‘ఖైదీ’ హిందీలో ‘భోలా’

కార్తి నటించిన ‘ఖైదీ’ తమిళంతో పాటు తెలుగులోనూ విడుదలై మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాని హిందీలో రీమేక్‌ చేయడానికి అజయ్‌ దేవగణ్‌ ఎప్పటినుంచో సన్నాహాలు చేస్తున్నారు. కొవిడ్‌  పరిస్థితుల కారణంగా కుదర్లేదు. ఎట్టకేలకు ఈ సినిమా గురువారం లాంఛనంగా ప్రారంభమైంది.

Published : 14 Jan 2022 02:14 IST

కార్తి నటించిన ‘ఖైదీ’ తమిళంతో పాటు తెలుగులోనూ విడుదలై మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాని హిందీలో రీమేక్‌ చేయడానికి అజయ్‌ దేవగణ్‌ ఎప్పటినుంచో సన్నాహాలు చేస్తున్నారు. కొవిడ్‌  పరిస్థితుల కారణంగా కుదర్లేదు. ఎట్టకేలకు ఈ సినిమా గురువారం లాంఛనంగా ప్రారంభమైంది. ఈ విషయాన్ని అజయ్‌దేవ్‌గణ్‌ ట్విటర్‌ ద్వారా తెలియజేశారు. ‘‘పరిస్థితులు అనుకూలించి ఉంటే ఈ చిత్రం గత ఏడాదే  సెట్స్‌పైకి వెళ్లి విడుదల కావాలి. మొత్తానికి ఈ గురువారం సెట్స్‌పైకి వెళ్లింది. ప్రకాష్‌ బాబు, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థలు నిర్మిస్తున్నాయి’’అంటూ ట్వీట్‌ చేశారు. ధర్మేంద్ర శర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ‘భోలా’ అనే పేరుని ఖరారు చేశారు. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న కారణంగా తక్కువమంది సిబ్బందితో చిత్రీకరణ చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు