సమంత నా కుటుంబ సభ్యురాలు

డ్యాన్సర్‌గా కెరీర్‌ను ప్రారంభించి.. ప్రస్తుతం టాలీవుడ్‌లో స్టార్‌ కొరియోగ్రాఫర్‌గా పేరుపొందిన వ్యక్తి జానీ. టాలీవుడ్‌ అగ్రకథానాయకులు చిరంజీవి, పవన్‌కల్యాణ్‌, రామ్‌చరణ్‌, అల్లు అర్జున్‌, ఎన్టీఆర్‌ సినిమాల్లోని పలు పాటలకు ఆయన కొరియోగ్రఫీ చేశారు. ఇటీవల ఆయన కొరియోగ్రఫీ...

Published : 18 Apr 2020 18:31 IST

పవన్‌ సినిమాలో ఉంటానని భావిస్తున్నా: జానీ మాస్టర్‌

హైదరాబాద్‌: డ్యాన్సర్‌గా కెరీర్‌ను ప్రారంభించి.. ప్రస్తుతం టాలీవుడ్‌లో స్టార్‌ కొరియోగ్రాఫర్‌గా పేరుపొందిన వ్యక్తి జానీ. టాలీవుడ్‌ అగ్రకథానాయకులు చిరంజీవి, పవన్‌కల్యాణ్‌, రామ్‌చరణ్‌, అల్లు అర్జున్‌, ఎన్టీఆర్‌ సినిమాల్లోని పలు పాటలకు ఆయన కొరియోగ్రఫీ చేశారు. ఇటీవల ఆయన కొరియోగ్రఫీ చేసిన ‘బుట్టబొమ్మా’ పాట సైతం సినీ ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంది. లాక్‌డౌన్‌ కారణంగా షూటింగ్స్‌ లేకపోవడంతో ఇంటికే పరిమితమైన ఆయన తాజాగా ట్విటర్‌ వేదికగా అభిమానులతో ముచ్చటించారు. ఆ విశేషాలివే..  

ఎన్టీఆర్‌, చెర్రీ, అల్లు అర్జున్‌.. ఈ ముగ్గురిలో మీ అభిమాన డ్యాన్సర్‌ ఎవరు?

జానీ‌: వాళ్లందరూ ఇష్టమే. అలాగే వాళ్లతోపాటు మిగిలిన వాళ్లు కూడా నాకు ఇష్టమైన డ్యాన్సర్లే

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా గురించి చెప్పగలరు?

జానీ‌: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ భారతదేశం గర్వించదగ్గ చిత్రమవుతోంది

‘ఎన్టీఆర్‌ 30’ సినిమాలో బెస్ట్‌ డ్యాన్స్‌ కావాలి?

జానీ‌: ఛాన్స్‌ వస్తే తప్పకుండా మంచి డ్యాన్స్‌ నెంబర్స్‌ ఇవ్వాలనుకుంటున్నాను

పవన్‌తో సింపుల్‌ మాస్‌ స్టెప్పులు వేయిస్తే చూడాలని ఉంది?

జానీ‌: నాకు కూడా ఆయనతో మాస్‌ స్టెప్పులు వేయించాలని ఉంది.

పునీత్‌ రాజ్‌కుమార్‌ గురించి ఏమైనా చెప్పగలరు?

జానీ‌: స్టార్‌డమ్‌ను మించి ఆయనలో సాయం చేసే గుణం ఉంది

‘వకీల్‌సాబ్‌’ చిత్రంలో మీరు ఏమైనా పాటలకు కొరియోగ్రఫీ చేస్తున్నారా?

జానీ‌: ‘వకీల్‌ సాబ్‌’ సినిమాలో డ్యాన్స్‌కు స్కోప్‌ ఉంటుందని నేను భావించడం లేదు. కానీ పవన్‌ తదుపరి సినిమాల్లో నేను కూడా భాగమవుతానని ఆశిస్తున్నాను.

నితిన్‌తో పనిచేయడం ఎలా ఉంది?

జానీ‌: దాదాపు పదకొండు సంవత్సరాల తర్వాత ఆయనతో కలిసి పనిచేయడం నాకెంతో సంతోషంగా అనిపించింది. బాగా ఎంజాయ్‌ చేశాను.

మీరు ఇప్పటివరకూ కొరియోగ్రఫీ చేసిన పాటల్లో ఏ పాట ఎక్కువగా నచ్చింది?

జానీ‌: ఇప్పటివరకూ నేను నా బెస్ట్‌ ఇచ్చానని ఎప్పుడూ అనుకోలేదు. కానీ అతి త్వరలోనే నేను నా బెస్ట్‌ ఇవ్వనున్నాను.

చరణ్‌ గురించి ఒక్కమాటలో చెప్పగలరు?

జానీ‌: ఆయనను ఎవరితోను పోల్చలేం. ఆకాశమే ఆయనకు హద్దు.

ధనుష్‌ గురించి మీ అభిప్రాయం?

జానీ‌: మంచి నటుడు, డ్యాన్సర్‌. ఎన్నో విజయాలను అందుకున్నప్పటికీ చాలా వినయంగా ఉంటారు. డౌన్‌ టు ఎర్త్‌

షూటింగ్స్‌ మిస్‌ అవుతున్నారా?

జానీ‌: నిజం చెప్పాలంటే బాగా మిస్‌ అవుతున్నాను.

సల్మాన్‌ ‘రాధే’ సినిమాలో మీరు కనిపించనున్నారా?

జానీ‌: లేదు

తారక్‌ అన్న సినిమాకి కొరియోగ్రఫీ చేసినప్పుడు మీ మైండ్‌లో మెదిలే మాట ఏమిటి?

జానీ‌: మాటలు రావు. విజిల్సే..

చరణ్‌ సినిమాలకు కొరియోగ్రఫీ చేసినప్పుడు మీకు ఏం అనిపిస్తుంది?

జానీ‌: థియేటర్లు దద్దరిల్లిపోవాలనిపిస్తుంది. ప్రతి హీరో సినిమా కోసం పనిచేసినప్పుడు నాకు ఇలాగే అనిపిస్తుంది.

మీ అభిమాన క్రికెటర్‌?

జానీ‌: సచిన్‌ 

రామ్‌చరణ్‌ను మొదటిసారి కలిసినప్పుడు మీ ఫీలింగ్‌ ఏమిటి?

జానీ‌: యువరాజు అంటే ఇలా ఉంటాడు. చిరంజీవిలోని గ్రేస్‌, పెర్ఫామెన్స్, అందం అలా దింపేశారు.

కొరియోగ్రాఫర్‌ కాకపోయి ఉంటే ఏం చేసేవారు?

జానీ‌: జవాన్‌

కొరియోగ్రాఫర్‌ అయ్యాక మీలో వ్యక్తిగతంగా వచ్చిన మార్పులు ఏమిటి?

జానీ‌: ప్రభుదేవా మాస్టర్‌తో కలిసి పనిచేశాక నేను చాలా మారాను.

లాక్‌డౌన్‌ పూర్తయ్యిన వెంటనే ఏం చేస్తారు?

జానీ‌: మా అమ్మను కలుస్తాను. అలాగే నా వర్కర్ల కుటుంబాలను, కొన్ని వృద్ధాశ్రమాలకు వెళ్లి వాళ్ల ఆరోగ్యం ఎలా ఉందో చూస్తాను.

అల్లు అర్జున్‌తో కలిసి బుట్టబొమ్మా సాంగ్‌ చేయడం ఎలా అనిపించింది?

జానీ‌: మేము ఎంతో టెన్షన్‌, హడావిడిగా ఆ పాటను చిత్రీకరించాం. కానీ ఇప్పుడు ఆ పాటకు వస్తోన్న రెస్పాన్స్‌ చూసి అప్పుడు పడిన టెన్షన్‌ మొత్తం మర్చిపోయాను.

‘పుష్ప’ సినిమాలో బన్నీ అన్నతో మంచి స్టెప్పులు వేయించు బ్రో?

జానీ‌: మా దర్శకుడి ఛాయిస్‌ మీద అది ఆధారపడి ఉంటుంది

బాలయ్య-బోయపాటి సినిమా కోసం పనిచేస్తున్నారా?

జానీ‌: పిలుపు కోసం వెయిటింగ్‌

‘ఆచార్య’లో మెగాస్టార్‌తో వర్క్‌ చేస్తున్నారా?

జానీ‌: చూద్దాం.. 

నటీమణుల్లో మీకు ఇష్టమైన డ్యాన్సర్‌ ఎవరు?

జానీ‌: శ్రీదేవి

పవన్‌ కల్యాణ్‌ సినిమాల్లో ఏది ఇష్టం?

జానీ‌: జానీ

మీకు స్ఫూర్తి ఎవరు?

జానీ‌: ప్రభుదేవా

సమంతకు మీరు కొరియోగ్రఫీ చేసిన పాటల్లో ఏది బాగా ఇష్టం?

జానీ‌: ఈగ. తనని నా కుటుంబసభ్యురాలిగా భావిస్తున్నాను.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని