హిందీ ‘విక్రమ్‌ వేద’.. మరింత అద్భుతంగా

తమిళంలో విజయవంతమైన ‘విక్రమ్‌ వేద’ సినిమా.. ఇప్పుడు బాలీవుడ్‌లో పునర్నిర్మితమవుతోంది. హృతిక్‌ రోషన్‌, సైఫ్‌ అలీఖాన్‌, రాధికా ఆప్టే ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మాతృకను రూపొందించిన పుష్కర్‌, గాయత్రి ద్వయమే ఇప్పుడు హిందీ వెర్షన్‌ను తెరకెక్కిస్తున్నారు.

Published : 07 Dec 2021 01:36 IST

మిళంలో విజయవంతమైన ‘విక్రమ్‌ వేద’ సినిమా.. ఇప్పుడు బాలీవుడ్‌లో పునర్నిర్మితమవుతోంది. హృతిక్‌ రోషన్‌, సైఫ్‌ అలీఖాన్‌, రాధికా ఆప్టే ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మాతృకను రూపొందించిన పుష్కర్‌, గాయత్రి ద్వయమే ఇప్పుడు హిందీ వెర్షన్‌ను తెరకెక్కిస్తున్నారు. దీన్ని టీ సిరీస్‌, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, ఫ్రైడే ఫిల్మ్‌ వర్క్స్‌, వైనాట్‌ స్టూడియోస్‌ సంస్థలు నిర్మిస్తున్నాయి. ఇటీవలే అబుదాబిలో తొలి షెడ్యూల్‌ ప్రారంభించుకున్న ఈ సినిమా.. తాజాగా చిత్రీకరణ పూర్తి చేసుకుంది. 27 రోజుల పాటు జరిగిన ఈ షెడ్యూల్‌లో హృతిక్‌తో పాటు ఇతర ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. త్వరలో లక్నోలో ప్రారంభమయ్యే రెండో షెడ్యూల్‌లో సైఫ్‌ అలీఖాన్‌ పాల్గొననున్నారు. ఈ సందర్భంగా దర్శకులు పుష్కర్‌, గాయత్రి మాట్లాడుతూ ‘‘ఓ చక్కటి యాక్షన్‌ ప్యాక్డ్‌ థ్రిల్లర్‌గా ఈ సినిమాని రూపొందిస్తున్నామ’’న్నారు. ‘‘నాలుగేళ్ల క్రితం తమిళంలో విడుదలైన ‘విక్రమ్‌ వేద’ని.. ఇప్పుడు హిందీలో ఇంకా అద్భుతంగా ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నాం’’అన్నారు చిత్ర నిర్మాతలు. ఈ సినిమా వచ్చే ఏడాది సెప్టెంబర్‌ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని