
‘రన్‌వే 34’గా మారిన ‘మేడే’
అజయ్‌దేవ్‌గణ్, అమితాబ్‌బచ్చన్, రకుల్ ప్రీత్ సింగ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘మేడే’. ఈ చిత్రాన్ని ‘రన్‌వే 34’ మార్చినట్లు చిత్రబృందం సోమవారం ప్రకటించింది. కొత్త టైటిల్‌కు సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్‌లను కూడా పంచుకుంది. అజయ్‌దేవ్‌గణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కుతోంది. ఈ థ్రిల్లర్ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 29న విడుదల కానున్నట్లు అజయ్‌దేవ్‌గణ్ ప్రకటించారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.