Updated : 01/12/2021 04:55 IST

ప్రాణం పెట్టి దేశం కోసం ఆడాలి

‘‘గ్రౌండ్‌ బయట మన జీవితాల్లో ఏం జరిగినా ఒక్కసారి యూనిఫాం వేసుకొని గ్రౌండ్‌లో దిగిన తర్వాత మనకు ఉండాల్సింది ఒకటే లక్ష్యం.. ప్రాణం పెట్టి దేశం కోసం ఆడటం..’’అంటూ భావోద్వేగ సంభాషణలతో ఆకట్టుకుంటోంది ‘83’ ట్రైలర్‌. భారత క్రికెట్‌ జట్టు 1983లో సాధించిన ప్రపంచ కప్పు నేపథ్యంగా సాగే చిత్రమిది. ప్రధానంగా కెప్టెన్‌ కపిల్‌దేవ్‌ కేంద్రంగా కథ నడుస్తుంది. ప్రముఖ దర్శకుడు కబీర్‌ఖాన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కపిల్‌దేవ్‌గా రణ్‌వీర్‌సింగ్‌ నటించాడు. ఆయన భార్య పాత్రని దీపికా పదుకొణె పోషించింది. మంగళవారం ఈ సినిమా ట్రైలర్‌ విడుదలై అలరిస్తోంది. అప్పటి క్రికెట్‌ ప్రపంచ కప్పు ఎలా ఆగింది? మన టీమ్‌ ఎదుర్కొన్న ఇబ్బందులు, ఆనంద క్షణాలతో సమ్మిళితంగా ట్రైలర్‌ సాగుతుంది. హిందీ వెర్షన్‌ ట్రైలర్‌ను రణ్‌వీర్‌సింగ్‌, తెలుగు వెర్షన్‌ను కథానాయకుడు నాగార్జున ట్విటర్‌ ద్వారా విడుదల చేశారు. ఈ నెల 24న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.

Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని