
Published : 05 Dec 2021 02:38 IST
ప్రాజెక్ట్ కె... రామోజీ ఫిల్మ్‌సిటీలో దీపిక
ప్రభాస్ కథానాయకుడిగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ‘ప్రాజెక్ట్ కె’ పేరుతో ఇప్పటికే ఒక షెడ్యూల్‌ని పూర్తి చేసుకున్న ఈ సినిమా చిత్రీకరణ పునః ప్రారంభమైంది. ‘రాధేశ్యామ్’, ‘ఆదిపురుష్’ చిత్రాల్ని పూర్తి చేసిన ప్రభాస్ ఇప్పుడు ‘ప్రాజెక్ట్ కె’పై దృష్టి సారించారు. ఆదివారం నుంచి రామోజీ ఫిల్మ్‌సిటీలో కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. అందుకోసం బాలీవుడ్ భామ దీపికా పదుకొణె హైదరాబాద్‌కి చేరుకుంది. చిత్రాన్ని నిర్మిస్తున్న వైజయంతీ మూవీస్ సంస్థ దీపికాకి ఘనంగా ఆహ్వానం పలికింది. సైన్స్‌తో ముడిపడిన ఫిక్షన్ కథతో రూపొందుతున్న ఈ సినిమాలో ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ ఓ కీలక పాత్రని పోషిస్తున్నారు. ఇదివరకు ఆయనపైనే కీలక సన్నివేశాల్ని తెరకెక్కించారు. మిక్కీ జె.మేయర్ స్వరాలు సమకూరుస్తున్నారు.
Tags :