స్టార్‌డమ్‌ అంత సులువుగా రాదు

‘‘యువ నటులు స్టార్‌ హోదా సంపాదించడానికి ఇంకా కష్టపడాలి’’ అంటున్నారు బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ఖాన్‌. ఆయుష్‌ శర్మతో కలిసి ఆయన నటిస్తున్న చిత్రం ‘అంతిమ్‌’. ఇది ఈ నెల 25న థియేటర్లలో విడుదల కానుంది.

Published : 24 Nov 2021 01:07 IST

‘‘యువ నటులు స్టార్‌ హోదా సంపాదించడానికి ఇంకా కష్టపడాలి’’ అంటున్నారు బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ఖాన్‌. ఆయుష్‌ శర్మతో కలిసి ఆయన నటిస్తున్న చిత్రం ‘అంతిమ్‌’. ఇది ఈ నెల 25న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా   సల్మాన్‌ఖాన్‌ విలేకరులతో ‘‘స్టార్‌ డమ్‌ ఊరికే రాదు. బాగా నటించిన మాత్రాన వస్తుందంటే కాదు.. దానికి చాలా శ్రమించాల్సి ఉంటుంది. వృత్తిగతంగా, వ్యక్తిగతంగానూ గట్టిగా ప్రయత్నించాలి. మిమ్మల్ని మీరు నిరూపించుకోవాలి. 40 ఏళ్లుగా నేను, షారుఖ్‌, అక్షయ్‌, అజయ్‌లు స్టార్స్‌ హోదాలో ఉన్నాం. దాన్ని అంత సులభంగా కొత్తతరానికి ఇవ్వం. వాళ్లే దాన్ని కష్టపడి సాధించాలి.’’ అని చెప్పుకొచ్చారు. ‘‘ఎన్ని ఓటీటీలు వచ్చినా... తాత్కాలికంగా థియేటర్లు తెరవకపోయినా... హాల్లో అందరితో కలిసి సినిమా చూడటం అనే అనుభూతి మరెందులోనూ ఉండదు. అందుకే థియేటర్లు మళ్లీ కళకళలాడతాయ’’న్నారు సల్మాన్‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని