అనసూయ టాటూకి అర్థమేమిటంటే..!

అనసూయ.. బుల్లితెరలో ప్రసారమయ్యే పలు షోలకు వ్యాఖ్యాతగా వ్యవహరించి ఎందరో హృదయాలను కొల్లగొట్టి.. రంగమ్మత్తగా వెండితెరపై మెప్పించిన నటి. ఆమె అందం, అభినయానికి ఎందరో ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ప్రస్తుతం లాక్‌డౌన్‌ కారణంగా షూటింగ్స్‌ నిలిచిపోవడంతో...

Published : 04 Apr 2020 15:33 IST

తరుణ్‌ భాస్కర్‌తో పార్టీ.. అనసూయ కౌంటర్‌

హైదరాబాద్‌: అనసూయ.. బుల్లితెరలో ప్రసారమయ్యే పలు షోలకు వ్యాఖ్యాతగా వ్యవహరించి ఎందరో హృదయాలను కొల్లగొట్టి.. రంగమ్మత్తగా వెండితెరపై మెప్పించిన నటి. ఆమె అందం, అభినయానికి ఎందరో ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ప్రస్తుతం లాక్‌డౌన్‌ కారణంగా షూటింగ్స్‌ నిలిచిపోవడంతో ఇంటికే పరిమితమైన అనసూయ తాజాగా ఇన్‌స్టా వేదికగా అభిమానులతో కొంతసమయం సరదాగా ముచ్చటించారు. నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు ఆమె సరదాగా సమాధానం చెప్పారు.

ఇదిలా ఉండగా తన గురించి వచ్చిన ఓ రూమర్‌ గురించి నెటిజన్‌ ప్రశ్నించగా.. తనదైన శైలిలో ఆ వ్యక్తికి కౌంటర్‌ ఇచ్చారు. ‘తరుణ్‌ భాస్కర్‌తో కలిసి మద్యం సేవించి ఓ పార్టీలో రచ్చ చేశారట’ అని ఓ నెటిజన్‌ అనసూయను ప్రశ్నించాడు. ‘ఈ ‘అట’ అనేవి మీరు మీరు సరదాకి అనుకుంటే బాగుంటుందేమో.. కానీ నిజాలు వేరే ఉంటాయి. నువ్వు పరిణతి చెందితే నీకు అర్థమవుతుంది. నాకు తెలిసి నువ్వు ఇంకా పరిణతి చెందినట్లు లేవు’ అని ఆమె సదరు నెటిజన్‌కు కౌంటర్‌ ఇచ్చారు. అనసూయ-తరుణ్‌ భాస్కర్‌ కలిసి.. ‘మీకు మాత్రమే చెప్తా’ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. తరుణ్‌ భాస్కర్‌ కథానాయకుడిగా వెండితెరకు పరిచయమైన ఈ చిత్రంలో అనసూయ ఓ కీలకపాత్రను పోషించారు.

అనసూయను అడిగిన మిగిలిన ప్రశ్నలివి..

‘మీ చేతిపై ఉన్న టాటూకి అర్థం ఏమిటి’

అనసూయ:‘బ్యూటీ సోల్ డీప్‌ (నిశ్చలమైన మనసు కలిగిన అందమైన అమ్మాయి)’

‘మీకు అనసూయ అనే పేరు ఎందుకు పెట్టారు?’

అనసూయ: ‘అనసూయ మా నాయనమ్మ పేరు’ 

మీ స్వస్థలం ఏది..?

అనసూయ: నల్గొండ

మీకు ఇష్టమైన ప్రదేశం ఏది?

అనసూయ: మా ఇల్లు

మీకు ఇష్టమైన ఆహారం?

అనసూయ: ఇంటి భోజనం

పెళ్లి కాకముందు మీ ఇంటిపేరు ఏమిటి?

అనసూయ: ఖస్బా KHASBA

మీలో మీకు బాగా నచ్చే విషయం ఏమిటి?

అనసూయ: నాకు నేనంటే ఎంతో ఇష్టం

లాక్‌డౌన్‌ను ఫాలో అవుతున్నారా?

అనసూయ: కఠినంగా ఫాలో అవుతున్నా

షూటింగ్స్‌ మిస్‌ అవుతున్నారా?

అనసూయ: బాగా 

జబర్దస్త్‌లో కొత్త ఎపిసోడ్స్‌ ఉన్నాయా..?

అనసూయ: లేవు

మీరు ఇంత అందంగా ఉండడానికి కారణమేమిటి?

అనసూయ: నా కుటుంబం

మీరు యోగా చేస్తారా?

అనసూయ: చేస్తాను. వారంలో నాలుగుసార్లు

మీలో మీకు బాగా నచ్చే లక్షణం

అనసూయ: నేను చాలా ఎమోషనల్‌. అదే నా పవర్‌, అదే నా బలహీనత. అదే కొన్నిసార్లు నచ్చుతుంది. మరికొన్నిసార్లు నచ్చదు.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని