పెళ్లి తర్వాత పోస్ట్‌.. ఘోరంగా తిట్టారు: సమంత

పెళ్లి తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన ఫొటో చూసి నెటిజన్లు తనను ఘోరంగా తిట్టారని అగ్ర కథానాయిక సమంత గుర్తు చేసుకున్నారు. 2019 ‘హైదరాబాద్‌ టైమ్స్‌ మోస్ట్‌ డిజైరబుల్‌ ఉమన్‌’ జాబితాలో......

Published : 18 Mar 2020 17:39 IST

ఇక కెరీర్‌ లేదనుకొన్నా..

హైదరాబాద్‌: పెళ్లి తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన ఫొటో చూసి నెటిజన్లు తనను ఘోరంగా తిట్టారని అగ్ర కథానాయిక సమంత గుర్తు చేసుకున్నారు. 2019 ‘హైదరాబాద్‌ టైమ్స్‌ మోస్ట్‌ డిజైరబుల్‌ ఉమన్‌’ జాబితాలో సమంత అగ్ర స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. ఆన్‌లైన్‌ పోలింగ్‌ ద్వారా ప్రజలు ఆమెను ఎన్నుకున్నారు. ఈ నేపథ్యంలో సమంత ఓ ఆంగ్లపత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు. తన పేరు మొదటి స్థానంలో ఉండటం చూసి ఆశ్చర్యపోయానని చెప్పారు.

‘‘నా పేరు టాప్‌లో ఉండటం చూసి షాక్‌ అయ్యా (నవ్వుతూ). కానీ గొప్పగా అనిపించింది. ఓ పెళ్లైన మహిళకు ఈ టైటిల్‌ రావడం మంచి పరిణామం. సమాజంలోని మార్పును ఇది సూచిస్తోంది. పెళ్లైన నటి అని తేడా చూపించకుండా ప్రతిభను గుర్తించారు. ఈ విషయం చైతన్యకు చెప్పినప్పుడు ‘ఏంటి?’ అని ఆశ్చర్యపోయాడు. కొన్ని నిమిషాలకు ‘నిజంగా?.. నీకు పెళ్లైంది కదా!’ అన్నాడు.’’

‘‘పెళ్లి జరిగిన తర్వాత కెరీర్‌పై ఆశలు పోయాయి. ఎందుకంటే నా ముందు హీరోయిన్స్‌ పరిస్థితి అలానే ఉంది. వాళ్లంతా పెళ్లి బ్రేక్‌ తర్వాత మళ్లీ కనిపించలేదు. నాకూ అలానే జరుగుతుంది అనుకున్నా. పెళ్లి ప్రభావం నా కెరీర్‌పై పడకపోవడం సంతోషంగా ఉంది. కుటుంబం కూడా ఎంతో మద్దతుగా ఉంది. పెళ్లి నా ఫ్యాషన్‌ ఛాయిస్‌ను మార్చలేదు.’’

‘‘నాకింకా గుర్తుంది. పెళ్లి తర్వాత ఓ గ్లామరస్‌ డ్రెస్‌తో ఉన్న ఫొటో పోస్ట్ చేశా. కొందరు ఘోరంగా విమర్శించారు. చాలా కష్టంగా అనిపించింది. అలానే రెండోసారి కూడా ఫొటో షేర్‌ చేశా. అప్పుడు విమర్శలు తగ్గాయి. ఏదైనా సరే.. మొదటి అడుగు వేయడం వరకే అని అప్పుడు అర్థమైంది. నేను ధైర్యంగా ముందుకొచ్చానని చెప్పడం లేదు. నాకు విమర్శలన్నా, అలాంటి వాతావరణం అన్నా చాలా భయం. పరిస్థితులు మారాలి. దానికి తగినట్లు నేను ప్రవర్తించాలని అనుకుంటుంటా. మనం ధరించే దుస్తులు మన వ్యక్తిత్వాన్ని నిర్వచించవని ప్రజలు అర్థం చేసుకోవాలి.’’

‘‘ఇవాళ నా ఫీలింగ్‌ ఎలా ఉంటే అలాంటి దుస్తులు ధరిస్తా. ఉదాహరణకు పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్న రోజు కాస్త గ్లామరస్‌గా ఉండాలి అనుకుంటా. అది పక్కవారి కోసం కాదు. కేవలం నా సంతృప్తి కోసం మాత్రమే. మేకప్‌కు పనిచేయడానికి పది మందితో కూడిన బృందం ఉంది. ‘ఏం ధరించాలి? ఎలాంటి మేకప్‌ వేసుకోవాలి? కొత్త స్టైల్‌ ఏంటి? కొత్త లుక్‌ ఏంటి?’ అనే విషయాలు వారే చెబుతుంటారు.’’

‘‘కొంత మంది అమ్మాయిలు తాము కూడా స్టార్స్‌లా అందంగా ఉండాలి అనుకుంటుంటారు. కానీ నిజం చెప్పాలంటే మేకప్‌ విషయంలో అందరి కంటే మేమే ఎక్కువ అభద్రతాభావంతో ఉంటాం. మాకు ఇతరుల సాయం చాలా అవసరం. నేను సరైన డైట్‌ పాటిస్తూ, జిమ్‌కు వెళ్తుంటా. నాకు నా వృత్తంటే చాలా ఇష్టం. దాని కోసం వంద శాతం కష్టపడతా.. పడుతున్నా’’ అని సామ్‌ చెప్పారు.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని