జయలలిత జీవితంతో పోలికలున్నాయి

నటి రమ్యకృష్ణ కీలకపాత్ర పోషించిన వెబ్‌ సిరీస్‌ ‘క్వీన్‌’. గౌతమ్‌ మీనన్‌ దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌ సీజన్‌-1 గతేడాది ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. ఇందులో రమ్యకృష్ణ తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత...

Updated : 12 Jun 2020 06:04 IST

సీజన్‌-2 ఎ‌ప్పుడు ప్రారంభమవుతుందో తెలియదు

చెన్నై: నటి రమ్యకృష్ణ కీలకపాత్ర పోషించిన వెబ్‌ సిరీస్‌ ‘క్వీన్‌’. గౌతమ్‌ మేనన్‌ దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌ సీజన్‌-1 గతేడాది ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. ఇందులో రమ్యకృష్ణ తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత హావభావాలతో కనిపించి అందర్నీ ఆకట్టుకున్నారు. తాజాగా ఆమె ‘క్వీన్‌’ గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు.

‘మేము తెరకెక్కించిన ‘క్వీన్‌’ చూసి జయలలిత జీవితాన్ని ఆధారంగా చేసుకుని రూపొందించామని చాలామంది అనుకుంటున్నట్లు దర్శకుడు తెలిపారు. నిజం చెప్పాలంటే అనిత శివకుమార్‌ రచించిన పుస్తకాన్ని ఆధారంగా చేసుకుని దీనిని రూపొందించాం. నాకు కూడా ఈ సిరీస్‌ బాగా నచ్చింది. ఎందుకంటే జయలలిత కథతో దీనికి పోలికలున్నాయి. ఆమె ధైర్యం, తెగింపు నాకెంతో ఇష్టం నిజంగానే ఆమె క్వీన్‌.’

‘గౌతమ్‌ నన్ను కలిసి ఈ కథ చెప్పగానే ఆసక్తి పెరిగింది. నేను పోషించిన శక్తిశేషాద్రి పాత్ర కోసం నన్ను నాలా ఉండమన్నారు. సంభాషణలను పవర్‌ఫుల్‌గా రాశారు. ముఖ్యంగా ఇంటర్వ్యూ సమయంలో రాసిన సంభాషణలు అద్భుతంగా అనిపించాయి.’

‘‘క్వీన్‌’ సీజన్‌-2 కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నాను. త్వరగా షూటింగ్‌లో భాగం కావాలని ఉంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో షూటింగ్స్‌ ఎప్పుడు ప్రారంభమవుతాయో ఇంకా స్పష్టత రాలేదు. ఇటీవల నేను రేష్మా(రచయిత)తో మాట్లాడాను. సీజన్‌-2 స్ర్కిప్ట్‌ సిద్ధం చేసినట్లు ఆమె చెప్పింది. సీజన్‌-2 మరింత ఆసక్తికరంగా, ఉత్కంఠభరితంగా ఉంటుంది’ అని రమ్యకృష్ణ వివరించారు.

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని