ఏప్రిల్‌ 14నే ‘లాల్‌సింగ్‌చద్ధా’

బాలీవుడ్‌లో ఒక్కో సినిమా వేసవిలో రిలీజ్‌ డేట్స్‌ ఫిక్స్‌ చేసుకుంటున్నాయి. ఇప్పటికే పలు వాయిదాలు పడుతూ వచ్చిన ఆమిర్‌ఖాన్‌ చిత్రం ‘లాల్‌సింగ్‌చద్ధా’ను గతంలో ప్రకటించినట్లుగానే ఏప్రిల్‌ 14న విడుదల చేస్తామని చిత్ర వర్గాలు శుక్రవారం అధికారికంగా ప్రకటించాయి. యశ్‌ నటించిన ‘కేజీఎఫ్‌-2’ ఇదే రోజున ప్రేక్షకుల ముందుకు రానుండటంతో

Published : 22 Jan 2022 02:02 IST

బాలీవుడ్‌లో ఒక్కో సినిమా వేసవిలో రిలీజ్‌ డేట్స్‌ ఫిక్స్‌ చేసుకుంటున్నాయి. ఇప్పటికే పలు వాయిదాలు పడుతూ వచ్చిన ఆమిర్‌ఖాన్‌ చిత్రం ‘లాల్‌సింగ్‌చద్ధా’ను గతంలో ప్రకటించినట్లుగానే ఏప్రిల్‌ 14న విడుదల చేస్తామని చిత్ర వర్గాలు శుక్రవారం అధికారికంగా ప్రకటించాయి. యశ్‌ నటించిన ‘కేజీఎఫ్‌-2’ ఇదే రోజున ప్రేక్షకుల ముందుకు రానుండటంతో ‘లాల్‌సింగ్‌ చద్ధా’ మరోసారి వాయిదా పడనుందని నెట్టింట వార్తలు వస్తున్నాయి. వీటిని ఆపేందుకు ఆమిర్‌ఖాన్‌ బృందం రంగంలోకి దిగింది. ‘‘ఎటువంటి పరిస్థితుల్లోనూ ఏప్రిల్‌ 14, 2022న ‘లాల్‌సింగ్‌చద్ధా’ను విడుదల చేస్తాం. ఎలాంటి ఆటంకాలు వచ్చినా ఇక ఆగేది లేదు. ఈ చిత్రం బాగా రావడానికి కృషిచేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు’’ అంటూ ట్వీట్‌ చేశారు. ఆంగ్ల చిత్రం ‘ఫారెస్ట్‌గంప్‌’ స్ఫూర్తితో తెరకెక్కుతున్న చిత్రమిది. దీనికి అద్వైత చందన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు కథానాయకుడు నాగచైతన్య ఈ సినిమాలో ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రం విడుదలపై ఆమిర్‌ఖాన్‌ మాట్లాడుతూ ‘‘కొవిడ్‌ నేపథ్యం, తలెత్తిన సమస్యలు, వాయిదాలు... తదితర విషయాలను కేజీఎఫ్‌-2 చిత్ర బృందానికి వివరించాను. తప్పని పరిస్థితుల్లోనే అదే రోజు విడుదల చేయాల్సి వస్తోందని నచ్చజెప్పాను. వారు అంగీకరించారు. అందుకే ఏప్రిల్‌ 14న మేం ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం.’’ అన్నారు. ఇదే రోజున తమిళ అగ్ర కథానాయకుడు విజయ్‌ నటిస్తున్న ‘బీస్ట్‌’ చిత్రాన్ని విడుదల చేస్తారని తెలుస్తోంది. మొత్తానికి ఏప్రిల్‌ నెల భారతీయ సినీపరిశ్రమకు ఊపిరి పోస్తుందని సినీవర్గాలు ఆశిస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని