా ఉంది. అనిల్‌ విషయంలో కూడా చాలా సంతోషంగా ఉన్నా. మేమిద్దరం మా సినిమాల గురించి అభిప్రాయాలను షేర్‌ చేసుకుంటుంటాం. 

‘సరిలేరు నీకెవ్వరు’పై మీ కామెంట్‌ ఏమిటి సార్‌?

రాఘవేంద్రరావు: సూప...........ర్‌ (ఎన్ని Rలు ఉంటే అన్నీ) బ్లాక్‌బస్టర్‌.

రాఘవేంద్రరావు: విజయశాంతి నటన చాలా బాగుంది. ఆ క్యారెక్టర్‌కు విజయశాంతిని పెట్టి మంచి పనిచేశావు అనిల్‌. లేడీ అమితాబ్‌బచ్చన్‌ అనే పేరు ఉన్న విజయశాంతి రీఎంట్రీ అనేసరికి ప్రేక్షకుల్లో చాలా ఆసక్తి పెరిగింది. సినిమా చివర్లో విజయశాంతిపై చిత్రీకరించిన సన్నివేశాలు చాలా అద్భుతంగా ఉన్నాయి.

ప్ర: సరిలేరు నీకెవ్వరు టైటిల్‌ పై మీ అభిప్రాయం?
రాఘవేంద్రరావు: ‘భరత్‌ అనే నేను’, ‘శ్రీమంతుడు’ లాంటి టైటిల్‌ కూడా పెట్టొచ్చు. కానీ, మహష్‌ బాబుని, విజయశాంతిని, ఆడియన్స్‌ని ‘సరిలేరు మీకెవ్వరు’ అని నిరూపించడానికి అనిల్‌ ఈ టైటిల్‌ పెట్టాడని నా అభిప్రాయం.

సినిమాల ఎంపికపై మీరిచ్చే సలహా?
రాఘవేంద్రరావు: నేను ‘దూకుడు’ అప్పుడు కూడా మహేష్‌ బాబుతో చెప్పా. ‘మహేష్‌ ఒక సబ్జెక్ట్‌ టచ్‌ చేస్తే పుల్‌ ఎంటరటైన్‌మెంట్‌, మేసేజ్‌ ఏదైనా చెయ్’ అని. ఎందుకంటే పాపులర్‌ హీరోలు చెబితే చాలా మంది చూస్తారు. వేరే వారైతే చూడరు. ఇమేజ్‌ అనే విషయం ఎవరేం చెప్పినా నమ్మొద్దు. 

ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్‌ని ఎలా క్రియేట్‌ చేశారు?
అనిల్‌ రావిపూడి: అంటే.. నేనొక సినిమా అనుకున్నప్పుడు ఆ జోనర్‌లో బ్లాక్‌బస్టర్‌ అయిన సినిమాలు ఏవైనా ఉన్నాయా అని చూస్తాను. ఫస్ట్‌ నేను ఆ హోం వర్క్‌ చేస్తాను. దాని ఇంపాక్ట్‌ పడకుండా కొత్తగా ఏం చెప్పాలని ఆలోచిస్తాను. మేజర్‌ చంద్రకాంత్‌ సినిమాలో ‘పుణ్యభూమి నా దేశం’ అనే సాంగ్‌లో రాఘవేంద్రరావుగారు చెప్పాలనుకున్నది ఏంటంటే.. రామారావుగారి ద్వారా ఒక అల్లూరి సీతారామరాజు, ఒక సుభాష్‌ చంద్ర బోష్‌, ఒక ఛత్రపతి శివాజీని చూపించాలనుకున్నారు. దానికి ఆయన ఒక ఫొటోని పెట్టుకొని ఒక సాంగ్‌ నుంచి స్వాతంత్ర్య సమరయోధుల్ని అలా కనెక్ట్‌ చేశారు. దాన్ని నేను ఆదర్శంగా తీసుకొని ఇక్కడ ఒక అల్లూరి సీతారామరాజుని తీసుకొచ్చాను.

అనిల్‌ రావిపూడి హీరోయిన్స్‌ని ఎంత వరకు బాగా చూపిస్తున్నారని మీరు అనుకుంటున్నారు? 
రాఘవేంద్రరావు: అనిల్‌ సామాన్యుడు కాదు అసలు. ఆ అమ్మాయిని ఎంత స్టడీ చేశాడో నాకు తెలీదు గానీ, అమ్మాయి కళ్లు పట్టుకున్నాడు అనుకుంటున్నా నేను. ఇందులో నాకు బాగా నచ్చిన షాట్‌ ఏంటంటే.. దేవుడ్ని ఒక మంచి అబ్బాయి కావాలని అడిగి.. ‘మీకు అర్థం అవుతోందా’ అని రష్మిక మహేష్‌ని చూస్తూ వెనుకకు పరుగెత్తడం. ఆ ఒక్క షాట్‌ ఆడియన్స్‌ని లాగేసింది. 

అనిల్‌ సినిమాలో కామెడీని కాకుండా సీరియస్‌ని ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకున్నారు?
రాఘవేంద్రరావు: ఆడియన్స్‌ ఆశించిన దానికన్నా ఇంకా ఎక్కువ ఉండబట్టి ఈ చిత్రం ఇంత పెద్ద హిట్‌ అయింది. మహేష్‌తో సినిమాని ఎంటర్‌టైనర్‌గా తీస్తాడని మెంటల్‌గా ఫిక్స్‌ అయ్యారు. ఎందుకంటే అనిల్‌ సినిమాలు అలా ఉన్నాయి. కేవలం కామెడీ మాత్రమే ఉంటే ఇది సక్సెస్‌ మూవీ మాత్రమే అయ్యేది. బ్లాక్‌ బస్టర్‌కా బాప్‌ అవ్వాలంటే అన్ని ఎలిమెంట్సూ ఇందులో ఉండాలి. ఇక్కడే దర్శకుడి తెలివితేటలు కనిపించాయి.

రాఘవేంద్రరావు-అనిల్‌ రావిపూడి మధ్య జరిగిన ముచ్చట్లను ఈ కింది వీడియోలో చూడండి!

 

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు