సల్మాన్‌ టాకీస్‌

హీరోలు నటించడంతో పాటు పలు చిత్ర నిర్మాణ రంగాల్లోకి అడుగుపెడుతున్నారు. ఈ మధ్య హీరోలు థియేటర్ల రంగంలోకి జోరుగానే వస్తున్నారు. బాక్సాఫీసు వద్ద వసూళ్ల వర్షం కురిపించే..

Published : 23 Nov 2021 02:44 IST

హీరోలు నటించడంతో పాటు పలు చిత్ర నిర్మాణ రంగాల్లోకి అడుగుపెడుతున్నారు. ఈ మధ్య హీరోలు థియేటర్ల రంగంలోకి జోరుగానే వస్తున్నారు. బాక్సాఫీసు వద్ద వసూళ్ల వర్షం కురిపించే సత్తా ఉన్న ప్రముఖ హీరో సల్మాన్‌ఖాన్‌ కూడా థియేటర్లు మొదలుపెట్టాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. ‘సల్మాన్‌ టాకీస్‌’ అనే పేరు కూడా అనుకున్నారు. కానీ అది కార్యరూపం దాల్చలేదు. తాజాగా ఈ విషయం గురించి ఓ ఇంటర్వ్యూలో ఆయన స్పందించారు. ‘‘థియేటర్లు మొదలు పెట్టాలనే ఆలోచన నాకు ఉంది. దీని కోసం కొన్ని సన్నాహాలు కూడా చేశాం. కానీ కరోనా కారణంగా ముందుకు వెళ్లలేదు. కానీ ఏదో ఒక రోజు అది నిజం అవుతుంది’’అని చెప్పారు. ‘‘ముంబయి లాంటి మహా నగరాల్లో కాకుండా చిన్న చిన్న పట్టణాల్లో థియేటర్లు నిర్మించాలనేది నా కోరిక. థియేటర్లు సరిగ్గా అందుబాటులో లేని చోట ఏర్పాటు చేయాలనుకుంటున్నాం’’అని చెప్పారు సల్మాన్‌. ఆయన కీలక పాత్రలో నటించిన ‘అంతిమ్‌’ డిసెంబరులో రానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని