Published : 29 Mar 2020 09:55 IST

అలాంటి అబ్బాయే కావాలి

‘ఏంది ముద్దు పెడితే ఏడుస్తారాబ్బా’ అంటూ ‘లవ్‌స్టోరి’లో సాయి పల్లవి చెప్పిన ఈ డైలాగ్‌ ప్రేక్షకుల్ని మరోసారి ఫిదా చేసింది. నాగచైతన్యతో కలిసి ప్రేమలో తడిసి ముద్దై మనందర్నీ అలరించబోతున్న ఈ అమ్మడి ఇష్టాయిష్టాలేంటంటే..


తీరిక దొరికితే

డాన్స్‌ చేస్తా. చిన్నప్పుడు మాధురీ దీక్షిత్‌, ఐశ్వర్యారాయ్‌లను చూసి డాన్స్‌పైన ఇష్టం కలిగింది.


ఇష్టంగా తినేది

పెప్పర్‌ చికెన్‌. అమ్మ ఎంతబాగా వండుతుందో. ఇంట్లో ఉంటే అదే చేయించుకుంటా.


ఫేవరెట్‌ హాలిడే స్పాట్‌

కోయంబత్తూరు... షూటింగ్‌ లేకపోతే అక్కడికే వెళ్లిపోతా. చిన్నప్పుడు అక్కడే చదువుకున్నా కదా ఆ వాతావరణానికి ఎంతగానో కనెక్ట్‌ అయ్యా.


ఇష్టమైన వ్యాపకం

సీతాకోక చిలుకల్ని పట్టి వదిలేయడం. ప్రేమమ్‌ షూట్‌లో నేర్చుకున్నా ఆ కళని.


కష్టపడింది

ఫిదా కోసం ట్రాక్టర్‌ నడపడం నేర్చుకున్నా. కానీ మాగాణిలో ట్రాక్టర్‌ నడపడం చాలా కష్టం. కొన్నిసార్లు స్టార్ట్‌ చేసినా ఆ బురదలో కదిలేది కాదు.


కాబోయేవాడు

‘ఫిదా’లో వరుణ్‌ లాంటి అబ్బాయి కనిపిస్తే వెంటనే ఐ లవ్‌ యూ చెప్పేస్తా.


నచ్చిన హీరో

సూర్య... కాలేజీ డేస్‌ నుంచే ఆయనకు వీరాభిమానిని. ఎన్జీకేలో సూర్యతో కలిసి నటించడం అదృష్టంగా భావిస్తా.


మీ గురించి తెలియంది

మాది తమిళనాడులోని బడుగ అనే గిరిజన తెగ. మా భాష బడుగకు లిపి లేదు.


ఏడ్చిన సందర్భం

న్జీకే సమయంలో చేసిన సీన్‌నే పదే పదే రీషూట్‌ చేస్తుండేవారు దర్శకుడు. దాంతో ఒకరోజు సినీ రంగాన్ని వదిలేస్తానని అమ్మకు చెప్పి ఏడ్చేశా. ఆ తరవాత దర్శకుడి పర్‌ఫెక్షన్‌ గురించి తెలిసి పాజిటివ్‌గా తీసుకున్నా.


సాహసం

హారర్‌ సినిమాలంటే భయపడే నేను మొదట ‘కణం’ ఒప్పుకోలేదు. అమ్మ చెప్పడంతో ఆరేళ్ల పాపకి తల్లిగా నటించే పాత్ర అయినా సాహసం చేసి ఓకే చెప్పా.


నటికాకపోయుంటే

ఎంబీబీఎస్‌ తరవాత కార్డియాలజీ ఎంచుకుని... హృద్రోగులకు చికిత్స చేస్తుండేదాన్ని.


ఫిదా అయింది...

ర్శకుడు సెల్వరాఘవన్‌ సెట్‌లోకి సెల్‌ఫోన్‌ అనుమతించరు. నటులు కెమెరా ముందుకు వెళ్లాక సమయం వృథా చేయనివ్వరు. ఎంతో క్రమశిక్షణతో సినిమా చిత్రీకరణ పూర్తిచేస్తారు. ఆయన నిబద్ధతకు నేను ఫిదా అయ్యా.


భయపడేది

హారర్‌ సినిమాలకు. అవంటే నాకు చచ్చేంత భయం. జార్జియాలో ఉన్నప్పుడు స్నేహితుల ఒత్తిడితో ‘ది కంజ్యూరింగ్‌’ చిత్రాన్ని సౌండ్‌ ఫ్రూఫ్‌తో, హనుమాన్‌ చాలీసా చదువుతూ చూశానంటే నమ్మండి.


బాగా చేసుకునే పండుగ

నమ్‌... నేను మలయాళీని కాకపోయినా ఆ పండుగ చేసుకుంటా. నాకిష్టమైన పూల రంగోలీలు వేయడంకోసమే చిన్నప్పట్నుంచీ ఓనమ్‌ జరుపుకుంటున్నా.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని