ప్రేమించిన అమ్మాయికి పెళ్లి.. ఏం చేయమంటారు..? 

తాను ప్రేమించిన అమ్మాయికి వేరే వ్యక్తితో పెళ్లి జరగనుందని.. తనని ఇప్పుడు ఏం చేయమంటారు అని ఓ నెటిజన్‌ పెట్టిన ట్వీట్‌కు సాయిధరమ్‌ తేజ్‌ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. సాయిధరమ్‌ తేజ్‌ కథానాయకుడిగా నటించిన ‘చిత్రలహరి’ సినిమా విడుదలై....

Updated : 14 Apr 2020 16:44 IST

నెటిజన్‌ ట్వీట్‌.. సాయిధరమ్‌ తేజ్‌ రిప్లై..!

హైదరాబాద్‌: తాను ప్రేమించిన అమ్మాయికి వేరే వ్యక్తితో పెళ్లి జరగనుందని.. తనని ఇప్పుడు ఏం చేయమంటారు అని ఓ నెటిజన్‌ పెట్టిన ట్వీట్‌కు సాయిధరమ్‌ తేజ్‌ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. సాయిధరమ్‌ తేజ్‌ కథానాయకుడిగా నటించిన ‘చిత్రలహరి’ సినిమా విడుదలై ఆదివారంతో ఏడాది అయ్యింది. ఈనేపథ్యంలో సాయిధరమ్‌ తేజ్‌ తాజాగా ట్విటర్‌ వేదికగా నెటిజన్లతో ముచ్చటించారు. #AskSaiTej పేరుతో అభిమానులతో చాట్‌ చేశారు. నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన ఆసక్తికరమైన సమాధానాలు తెలిపారు. ఆ విశేషాలివే..  

పవన్‌కల్యాణ్‌ ఫొటోల్లో మీకు బాగా నచ్చిన ఫొటోని మాతో పంచుకోగలరు?

సాయిధరమ్‌ తేజ్‌: పవన్‌ మొదటి సినిమా షూట్‌కు సంబంధించిన ఫొటోల్లో ఇది ఒకటి. ఇది నాకెంతో ఇష్టమైన ఫొటో.

మీకు ఎప్పటికీ గుర్తుండే ఓ మధుర జ్ఞాపకం?

సాయిధరమ్‌ తేజ్‌: నా జీవితంలో ఎన్నో మరచిపోలేని మధురానుభూతులున్నాయి. కానీ ప్రేమాభిమానాలు, సపోర్ట్‌ పొందిన రోజుని ఎప్పటికీ మర్చిపోలేను.

మీకు ఇష్టమైన క్రీడ?

సాయిధరమ్‌ తేజ్‌: క్రికెట్‌

ఏదైనా నేర్చుకోడానికి సంవత్సర కాలాన్ని మీకు ఇస్తే.. ఏం నేర్చుకుంటారు?

సాయిధరమ్‌ తేజ్‌: కొత్త భాషను నేర్చుకోవడమంటే నాకెంతో ఇష్టం.

లాక్‌డౌన్‌ కారణంగా షూటింగ్స్‌ను మిస్‌ అవుతున్నారా?

సాయిధరమ్‌ తేజ్‌: బాగా మిస్ అవుతున్నాను.

రవితేజ గురించి ఒక్కమాటలో చెప్పండి? అలాగే ఆయనతో మీ మల్టీస్టారర్‌ ఎప్పుడు ఉంటుంది?

సాయిధరమ్‌ తేజ్‌: మంచి స్ర్కిప్ట్‌ కోసం మేము ఎదురుచూస్తున్నాం.

మీ అమ్మ మిమ్మల్ని ముద్దుగా తేజు అని కాకుండా ఇంకా ఏమని పిలుస్తారో తెలుసుకోవాలని ఉంది?

సాయిధరమ్‌ తేజ్‌: ముద్దు పేర్లు అంటూ ఏమీ లేవు. కేవలం తేజ్‌ లేదా తేజు

మీ ఫేవరెట్‌ క్రికెటర్‌ ఎవరు?

సాయిధరమ్‌ తేజ్‌: మైకేల్‌ బెవన్‌, యువరాజ్‌, ధోని

పవన్‌కల్యాణ్‌తో కలిసి సినిమా చేసే ఛాన్స్‌ వస్తే ఎలాంటి సినిమా చేస్తారు?

సాయిధరమ్‌ తేజ్‌: పక్కా.. ఊర మాస్‌ మసాలా ఎంటర్‌టైనర్‌  

యువతకి బాగా కనెక్ట్‌ అయ్యేలా ‘చిత్రలహరి’ సినిమాని ఎంచుకున్నారు. ఆ కథ వినగానే మీ ఫీలింగ్‌ ఏమిటి?

సాయిధరమ్‌ తేజ్‌: కథ విన్నా వెంటనే ఆ సినిమాని మిస్‌ కాకూడదనిపించింది. ఇప్పటి యువత తప్పకుండా చూడాల్సిన చిత్రమిది.

కల్యాణ్‌ మామయ్య మిమ్మల్ని ఫాలో అయ్యాక ఏమనిపించింది?

సాయిధరమ్‌ తేజ్‌: షాక్‌, థ్రిల్‌ అలాగే కొంచెం బాధ్యతగా అనిపించింది.

మీ తదుపరి చిత్రం ‘సోలో బ్రతుకే సో బెటరు’ గురించి ఏమైనా చెప్పగలరు?

సాయిధరమ్‌ తేజ్‌: మనలోని చాలామంది తప్పకుండా ఈ చిత్రానికి కనెక్ట్‌ అవుతారు.

ప్రతిరోజూ పండగే చిత్రం తర్వాత మారుతితో కలిసి మరో సినిమా చేస్తానని మీరు చెప్పారు? ఆ సినిమా ఎప్పుడు ఆరంభమైంది?

సాయిధరమ్‌ తేజ్‌: హ హ్హ హ్హ.. అదంతా మారుతి అన్న చేతిలో ఉంది. ఆయనే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పగలరు.

మీరు ఎవరితో మల్టీస్టారర్‌ చెయ్యాలనుకుంటున్నారు?

సాయిధరమ్‌ తేజ్‌: రవితేజ అలాగే నా బావ వరుణ్‌ తేజ్‌

‘సోలో బ్రతుకే సో బెటరు’ కోసం వైజాగ్‌లో షూటింగ్‌ చేయడం ఎలా ఉంది?

సాయిధరమ్‌ తేజ్‌: వైజాగ్‌లో షూటింగ్‌ నాకెంతో నచ్చింది. ఇప్పటివరకూ నేను షూటింగ్‌ చేసిన బెస్ట్‌ లోకేషన్స్‌ అన్నింటిలో వైజాగ్‌ కూడా ఒక్కటి. 

మీరు తప్పకుండా పోషించాలనుకుంటున్న డ్రీమ్‌ రోల్ లేదా ఛాలెంజింగ్‌ రోల్‌?

సాయిధరమ్‌ తేజ్‌: చాలా ఉన్నాయి. దేవకట్టా చిత్రంలో నేను పోషించబోయే పాత్ర చాలా ఛాలెంజింగ్‌గా ఉండనుంది.

కరోనా మహమ్మారి సమయంలో మానసికంగా ఇబ్బంది పడుతున్నవారికి మీరు ఇచ్చే సందేశం ఏమిటి?

సాయిధరమ్‌ తేజ్‌: ప్రకృతి కంటే ఎవరూ గొప్పవారు కాదు. బతకండి.. బతకించండి. కుటుంబసభ్యులతో కలిసి సరదాగా గడిపేందుకు సమయం వచ్చినందుకు సంతోషించండి. మీ గురించి మీరు మరింత తెలుసుకోడానికి ఇదో మంచి సమయం.

ఇటీవల విడుదలైన మలయాళం సినిమాల్లో మీకు నచ్చిన చిత్రం?

సాయిధరమ్‌ తేజ్‌: డ్రైవింగ్‌ లైసెన్స్‌ బాగా నచ్చింది.

అల్లు అర్జున్‌ నుంచి మీరు ఏం నేర్చుకున్నారు?

సాయిధరమ్‌ తేజ్‌: మా తరంలో ఎక్కువ కష్టపడి పనిచేసే నటుడు. సినిమా సినిమాకీ ఏదో ఒక కొత్తదనం చూపిస్తుంటాడు.

ప్రస్తుతం మీరు కొత్త దర్శకులను ప్రోత్సహిస్తారా?

సాయిధరమ్‌ తేజ్‌: ప్రస్తుతం నేను నూతన దర్శకుడితోనే పనిచేస్తున్నాను. అలాగే ఆసక్తికరమైన, విభిన్న కథలతో మరింత మంది కొత్త దర్శకులతో పనిచేయనున్నాను. 

ఎన్టీఆర్‌ గురించి ఒక్కమాటలో చెప్పండి?

సాయిధరమ్‌ తేజ్‌: సినీ ఇండస్ట్రీలో ఉన్న ఓ స్నేహితుడు. సినీ ఇండస్ట్రీలోకి రాకముందు నేను ఆయన్ని కలిశాను. టాలెంటెడ్‌ యాక్టర్‌ 

ఈ ఫొటో గురించి ఒక మాట చెప్పండి?

సాయిధరమ్‌ తేజ్‌: నా రెండు కళ్లు

మీకు నచ్చిన హాలీవుడ్‌ నటుడు?

సాయిధరమ్‌ తేజ్‌: నాకు చాలామంది హాలీవుడ్‌ నటులంటే ఇష్టం. ది రాక్‌ అంటే కొంచెం ఎక్కువ అభిమానం.

కుటుంబసభ్యులు కాకుండా మీ 2AM ఫ్రెండ్‌ ఎవరు?

సాయిధరమ్‌ తేజ్‌: నా చిన్నప్పటి నుంచి నవీన్‌, వైష్ణవ్‌ తేజ్‌, వరుణ్‌ తేజ్‌ నాకు మంచి స్నేహితులు. అలాగే మరో ముగ్గురు నా కాలేజ్‌ స్నేహితులు.

సెలబ్రిటీ అయినప్పటి నుంచి మీ గురించి మీరు ఏం నేర్చుకున్నారు?

సాయిధరమ్‌ తేజ్‌: నా గురించి నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. అలాగే ఇప్పటికీ నేర్చుకుంటున్నాను. 

యాక్టింగ్‌ కాకుండా మీలో ఉన్న స్కిల్స్‌ ఏమిటి?

సాయిధరమ్‌ తేజ్‌: నాకు ఆటలు ఆడడం అంటే ఇష్టం. ఫుట్‌బాల్‌ మాత్రం ఎలా ఆడాలో తెలియదు. ఇప్పటికీ ఎన్నోసార్లు ఆడాను కానీ విఫలమయ్యాను.

నెగిటివ్‌ రోల్‌ ఏమైనా చేస్తే చూడాలనుకుంటున్నాం?

సాయిధరమ్‌ తేజ్‌: తప్పకుండా.. నాకు కూడా ‘దార్‌’ సినిమాలో షారుఖ్‌ పోషించిన పాత్ర లాంటిది చేయాలని ఉంది.

మీ విజయ రహస్యం ఏమిటి?

సాయిధరమ్‌ తేజ్‌: ప్రతి ఒక్కరిలో ఉండే రహస్యం అది. హార్డ్‌ వర్క్‌

నేను ప్రేమించిన అమ్మాయికి పెళ్లి అవుతుంది. నేను ఏం చెయ్యాలి? మీ సమాధానం కోసం ఎదురుచూస్తున్నాను?

సాయిధరమ్‌ తేజ్‌: ‘శంకర్‌దాదా ఎంబీబీస్‌’ చిత్రంలో మన బాస్‌ ఏం చెప్పాడు.. ‘చైల చైల’ సాంగ్‌ ఒక్కసారి చూడండి

సత్యరాజ్‌ సర్‌ మీకు యాక్టింగ్‌లో ఏమైనా టిప్స్‌ ఇచ్చారా?

సాయిధరమ్‌ తేజ్‌: ఆయన నుంచి ఎన్నో విషయాలను నేర్చుకున్నాను. ఆయన నడిచే విశ్వవిద్యాలయం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని