ఓ రోజంతా ఆలోచించి ఆమెకు ఫోన్ చేశా: రానా
మిహికా బజాజ్‌కు ప్రపోజ్ చేయడం, ఆమె గురించి ఇంట్లో చెప్పడం.. అంతా చాలా సింపుల్‌గా జరిగిపోయిందని కథానాయకుడు రానా చెప్పారు. గత కొన్ని రోజులుగా మంచు లక్ష్మి ప్రముఖుల్ని ఇంటర్వ్యూ చేస్తున్న సంగతి తెలిసిందే. ‘లాక్డ్ అప్ విత్ లక్ష్మి’ పేరుతో ఆమె లైవ్ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం రానాతో మాట్లాడారు....
ఎందుకు మిహికనే ప్రేమించావు?
మంచు లక్ష్మితో లైవ్‌లో..
హైదరాబాద్: మిహికా బజాజ్‌కు ప్రపోజ్ చేయడం, ఆమె గురించి ఇంట్లో చెప్పడం.. అంతా చాలా సింపుల్‌గా జరిగిపోయిందని కథానాయకుడు రానా చెప్పారు. గత కొన్ని రోజులుగా మంచు లక్ష్మి ప్రముఖుల్ని ఇంటర్వ్యూ చేస్తున్న సంగతి తెలిసిందే. ‘లాక్డ్ అప్ విత్ లక్ష్మి’ పేరుతో ఆమె లైవ్ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం రానాతో మాట్లాడారు. మిహిక, లాక్డౌన్లో కాలక్షేపం గురించి ప్రశ్నించారు. వీరిద్దరి మధ్య సంభాషణను చూడండి..
మంచు లక్ష్మి: నువ్వు మిహికను ప్రేమిస్తున్నట్లు చెప్పినప్పుడు.. నేను ఐదు నిమిషాలు షాక్‌లో ఉన్నా. ఒక్క నిమిషంలో నీ ప్రేమ కథ చెప్పావు. తట్టుకోలేకపోయా (నవ్వుతూ).. వెంటనే ఇంటికి వెళ్లి ప్రకాశ్‌కు చెప్పా. కొకొకోలా బాటిల్ ఓపెన్ చేసే లోపు నీ ప్రేమ కథ చెప్పేశావు. కనీసం డ్రింక్ గ్లాసులో పోసే సమయం కూడా లేదు. మిహిక నీకు సరైన వ్యక్తని ఎలా అనిపించింది?
రానా: మనల్ని మనం అర్థం చేసుకున్నప్పుడు.. మనకు ఎం కావాలో, ఎవరు కావాలో తెలుస్తుంది. సరైన వ్యక్తిని కలిసినప్పుడు ప్రేమ పుడుతుంది. ఆమెను చూసినప్పుడు తనే నా లవ్ అనిపించింది. కొన్నేళ్ల నుంచి తను తెలిసినా.. ఈ మధ్యే ఆ ఫీలింగ్ కలిగింది.
మంచు లక్ష్మి: మీ ఫొటోలు చాలా క్యూట్‌గా ఉన్నాయి. నీ పెళ్లంటే నాకు చాలా ఉత్సుకతగా ఉంది. మా రానా పెళ్లి అవుతోందోచ్ అని ఎంతో ఆనందంగా ఉన్నా. లిటిల్ రానా, మిహిక నా కళ్ల ముందు తిరుగుతుంటే చూడాలని ఉంది. నువ్వు ఆమెకు ఎలా ప్రపోజ్ చేశావు?
రానా: ఫోన్ ద్వారా తనకు నేను ప్రేమిస్తున్న విషయం చెప్పా.. తర్వాత తను నన్ను కలిసింది. నేను ఈ విషయం వెల్లడించిన తర్వాత చాలా మంది నుంచి సందేశాలు, కాల్స్ వచ్చాయి. శుభాకాంక్షలు చెప్పారు.
మంచు లక్ష్మి: రానా.. నన్ను ఎందుకు ఇష్టపడలేదు అని ఎవరైనా అన్నారా?
రానా: అలా ఎవరూ మాట్లాడలేదు. అందరూ పాజిటివ్‌గానే విష్ చేశారు.
మంచు లక్ష్మి: నా పెళ్లి సమయంలో కాస్త కంగారు పడ్డా. నీకు అలా ఏమైనా ఉందా?
రానా: పెళ్లి త్వరగా చేసుకునే వ్యక్తికి బహుశా.. భయం, కంగారు ఉంటాయేమో. కానీ నేను ఎదిగాను కాబట్టి అలాంటి ఫీలింగ్స్ లేవు. మిహికది హైదరాబాద్. నార్త్ ఇండియాలో పెరిగింది. ముంబయిలో మా ఫ్రెండ్స్ గ్యాంగ్ ఒకటే.
మంచు లక్ష్మి: ‘ఆరు నిమిషాల్లో అంతా అయిపోయిందమ్మా’ అని మీ అమ్మ నాకు చెప్పారు. ఆ ఆరు నిమిషాలు కూడా.. మూడు రోజులపాటు రెండు, రెండు నిమిషాల్లో చెప్పావట?
రానా: నవ్వుతూ.. అవును. అంతా అలా జరిగిపోయింది. ఎటువంటి సమస్యలు రాలేదు. ఇంట్లో ప్రతి ఒక్కరు నా పెళ్లి కోసం ఎదురుచూశారు. ఇప్పుడు ఎంతో ఆనందంగా ఉన్నారు.
మంచు లక్ష్మి: సాధారణంగా అమ్మాయికి ఎలా ప్రపోజ్ చేయాలి, ఆమె మనకు సరైన భాగస్వామేనా? అంటూ నిద్ర, తిండి మానేసి ఆలోచిస్తుంటారు కదా. నువ్వు కూడా ఆలోచించావా?
రానా: ఓ రోజంతా ఆలోచించి.. సాయంత్రం ఆమెకు చెప్పా.
మంచు లక్ష్మి: మిహికకి ఉంగరం తొడిగావా?
రానా: లేదు.. ఇది కేవలం రోకా మాత్రమే.. ఆమె వేలు కూడా ముట్టుకోలేదు (సరదాగా). (వెంటనే మంచు లక్ష్మి అందుకుని.. నా చెవిలో పువ్వులు పెట్టొద్దు. భౌతిక దూరమా?(నవ్వులు)
మంచు లక్ష్మి: లాక్డౌన్ ఎలా గడిచింది?
రానా: లాక్డౌన్ ప్రారంభమైన తర్వాత ఇంట్లో ఏం చేయాలో అర్థం కాలేదు. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్.. చూశా. పుస్తకాలు చదివా. సెట్‌కు వెళ్లి, నటించే పరిస్థితి లేదు. కాసేపు టాకింగ్.. కాసేపు యానిమేషన్ చేశా. ‘వై ఆర్ యు’ అనే ఫన్ షోను రూపొందించా. త్వరలో అది ఓటీటీ ఫ్లాట్‌ఫాంలో విడుదల కాబోతోంది.
మంచు లక్ష్మి: లాక్డౌన్ తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయని అనుకుంటున్నావు?
రానా: ఇకపై అందరూ భౌతిక దూరం పాటించాల్సి వస్తుంది. దగ్గరికి వెళ్లి గ్రీట్ చేసుకోవడం, హగ్ చేసుకోవడం ఉండవు. పరిస్థితులు మారుతాయి. ఈ లాక్డౌన్ ఎంతో నేర్పింది. సమస్య ఏదైనా సరే దానితో పోరాడాల్సిందే కదా.. ఎలాగైనా అధిగమించాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చిరంజీవితో ఆ పాటకు డ్యాన్స్ వేయడం కష్టంగా అనిపించింది: రాధ
నటి రాధ ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆమె కెరీర్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. -
Prithviraj Sukumaran: అందుకు మలయాళ ఇండస్ట్రీ నాపై అసూయ పడిందేమో: పృథ్వీరాజ్ సుకుమారన్
తన కొత్త సినిమా ‘ఆడుజీవితం’ ప్రచారంలో భాగంగా హైదరాబాద్‌కు వచ్చారు మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమార్. ఆ చిత్రం గురించి పలు విశేషాలు పంచుకున్నారు. -
alitho saradaga: డబ్బులు అడుగుతానేమోనని కొందరు తప్పించుకు తిరిగేవాళ్లు: పుల్లెల గోపీచంద్
ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఆలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చారు. చాముండేశ్వర నాథ్‌తో కలిసి ఆయన చెప్పిన సంగతులేంటంటే.. -
Anupama Parameswaran: అందుకు బోర్ ఫీలయ్యా.. గ్లామర్ డోస్‌పై స్పందించిన అనుపమ
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ జంటగా నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. ఈ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్లో హైదరాబాద్‌లో జరిగింది. -
Priyadarshi: స్వచ్ఛమైన హాస్యంతో సినిమా ఓ పెద్ద సవాల్
‘‘కథానాయకుడు అనగానే ఒక ప్రత్యేకమైన ఇమేజ్‌కి పరిమితం చేసినట్టు ఉంటుంది. స్వేచ్ఛగా ఉండలేను. నన్ను నేను ఓ నటుడిగా చూసుకోవడానికే ఇష్టపడతా’’ అన్నారు ప్రియదర్శి. -
Sivaji: ఆలీ అన్నా.. దయచేసి ఎన్నికల్లో పోటీ చేయొద్దు: శివాజీ
ఇప్పటి రోజుల్లో రాజకీయాలు వ్యాపారంగా మారాయన్నారు నటుడు శివాజీ. డబ్బులు ఖర్చుపెట్టడంతోపాటు వివిధ మార్గాల్లో ఆ మొత్తాన్ని తిరిగి లాక్కొనేవారికే పాలిటిక్స్ సెట్ అవుతాయన్నారు. -
Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్.. ఆ ఉద్దేశంతో పెట్టలేదు : అల్లరి నరేశ్
నరేశ్ హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో నరేశ్ పాల్గొని సందడి చేశారు. -
Raghu Karumanchi: స్టాక్‌మార్కెట్.. రూ.కోట్లలో నష్టపోయా: రఘు
ఈటీవీలో ప్రసారమవుతోన్న సెలబ్రిటీ టాక్ షో ‘చెప్పాలని ఉంది’ (Cheppalani Vundi). బాలాదిత్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఈ కార్యక్రమంలో తాజాగా టాలీవుడ్ హాస్యనటుడు రఘు కారుమంచి (Raghu Karumanchi) పాల్గొన్నారు. తన కెరీర్ విశేషాలు పంచుకున్నారు. -
Akash Puri: అప్పటి వరకు నాన్న దర్శకత్వంలో నటించను: ఆకాశ్ పూరి
తన తండ్రి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రస్తుతానికి నటించాలనుకోవడంలేదని నటుడు ఆకాశ్ తెలిపారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. -
Suhaas: రూ.3 కోట్ల రెమ్యూనరేషన్.. సుహాస్ ఏమన్నారంటే!
తాజాగా ‘ప్రసన్నవదనం’ టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఇందులో సుహాస్ తన రెమ్యూనరేషన్పై స్పందించారు. -
Gopichand: ఆ పిల్లల చదువుకు సాయం చేస్తున్నా.. చెప్పకపోవడానికి కారణమదే: గోపీచంద్
ప్రముఖ హాస్యనటుడు ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీ వేదికపై విశేష ఆదరణ సొంతం చేసుకున్న సెలబ్రిటీ టాక్ షో ‘ఆలీతో సరదాగా’ (Alitho Saradaga). ఈ షో సెకండ్ సీజన్ తాజాగా మొదలైంది. తొలి ఎపిసోడ్‌కు గోపీచంద్ (Gopichand) అతిథిగా విచ్చేశారు. -
Gopichand: భీమా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయే పాత్ర: గోపీచంద్
భీమా ప్రమోషన్స్‌లో భాగంగా హీరో గోపీచంద్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. -
మూఢ నమ్మకాలు లేని దెయ్యం సినిమా ‘వళరి’
‘హారర్ సినిమాల సంఖ్య తగ్గుతున్న సమయంలో.. ఆ లోటును ‘వళరి’ చిత్రం తీర్చేయడానికి త్వరలో రాబోతుంది’ అంటున్నారు దర్శకురాలు మ్రితికా సంతోషిణి. దర్శకురాలిగా ఆమె రూపొందించిన తొలి చిత్రమిది. రితికా సింగ్, శ్రీరామ్ ప్రధాన పాత్రల్లో నటించారు. -
Varun Tej: కల్యాణ్ బాబాయ్ ఇలా చెప్పడం అరుదు: వరుణ్ తేజ్
తన కొత్త సినిమా ‘ఆపరేషన్ వాలెంటైన్’ మార్చి 1న విడుదల కానున్న సందర్భంగా విలేకరులతో ముచ్చటించారు హీరో వరుణ్ తేజ్. -
Sundeep Kishan: అలా చేసుంటే మీ సినిమా బ్లాక్‌బస్టర్ అయ్యేది: సందీప్ కిషన్‌తో అభిమాని
తన అభిమానులతో సోషల్ మీడియా వేదికగా ముచ్చటించారు హీరో సందీప్ కిషన్. -
Janhvi Kapoor: నాన్న ఆ విషయం నాకూ చెప్పలేదు: జాన్వీ కపూర్
బాలీవుడ్ నటి జాన్వీకపూర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ‘దేవర’ సినిమా విశేషాలతో పాటు మరికొన్ని సంగతులు పంచుకున్నారు. -
Varun Tej: ఆ సీక్వెల్లో నేనెందుకు నటిస్తా?.. చరణ్ చేస్తాడు: వరుణ్ తేజ్
వరుణ్ తేజ్ తాజా చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ఆయన పాల్గొని సందడి చేశారు. -
Miss World 2024 Pageant: నాపై ఒత్తిడేమీ లేదు.. మిస్ వరల్డ్ -2024 పోటీదారు సినిశెట్టి.. ఆసక్తికర కబుర్లు
Miss World 2024: ఫిబ్రవరి 18 నుంచి భారత్ వేదికగా మిస్ వరల్డ్ 2024 పోటీలు జరగనున్న నేపథ్యంలో భారత్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సినిశెట్టి పంచుకున్న విషయాలు.. -
Prudhvi Raj: ఆ కష్ట సమయంలో నన్ను ఆదుకుంది ఇండస్ట్రీనే: పృథ్వీరాజ్
హాస్యనటుడు బలిరెడ్డి పృథ్వీరాజ్ ‘చెప్పాలని ఉంది’ కార్యక్రమానికి హాజరయ్యారు. తన సినీ, రాజకీయ అనుభవాలను పంచుకున్నారు. -
Ravi Teja: ఆ విషయం ముందే చెప్పడం నాకు ఇష్టంలేదు: వరుణ్‌తేజ్‌తో రవితేజ
రవితేజ, వరుణ్ తేజ్.. తమ కొత్త చిత్రాల విశేషాలను ఒకరికొకరు పంచుకున్నారు. అవేంటో చూసేయండి.. -
Venu: అలా అనుకొనే వారికి సమాధానమే ‘బలగం’..: వేణు యెల్దండి
హాస్యనటుడు, దర్శకుడు వేణు యెల్దండి ‘చెప్పాలని ఉంది’ కార్యక్రమానికి హాజరయ్యారు. తన సినీ జీవితం, అనుభవాలను పంచుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రభుత్వం మారినప్పుడు కఠిన చర్యలు తీసుకుంటాం: రాహుల్ గాంధీ
-
ఫోన్‌ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్‌రావుకు 14 రోజుల రిమాండ్
-
అనన్య-ఆదిత్య ఫొటోషూట్.. అల్లు అర్జున్-స్నేహారెడ్డి స్పెషల్ మూమెంట్
-
తెలంగాణలో పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు.. ఏప్రిల్ ఒకటి నుంచి వడగాల్పులు
-
కొరియాపై ఐరాస ఆంక్షల వల్ల ప్రయోజనం లేదు: రష్యా
-
టిల్లు స్క్వేర్.. రూ.100 కోట్ల గ్రాస్ వస్తుందనుకుంటున్నా: నాగవంశీ