
Published : 25 Jan 2022 01:47 IST
అనుకున్న సమయానికే ‘భూల్ భులయ్యా 2’
కరోనా దెబ్బకు బాలీవుడ్ సినిమాలన్నీ వాయిదా బాట పట్టాయి. షాహిద్ కపూర్ ‘జెర్సీ’తో మొదలైన వాయిదాల పర్వం కొనసాగుతూనే ఉంది. దీంతో కొన్ని నెలల ముందుగానే విడుదల తేదీ ప్రకటించిన సినిమాలపైనా వాయిదా వార్తలు వస్తున్నాయి. తాజాగా ‘భూల్ భులయ్యా 2’ని వాయిదా పడిందంటూ వార్తలు మొదలయ్యాయి. దీంతో చిత్రబృందం స్పందించింది. ‘‘వాయిదా ఏం లేదు. ముందుగా అనుకున్న సమయానికే మార్చి 25న థియేటర్లలో ‘భూల్ భులయ్యా 2’ ప్రేక్షకుల ముందుకు రానుంది’’అని చిత్ర బృందం ప్రకటించింది. కార్తీక్ ఆర్యన్, కియారా అడ్వాణీ జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని అనీష్ బజ్మీ తెరకెక్కిస్తున్నారు
Tags :