సినిమా చూసి నటి కావాలనుకున్నా: నిధి అగర్వాల్‌

వేరే రంగంలో స్థిరపడాలనుకుని అనుకోకుండా సినీ పరిశ్రమలోకి వచ్చిన ఎంతో మంది నటీనటులను చూశాం. కానీ నిధి అగర్వాల్‌కి మాత్రం చిన్నప్పటి నుంచే వెండితెరపై సందడి చేయాలనే కల ఉండేదట. అందుకు అనుగుణంగానే...

Published : 30 May 2020 10:36 IST

బ్యూటీ సీక్రెట్‌ షేర్‌ చేసిన నటి

హైదరాబాద్‌: వేరే రంగంలో స్థిరపడాలనుకుని అనుకోకుండా సినీ పరిశ్రమలోకి వచ్చిన ఎంతో మంది నటీనటులను చూశాం. కానీ నిధి అగర్వాల్ మాత్రం అలా కాదట.. చిన్నప్పటి నుంచే వెండితెరపై సందడి చేయాలనే కల ఉండేదట. అందుకు అనుగుణంగానే మోడలింగ్‌ రంగంలోకి వచ్చి అక్కడి నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టానని ఈ ఇస్మార్ట్‌భామ వెల్లడించారు. లాక్‌డౌన్‌ కారణంగా షూటింగ్స్‌ మిస్‌ అవుతున్న నిధి అగర్వాల్‌ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాలను వెల్లడించారు.

‘చిన్నప్పుడు మొదటిసారి సినిమా చూసినప్పుడు నాకెంతో ఆనందంగా అనిపించింది. ఆ సమయంలోనే నటి కావాలని ఫిక్స్‌ అయ్యాను. ఆ కలను సాకారం చేసుకోవడానికి ఏం చేయాలో అవగాహన కూడా నాకు లేదు. సినీ పరిశ్రమలో తెలిసిన వాళ్లు కూడా లేరు. కాకపోతే ఆ కలను సాకారం చేసుకునేందుకు మోడలింగ్‌లోకి అడుగుపెట్టా. మోడలింగ్‌లో మంచి పేరు పొందిన తర్వాత బాలీవుడ్‌లో టైగర్‌ష్రాఫ్‌తో కలిసి నటించే అవకాశం వరించింది. కొంతకాలానికి దక్షిణాది చిత్రాల్లో ఆఫర్స్‌ వచ్చాయి’

‘నాగచైతన్య నటించిన ‘సవ్యసాచి’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాను. ఇటీవల పూరీజగన్నాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇస్మార్ట్‌శంకర్‌’ చిత్రం మంచి హిట్‌ అందించింది. తెలుగు సినిమాలో నటించడం అద్భుతంగా ఉంది. ఈవిధంగా కొత్త భాషను నేర్చుకుంటున్నాను. అలాగే నా ప్రతిభను మరో ఇండస్ట్రీకి పరిచయం చేయగలిగాను. బెంగళూరులో ఉండడం వల్ల బాలీవుడ్‌తోపాటు దక్షిణాది సినిమాల్లో కూడా నటించాలనే కోరిక ముందు నుంచే ఉంది.’

‘లాక్‌డౌన్ కారణంగా కొంతకాలం నుంచి పబ్‌జీ గేమ్‌ ఆడుతున్నాను. శాకాహారిని అయినప్పటికీ ఇటీవల ఓ చికెన్‌ డిన్నర్‌ తిన్నాను(విన్నర్‌ విన్నర్‌ చికెన్‌ డిన్నర్‌). ఆన్‌లైన్‌ కోర్సులు చేస్తున్నా. తమిళం, తెలుగు మాట్లాడడం నేర్చుకుంటున్నా. అలాగే సినిమాలు, టీవీ షోలు చూస్తున్నా. బిజీగా ఉన్నప్పుడు ఏం చేయలేకపోయానో ఇప్పుడు అవన్నీ పూర్తి చేస్తున్నా’ 

‘నా శరీరాకృతిని చాలా మంది మెచ్చుకుంటున్నారు. ఆరోగ్యంగా ఉండేందుకు మంచి హెల్తీ ఫుడ్‌ తీసుకుంటాను. మంచినీళ్లు ఎక్కువగా తాగుతాను. రోగనిరోధక శక్తిని పెంచుకోవడం కోసం ప్రస్తుతం విటమిన్‌ సి అధికంగా ఉండే ఆహారాన్ని తింటున్నాను. మొదటి నుంచి నేను శాకాహారినే కావడం వల్ల ఆకుకూరలు, పండ్లు ఎక్కువగా తినడానికి ఆసక్తి చూపిస్తాను. ఉదయాన్నే టిఫిన్‌లో ఇడ్లీ, మధ్యాహ్నం లంచ్‌లో రైస్‌ తీసుకుంటాను. అలాగే ప్రతిరోజూ క్రమం తప్పకుండా వర్కౌట్లు చేస్తాను. లేకపోతే బరువు పెరిగే అవకాశం ఉంది.’ 

‘నా దృష్టిలో అందం అంటే చాలా సింపుల్‌గా కనిపించడమే. అందుకే నేను మేకప్‌పై ఎక్కువ శ్రద్ధ చూపించను. సాధారణమైన మేకప్‌ను మాత్రమే వాడతాను. వైద్యులు సూచించిన ఫేస్‌వాష్‌, Dior క్రీమ్‌, మాయిశ్చరైజర్‌ తప్పకుండా ఉపయోగిస్తాను’ అని నిధి అగర్వాల్‌ తెలిపారు.

నిధి కథానాయికగా తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిత్రం ‘భూమి’. లాక్‌డౌన్‌ తర్వాత ఈ సినిమా ప్రేక్షకులను అలరించనుంది. దీనితోపాటు ఆమె తెలుగులో గల్లా అశోక్‌ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రంలో నటించాల్సి ఉంది.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు