డూప్‌ లేకుండా పోరాటాలు

సినిమాల్లో యాక్షన్‌ ఘట్టాలు చేయడంలో దీపిక ఆరితేరింది. ‘చాందిని చౌక్‌ టు చైనా’ చిత్రంలో ఆమె మార్షల్‌ ఆర్ట్స్‌తో అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి పోరాటాల్లో తన ప్రతిభను

Published : 18 Jan 2022 00:33 IST

సినిమాల్లో యాక్షన్‌ ఘట్టాలు చేయడంలో దీపిక ఆరితేరింది. ‘చాందిని చౌక్‌ టు చైనా’ చిత్రంలో ఆమె మార్షల్‌ ఆర్ట్స్‌తో అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి పోరాటాల్లో తన ప్రతిభను చాటబోతుంది. షారుక్‌ఖాన్‌ కథానాయకుడిగా సిద్ధార్థ్‌ ఆనంద్‌ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘పఠాన్‌’. పూర్తిస్థాయి యాక్షన్‌ చిత్రంగా రాబోతున్న ఈ చిత్రం కోసం గత కొన్ని నెలలుగా దీపిక ప్రత్యేకంగా సిద్ధమవుతోంది. ఈ చిత్రం కోసం ఎలాంటి డూప్‌ లేకుండా చేయబోతున్నట్లు తాజాగా తెలుస్తోంది. ‘‘నేను క్రీడా నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చాను. తెరపై సొంతంగా పోరాటాలు చేయడం ఎప్పుడూ నాకు ఎంతో ఇష్టం’’అని పలు సందర్భాల్లో చెప్పింది దీపిక. ఇందులో జాన్‌ అబ్రహం మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. సల్మాన్‌ఖాన్‌ అతిథి పాత్రలో మెరవబోతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని